ముద్దుకు పది లక్షలు


10 lakhs for lip lockఒక్క ముద్దు కు పది లక్షలు , అది కూడా ఘాటు లిప్ లాక్ కు పది లక్షలు నజరానా ఇచ్చారట నిర్మాతలు . ఇంతకీ ఈ ముద్దు గోల ఎందులో ఎక్కడ ఎవరు ఇచ్చారో తెలుసా …… రంగస్థలం చిత్రంలో చరణ్ కు సమంత లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం సరిగ్గా రాలేదట ! ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ సీన్ అనుకున్న విధంగా రాకపోయేసరికి నిర్మాత వచ్చి సరిగ్గా తీస్తే అరగంటలో తీస్తే పది లక్షలు ఇస్తానని చెప్పాడట !

 

దాంతో సుకుమార్ తన టీమ్ తో కలిసి బాగా ఆలోచించి అరగంటలోనే సమంత చరణ్ కు ముద్దు పెట్టె సన్నివేశాన్ని చిత్రీకరించాడట . ఇచ్చిన మాట ప్రకారం నిర్మాత పది లక్షలను ఇచ్చాడట దాంతో ఆ డబ్బు ని రచయితలు పంచుకున్నారట . సమంత ముద్దు పెట్టె సన్నివేశం ముందుగానే సమంత కు చెప్పారట ! కానీ చరణ్ కు మాత్రం చెప్పలేదట అందుకే అంత సహజంగా ఆ సీన్ వచ్చిందని అంటున్నాడు సుకుమార్ . మొత్తానికి పది లక్షలు ఇవ్వడం వల్ల అనుకున్న సీన్ బాగా వచ్చింది .