Home Audio Reviews
TOLLYWOOD
 AUDIO REVIEWS

నాన్నకు ప్రేమతో ఆడియో రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ రిలయన్స్ సంస్థ తో కలిసి నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో '. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు . దేవిశ్రీ ప్రసాద్ ,భాస్కర భట్ల , చంద్రబోస్ లు రాసిన పాటలు ఎన్టీఆర్ అభిమానులను అలరించేలా ఉన్నాయా లేదా అన్నది తెలియాలంటే పాటల విశ్లేషణ లోకి వెళ్ళాల్సిందే .  మొదటి పాట ; ఫాలో ...... ఫాలో అంటూ సాగే పాట ఈ ఆల్బం లో మొదటి పాట కాగా ఈ పాటని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ రాయడం విశేషం ,ఇక ఈ పాటని ఎన్టీఆర్ పాడటం మరో విశేషం . దేవిశ్రీ ఎంత కసిగా ఈ పాట రాసాసో అంతే కసిగా ఎన్టీఆర్ కూడా పాడిన ఈ పాట నాన్నకు ప్రేమతో ఆల్బం కే హైలెట్ .  రెండవ పాట : నా మనసు నీలో అంటూ సాగే ఈ పాటని భాస్కర భట్ల రాయగా డిఎస్పీ ,షర్మిల ఆలపించారు . రొమాంటిక్ గా సాగే ఈ పాట మెలోడీ ప్రధానంగా సాగింది . మూడవ పాట : చంద్రబోస్ రాసిన ఈ పాట ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా అలరించడం ఖాయం ఎందుకంటే గతకొంత కాలంగా ఎన్టీఆర్ ని కొంతమంది కావాలనే దూరం పెడుతున్నారు దాంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టడం జరగోచ్చేమో కానీ తొక్కడం మాత్రం ఎవరి వల్లా కాదని ఎంత తొక్కితే బంతి లాగ అంత పైకి వచ్చే శక్తి ఉందని చాటి చెప్పి మనోస్తైర్యం నింపే పాట ఇది . ఇక ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చి ఉండొచ్చు . డోంట్ స్టాప్ అంటూ సాగే ఈ పాటని రఘు దీక్షిత్ ఆలపించాడు .  నాల్గవ పాట : లవ్ మీ ఎగైన్ అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ రాయగా సూరజ్ సంతోష్ ఆలపించాడు . ప్రేమ లోని మాధుర్యాన్ని వర్ణించే ఈ పాట ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం .  ఇక ఆల్బం లో చివరి పాట 'లవ్ దెబ్బ ' అంటూ వచ్చే ఈ పాటని చంద్రబోస్ రాయగా దీపక్ ,శ్రావణ భార్గవి ఆలపించారు . ఈ పాట యుత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం .  విశ్లేషణ : మొత్తం 5 పాటలున్న ఈ ఆల్బం లో రెండు పాటలు మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు . మొదటి పాట ,చివరి పాట విపరీతంగా అలరించే పాటలు కాగా మిగతావి కూడా వినగా వినగా ఆకట్టుకునే పాటలు . దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం నాన్నకు ప్రేమతో మరింత ప్లస్ కానుంది అని చెప్పవచ్చు .  రేటింగ్ : 3/5

శ్రీమంతుడు ఆడియో రివ్యూ

శ్రీమంతుడు ఆడియో రివ్యూ,రేటింగ్ : 3,మహేష్ బాబు -శృతి హాసన్ జంటగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం \'\'శ్రీమంతుడు \'\'. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రాయడం విశేషం . 1 ఒక్కడినే తర్వాత మహేష్ - దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ శ్రీమంతుడు ఆడియో ఎలా ఉందో ఓ లుక్కేద్దాం .మొదటి పాట : రామ రామ ,రామ రామ అంటూ సాగే మొదటి పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కావడంతో శ్రీరాముడి లోని సుగుణాలను హీరోకి ఆపాదిస్తూ రామజోగయ్య శాస్త్రి చక్కగా రాసి అభిమానుల చేత కేక పెట్టించాడు . సూరజ్ సంతోష్ ,రవీనా రెడ్డి ఆలపించిన ఈపాట యూత్ ని బాగా ఆకట్టుకునేలా రూపొందింది. ఈపాట ఈ ఆల్బంకే హైలెట్ గా నిలుస్తుంది .రెండవ పాట : జత కలిసే జతకలిసే జగములు రెండు జతకలిసే జతకలిసే జగములు రెండు అంటూ సాగే పాటని దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ -సుచిత్ర ఆలపించారు . మెలోడీ ప్రధానంగా సాగే ఈపాట సాహిత్య పరంగా బాగున్నప్పటికీ ఇది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా మాత్రం లేదు . వినగా వినగా నచ్చవచ్చు . హీరో -హీరోయిన్ ల మద్య సాగే ఈ పాట సో సోగానే ఉంది .మూడవ పాట :చారుశీల చారు శీల అంటూ సాగే పాటని యాజిన్ నిజార్ పాడగా మద్య మద్యలో వచ్చే  దేవిశ్రే హమ్మింగ్ హైలెట్ గా నిలుస్తుంది . హీరోయిన్ ని ఆటపట్టిస్తూ ఆమెపై ఉన్న ప్రేమ ని వ్యక్తపరిచే ఈ పాట కూడా అందరినీ అలరించడం ఖాయం . రామజోగయ్య శాస్త్రి ఈ పాటలో ఆంగ్ల పదాలను అల్లిన తీరు బాగుంది .నాల్గవ పాట : శ్రీమంతుడా టైటిల్ సాంగ్ శ్రీమంతుడా అంటూ సాగే నాల్గవ పాట టైటిల్ సాంగ్ ని ఎం ఎల్ ఆర్ కార్తికేయన్ పాడారు. ఈ పాట హీరో ముందున్న లక్ష్యం ఏంటో ? అతను చేయవలసిన పనులేంటో చెప్పే విధంగా ఉంది .ఈ పాట వినడం కంటే తెరమీద చూస్తే ఇంకా బాగుండేలా ఉంది .ఐదవ పాట :జాగో,జాగో అంటూ సాగే ఐదవ పాటని రఘు దీక్షిత్ ఆలపించాడు . ఈ పాటని కూడా రామజోగయ్య శాస్త్రి నే రాసాడు , హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది అది ఎలాంటి మార్పులకు లోనయ్యిందన్న కోణంలో వచ్చే పాట . ఇక మధ్యమధ్యలో వచ్చే జాగో ............ జాగోరే జాగో అంటూ వచ్చే హమ్మింగ్ కూడా పాటని మరింత శ్రవణానంద కరంగా మార్చింది . ఇక ఆరవ పాట అయిన దిమ్మతిరిగే అంటూ వచ్చే పాట మాస్ ని విపరీతంగా ఉర్రూతలూగించేలా రూపొందింది . సింహా -గీతామాధురి ఆలపించిన ఈ పాట మహేష్ అభిమానులనే కాకుండా మాస్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చేలా సాగుతుంది . పక్కా మాస్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాట థియేటర్ లో ప్రేక్షకుల చేత ఈలలు వేయించడం ఖాయం .ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఆల్బం లో 6పాటలకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించినప్పటికీ ఇందులో నాలుగు పాటలు మాత్రం శ్రోతలను విశేషంగా అలరించేలా రూపొందించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ . ఐతే సంగీత పరంగా కొత్త బాణీలను ఇవ్వకపోయినప్పటికి రొటీన్ ట్యూన్ లతోనే ప్రేక్షకులను అలరించేలా మాత్రం సంగీతం అందించడంలో దేవిశ్రీ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు . 

ఎన్టీఆర్ టెంపర్ ఆడియో రివ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'టెంపర్ '. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ కాగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అన్ని అంశాలతో చిత్రాన్ని రూపొందించే దర్శకుడు పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో టెంపర్ వస్తుందంటే అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి. దానికి తోడూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కావడం ,వరుస విజయాలు సాధిస్తున్న అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ,బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మించిన టెంపర్ ఆడియో ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.మొత్తం 5పాటలున్న టెంపర్  ఆడియో ఎలా ఉంది ఏంటో ఓ లుక్కేద్దాం . ఈ ఆల్బం లో మొదటి పాట గా ''చులెంగే ఆస్ మా '' అంటూ సాగే ఈ పాటని అద్నాన్ సమీ పాడటంతో పాటకి మరింత వన్నె వచ్చింది. విశ్వ రాసిన ఈ పాటని అద్నాన్ సమీ ,రమ్య బెహరా ,వీణ ఘంటసాల ఆలపించారు . అద్నాన్ గాత్రం ,అనూప్ స్వరాలతో మేళవించిన ఈ పాట ఆల్బం కే హై లెట్ గా నిలిచింది.ఇక రెండవ పాటగా 'టెంపర్ 'అనే టైటిల్ సాంగ్ ని భాస్కర భట్ల నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అలరించడానికి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇవ్వనుంది . ముఖ్యంగా ఇది విజువల్ గా కూడా ఫాన్స్ ఆనంద పడే పాట అవుతుంది. మాస్ ఆడియన్స్ కోసం రాసిన ఈ పాటని సింహా ,భార్గవి పిళ్ళై ,ఉమా నేహా ,కార్తికేయన్ కలిసి ఆలపించారు . మూడవ పాటగా దేవుడా అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో తెలియజెప్పే పాట . భాస్కర భట్ల రాసిన ఈ పాట కూడా కేవలం ఫాన్స్ కోసం ,మాస్ ఆడియన్స్ కోసం అన్నట్లుగా ఉంది . ఐతే ఈ పాట విశేషం ఏమిటంటే దర్శకులు పూరి జగన్నాద్ ,సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్  కలిసి ఆలపించడం . ఇది ఆ రకంగా కిక్ ఇచ్చే పాట అవుతుందేమో . నాల్గవ పాటగా వన్ మోర్ టైం అంటూ సాగే ఓ డ్యూయెట్ వస్తుంది . రంజిత్ ,లిప్సిక ఆలపించిన ఈ పాట ఓ మాదిరిగా ఉన్నప్పటికీ రొమాంటిక్ సాంగ్ కావడంతో విజువల్ గా బాగుందే అవకాశం ఉంది . ఇక ఐదవ పాట ,చివరి పాట ఐటెం సాంగ్ 'ఇట్టాగే రేచ్చిపోదాం ' అంటూ సాగుతుంది . గీతామాధురి ఆలపించిన ఈ ఐటెం సాంగ్ పూర్తిగా మాస్ ప్రేక్షకుల కోసం అన్నట్మ్లుగా ఉంది . మొత్తానికి 5పాటలున్న టెంపర్ ఆడియో యావరేజ్ అనే చెప్పాలి . ముఖ్యంగా అద్నాన్ సమీ ఆలపించిన మొదటి పాట ఆల్బం కు హై లెట్ కాగా టెంపర్ టైటిల్ సాంగ్ ,దేవుడా అంటూ సాగే పూరి -అనూప్ లు ఆలపించిన పాటలు బాగున్నాయి . మిగతావి సోసోగా ఉన్నాయి . మొత్తానికి అనూప్ స్వరాలు బాగానే ఉన్నప్పటికీ కెరీర్ లో నిలిచిపోయే హిట్ సాంగ్స్ మాత్రం కాదు .

ముకుంద ఆడియో రివ్యూ

మెగా వారసుడు వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు బుజ్జి ,ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''ముకుంద ''. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించడం విశేషం. ఇక ఆడియో విషయానికి వస్తే ఎలా ఉందో ఓ లుక్కేద్దాం . ఈ ఆల్బం లో మొదటి పాటగా ''చేసేదేదో చేసేయ్ '' అంటూ సాగే పాటతో మొదలౌతుంది. సిరివెన్నెల ఈ పాటని హీరో వ్యక్తిత్వాన్ని గురించి ,అలాగే అతడి పోకడ గురించి చెప్పే ఈ పాటని రాహుల్ నంబియార్ ,రేవంత్ లు పాడారు. ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ''దర ధమ్ దదమ్ ....... యుగాలేన్ని రాని '' అంటూ సాగే యుగలగీతాన్ని కూడా సిరివెన్నెల రాయగా సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్ ,సాయి శివాని తో కలిసి ఆలపించారు. ఈ పాట కూడా హృద్యంగా సాగుతూ యువతీ యువకులను ఆకట్టుకుంటుంది. మూడవ పాట గా ''పగటి కలో ,పడుచువలో ..... తననిలాగే తలపులలో '' అంటూ సాగే పాటని హరిచరణ్ పాడిన పాట నిజంగానే చాలా బాగుంది. నాల్గవ పాట ''గోపికమ్మ చాలునమ్మ '' అంటూ సాగే ఈ పాట ఈ ఆల్బం కే హైలెట్ గా నిలిచేలా ఉంది. ఈ పాటని చిత్ర ఆలపించారు. ఐదవ పాటగా ''అరెరే చంద్రకళ జారే నా గుండె '' అంటూ సాగే ఈ పాటని కార్తీక్ ,సాయి శివాని కలిసి ఆలపించారు. ఈ పాట కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది. ఇక ఆరవ పాటగా ''నందలాల ఎందుకీ వేలా ఇంత కలా '' అంటూ సాగే పాటని శ్వేతా పండిట్ పాడిన పాట కూడా చాలా బాగుంది. మొత్తానికి ముకుంద ఆడియో హృదయానికి హత్తుకునేలా రూపొందించి అందరి మన్ననలను పొందారు మిక్కీ జే మేయర్ . ఇక చివరగా వచ్చే ముకుంద థీమ్ కూడా బాగుంది

గోవిందుడు అందరివాడేలే ఆడియో రివ్యూ

రామ్ చరణ్ తేజ్ -కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం ''గోవిందుడు అందరివాడేలే ''. ప్రకాష్ రాజ్ ,శ్రీకాంత్ ,జయసుధ ,కమిలినీ ముఖర్జీ తదితరులు కలిసి నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు . ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో మెగా అభిమానులను అలరించేలా ఉందో లేదో ఓ లుక్కేద్దామా !ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి రిలీజ్ అయిన ఈ ఆల్బం లో మొదటగా సుద్దాల అశోక్ తేజ రచించగా హరిహరన్ పాడిన ''నీలి రంగు చీరలోన '' అనేపాట మొదలౌతుంది. ఈ పాట ఈ ఆల్బం కె హైలెట్ గా నిలిచింది. మెగా అభిమానుల తోపాటు అందరినీ ఈ పాట విశేషంగా అలరిస్తుంది. ఇక రెండవ పాట ''గులాబి కళ్ళు రెండు ముళ్ళు '' అనే పాటని శ్రీమణి రాయగా జావేద్ అలీ పాడాడు. ఈ పాట కూడా యూత్ ని ఆకట్టుకుంటుంది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ''రా ,, రాకుమర '' అనే పాట చిన్మయి వినసొంపుగా ఆలపించి హృదయాన్ని దోచుకుంటుంది. ''ప్రతీచోట నాకే స్వాగతం '' అంటూ సాగే నాల్గవ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా రంజిత్ పాడిన ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ''బావగారి చూపే '' అంటూ సాగే 5వ పాటని చంద్రబోస్ రచించగా రంజిత్ ,విజయ్ ఏసుదాసు ,సుర్ ముఖి ,శ్రీ వర్ధిని నలుగురు కలిసి పాట ఆలపించారు. ఈ పాట బావా మరదళ్ల మద్య సాగే కొంటె పాట. ఇక చివరగా ''కొక్కో కోడి '' అంటూ సాగే ఈ పాటని లక్ష్మీ భూపాల్ రాయగా కార్తీక్ ,హరిచరణ్ ,మానసి ,రీట నలుగురు ఆలపించారు . మొత్తమ్మీద అన్ని పాటలు కూడా మెలోడీ గా సాగుతూ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఈ మద్య వస్తున్న రణగొణ ధ్వనులు ఏమి లేకుండా శ్రావ్యమైన సంగీతాన్ని ఈ ఆల్బం లో వినొచ్చు. 

ఆగడు పాటల రివ్యూ:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,తమన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''ఆగడు ''. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా అతడికి ఇది యాభయ్య చిత్రం కావడం గమనార్హం. భాస్కర భట్ల ,శ్రీమణి సాహిత్యం అందించిన ఆగడు పాటలు ఎలా రూపొందాయో ఓ లుక్కేద్దమా !'‘ఆగడు'’ అంటూ సాగే ఆల్బం లోని మొదటి పాట ని శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాట అందరిని హమ్ చేసేలా ఉండి , చాలా ఎనర్జిటిక్ గా ఉంది. హీరో పవర్ ఏంటో తెలియజేసేలా లిరిక్ కుదిరింది.ఇది మాస్ అభిమానులతో పాటు మహేష్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చేలా ఉంది. ఇక రెండవ పాట రాహుల్ నంబి యార్ పాడాడు. ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంది. ఇక మూడవ పాటగా అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ,సింహా తో కలిసి పాడిన''జంక్షన్ లో '' అనే పాట మాస్ ప్రేక్షకుల కోసం పెట్టిన సాంగ్ లా ఉంది ఈ పాట వినసొంపుగా ఉన్నా ఇంకా తెరమీద బాగుండేలా ఉంది ఎందుకంటే శృతి అందాలు కూడా ఈ పాట కి తోడైతే ఆ కిక్ వేరు కదా !ఇక సంగీత దర్శకుడు తమన్ స్వయంగా పాడిన ''నారి నారి '' పాట కూడా బాగుంది సరదాగా సాగిపోయే ఈ పాట వింటున్న కొద్దీ బాగానే ఉంటుంది. ఇక ''భేల్ పూరి '' పాట ఈ ఆల్బం కే హైలెట్ గా నిలుస్తుంది . చాలా రోజుల తర్వాత తమన్ అందించిన ఓ అద్భుతమైన పాట అని చెప్పవచ్చు. మొత్తానికి తమన్ యాభయ్యవ చిత్రమైన ''ఆగడు '' కి ఆడియో పరంగా లోటు లేకుండా చేసాడనే చెప్పవచ్చు. మహేష్ అభిమానులను విశేషంగా అలరించడానికి బాగానే ప్రయత్నం చేసాడు తమన్ . ఐతే ఎవర గ్రీన్ లా నిలిచిపోయే పాటలు మాత్రం ఇవ్వలేకపోయాడు. 

ఆటోనగర్ సూర్య పాటల రివ్యూ

నాగచైతన్య ,సమంతా జంటగా దేవా కట్టా దర్శకత్వంలో అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ''ఆటోనగర్ సూర్య ''. ఇష్క్ ,గుండె జారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అనూప్ రూబెన్స్ అందిస్తున్న ఈ చిత్ర సంగీతం ఎలా ఉందో ఓ సారి చూద్దాం .'' టైం ఎంతరా ..... '' అంటూ సాగే తొలి పాటతో ఈ ఆల్బం మొదలౌతుంది ,ఈ మొదటి పాటని విజయ్ ప్రకాష్ ,కోరస్ ఆలపించగా అనూప్ అందించిన సంగీతం యూత్ ని ఆకట్టుకునేలా ఉంది . ఇక రెండవ పాట ''నువ్వు లేని నేను ....''అంటూ సాగే ఈ పాటని అనూప్ ఆలపించాడు ,ఇది యావరేజ్ గా ఉంది . మూడో పాట ని బ్రహ్మన్ ,వేణు మాధవ్ ,అనూప్ రూబెన్స్ ,సాయి చరణ్ ,అమృత వర్శిత్ లు కలిసి పాడిన ఈ పాట ''ఆటోనగర్ బ్రహ్మ ''ఇది కథలో లింక్ అయి వచ్చే పాటలా ఉంది . నాల్గవ పాట ''సురాసుర ......'' అంటూ సాగే ఈ పాటని చిత్ర ,అనూప్ రూబెన్స్ ,సంతోష్ ,రాంకీ లు ఆలపించగా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది . ఇక ఐదవ పాట మాంచి మసాల ఐటెం సాంగ్ ''హైదరాబాద్ బిర్యాని ......''అంటూ సాగే ఈ పాట మాస్ ని ఉర్రూతలూగిస్తుంది అనడం లో సందేహం లేదు . చివరి పాట ''ఆయుధం .....'' అంటూ సాగే ఈ పాటని సిద్దార్థ్ ,రఘు లతో కలిసి దేవా కట్టా ఆలపించడం విశేషం . పాటలన్నీ అనంత శ్రీరాం రచించిన ఈ ఆడియో ఆదిత్య ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది

ఎవడు ఆడియో రివ్యూ

nరామ్‌చరణ్‌ కథానాయకుడిగా శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం ఎవడు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. అల్లు అర్జున్‌ అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రం లోని పాటలు మంచి ఉపునిచ్చె విధంగా ఉన్నాయి దేవి ప్రతి సినిమాతో తన స్టామిన ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఆదిత్య ద్వార విడుదలైన ఈ ఆడియో రివ్యూ మీకోసం nఈ ఆల్బంలో వచ్చే మొదటి సాంగ్ : nఫ్రీడమ్.... గాయకుడు : సుచిత్ సురేసన్ సాహిత్యం : కృష్ణ చైతన్య nఇది సోలో సాంగ్.. చరణ్ ఎంట్రీకోసం రూపొందించిన సాంగ్ ఇది ఫాస్ట్ బీట్ తో డిఫెరెంట్ గా ఉంటూ యువతకు ప్రేరణ ఇచ్చేలా పాటను ప్రత్యేకంగా రాయించటం జరిగింది రెండవ సాంగ్ : నీ జతగా .... nసింగర్స్ : కార్తీక్, శ్రేయా ఘోషల్, సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి nమెలోడితో సాగే డ్యూయిట్ ఇది . రొమాంటిక్ మూడ్ తో సాగే ఈ పాటఅద్బుతమైన సాహిత్యంతో సాగుతుంది మంచి మెలోడీ సాంగ్ గా మొదలయ్యే ఈ పాట.బాగా పాపులర్ అవుతుంది. మూడవ సాంగ్ : అయ్యో పాపం... nగాయనీ గాయకులు : రంజిత్, మమత శర్మ , సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి nదేవి శ్రీ అంటే ఐటం సాంగ్ లకు ప్రసిద్ది. అయన గత చిత్రాల్లో లగే ఈ ఐటెం సాంగ్ కూడా ఆ స్థాయిలో ఉంది. nనాలుగవ సాంగ్ :చెలియా.... సింగర్ : కె.కె సాహిత్యం : చంద్రబోస్ nఇది ఒకరకమైన పెయిన్ సాంగ్ లాంటిదని చెప్పాలి . మంచి సాహిత్యంతో పాటు మ్యూజిక్ కంపోసిషణ్ కూడా బాగుంది nఐదవ సాంగ్ : ఓయే ఓయే.... సింగర్స్ : డేవిడ్ సిమోన్, ఆండ్రియా, సాహిత్యం : శ్రీ మణి . nమంచి ఉపునిచ్చెలా ఈ సాంగ్ ఉంటుంది. అయితే అంతకుముందు విన్న పాటలతో పోలిస్తే పెద్దగా కిక్ అనిపించలేదని చెప్పాలి. అరవపాట : పింపుల్ ... డింపుల్... సింగర్స్ : సాగర్, రనిన రెడ్డి సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి nయూత్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఈసాంగ్.మంచి సాహిత్యంతో ఆదరగోట్టిందనే చెప్పాలి. ఓవర్ అల్ గా ఈ ఎవడు సినిమా మాస్ ఆడియెన్స్ కు నచ్చే అన్ని అంశాలున్నా చిత్రం గా రూపొందింది. nఆదిత్య ద్వార విడుదలైన ఈ సి డి వేల 50/-

బలుపు ఆడియో రివ్యూ

రవితేజ, శృతి హసన్, అంజలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బలుపు, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటలు జంగ్లీ మ్యూజిక్ ద్వార ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యాయి. 1 ఈ సి డి లో మొదటి పాట కాజల్ చేల్లివా అనే పల్లవితో సాగే ఈ పాటను బాస్కర బాట్ల రాయగా రవితేజ, తమన్ లు ఆలపించారు. మాస్ ఎంటర్ టైనేర్ గా వచ్చే ఈ సాంగ్ మంచి ఊపునిస్తుంది. 2 రెండో పాట ఏమైందో ... అనే పల్లవి తో సాగే ఈ పాటను బాలు, గీతా మాధురి ఆలపించారు అద్బుతమైన మెలోడీ గా హాయిగోలుపుతుంది. చాలా రోజుల తరువాత బాలు గళం నుండి మంచి మెలోడీ వినిపించారు. 3 మూడవ పాట గా మంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ లక్ష్మి రాయ్ ఐటెం గర్ల్ గా అదరగొట్టనుంది. 4 నాలుగవ పాటగా వచ్చే పడిపోయనిల మంచి లవ్ నంబర్ గా సాగుతుంది ఈ పాటకు తోడు చిత్రీకరణ అద్బుతంగా ఉంటుంది. 5 ఐదవ పాటగా మంచి ఊపునిచ్చే సాంగ్ గా పాతికేళ్ళ చిన్నది అంటూ శృతి, రవితేజ ల మద్య సాగే మాస్ రొమాంటిక్ ఐటెం సాంగ్. ఈ పాటల్లో కొత్తదనం కనిపిస్తుంది, ఐదు పాటలు దేనికదే విబిన్నంగా ఉంటూ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి, తమన్ ఇప్పుడు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో తన సత్తా చూపిస్తున్నాడు, ఈ బలుపుతో తమన్ మరో సారి క్రేజీ మ్యూజిక్ అందించి తన స్టామిన ప్రూవ్ చేసుకున్నాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..