2018 ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న లిస్ట్ ఇదే


2018 fim fare awards contestants listజూన్ 16న 65 వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక జరుగనుంది . ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా ఈ వేడుకకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈసారి మాత్రం చాలా రంజుగా సాగనుంది అవార్డుల కార్యక్రమం ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి , బాలకృష్ణ ల చిత్రాలు పోటీ పడుతున్నాయి ఈసారి అలాగే ప్రభాస్ బాహుబలి 2 తో పాటు యంగ్ స్టర్స్ చిత్రాలు కూడా సై సై అంటున్నాయి దాంతో అవార్డులు ఇచ్చే కమిటీ కి కత్తిమీద సామే ! తెలుగు నుండి ఫిలిం ఫేర్ అనుకోవడానికి పోటీ పడుతున్న జాబితా ఒకసారి చూద్దామా !

ఉత్తమ కథానాయకుడి కేటగిరి లో :

1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)
2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )

ఉత్తమ చిత్రం కేటగిరీ లో :

1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) బాహుబలి 2

ఉత్తమ దర్శకుల కేటగిరీ లో :

1) క్రిష్ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
2) ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
3) సందీప్ రెడ్డి వంగా ( అర్జున్ రెడ్డి )
4) శేఖర్ కమ్ముల ( ఫిదా )
5) సంకల్ప్ రెడ్డి ( ఘాజి )
6) సతీష్ వేగేశ్న ( శతమానం భవతి )

ఉత్తమ కథానాయకి కేటగిరి లో :

1) అనుష్క ( బాహుబలి 2)
2) రితిక సింగ్ ( గురు )
3) నివేదా థామస్ ( నిన్ను కోరి )
4) సాయి పల్లవి ( ఫిదా )
5) రకుల్ ప్రీత్ సింగ్ ( రారండోయ్ వేడుక చూద్దాం )

వీటితో పాటుగా పలువురు కేటగిరి లలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు . అయితే ఉత్తమ కథానాయకుడు ఎవరు ? ఉత్తమ చిత్రం ఏది ? అన్న దాంట్లో మాత్రం టెన్షన్ పట్టడం ఖాయం .