Home Crime Stories చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు
TOLLYWOOD
 Crime Stories

చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు



Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
కామందులు రెచ్చిపోతున్నారు ,కన్ను మిన్నూ కానక ఐదేళ్ళ చిన్నారి నుండి అరవై ఏళ్ల ముసలాళ్ళ వరకు ఎవరినీ వదలడం లేదు ....... కేవలం ఆడదా.....  అంతే!తమ పశు వాంఛ తీర్చుకోడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సంపన్న ప్రాంతం అయిన బంజారాహిల్స్ పక్కనే ఉండే పేదల ప్రాంతమైన దేవరకొండ బస్తీ లో జరిగింది. సంఘటన వివరాలలోకి వెళితే ..... బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని దేవరకొండ బస్తీలో నివసించే ఎండీ అయూబ్(50) డ్రైవర్. ఆదివారం సాయంత్రం రోడ్ నెం.3లోని షౌకత్‌నగర్‌లో ఉండే తన మామ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఈ అయూబ్ కన్నుపడింది. చాక్లెట్ ఇస్తానని కమ్యూనిటీ హాల్ పై అంతస్తులోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడి పాల్పడ్డాడు. రోదిస్తూ కిందికి పరుగులు తీసిన బాలిక అక్కడున్న వారిని అప్రమత్తం చేసి పైకి తీసుకెళ్లింది. స్థానికులు అయూబ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.అత్యాచారానికి గురైన  బాలిక ఏడుస్తూ... ‘వాడిని చంపేయండి, బతకనివ్వొద్దు’ అని అన్న మాటలు అక్కడున్న అందరి హృదయాలను కలచి వేశాయి. కాగా, పోలీసుల  మొదట బాలికపై లైంగికదాడికి యత్నం జరిగింద నుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పాపను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో లైంగికదాడి జరిగినట్టు నిర్థారణైంది. దీంతో పోలీసులు నిందితుడు అయూబ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకుడిని తక్షణమే ఉరి తీయాలని బస్తీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..