Home Crime Stories విద్యార్తి నిని రేప్ చేసిన గురువు!
TOLLYWOOD
 Crime Stories

విద్యార్తి నిని రేప్ చేసిన గురువు!



Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
విద్యాబుద్దులు చెప్పి సక్రమమైన దారిలో నడిపించాల్సిన గురువే కామంతో తన శిష్యురాలిపై అత్యాచారం జరిపి మానవతని మంట కలిపాడు. పదో తరగతి చదువుతున్న బాలికకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చెబుతానని ఇంటికి పిలిచి అత్యాచారం చేసాడు ,ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించడంతో భయపడిపోయిన ఆ బాలిక బిక్కు బిక్కు మంటూ ఇంటికి చేరింది కానీ అమ్మ్మాయి చెప్పక పోయినా .... ఆమె అవతారం ,దానికి తోడూ తీవ్ర రక్తస్రావం రావడంతో అమ్మాయి తల్లి నిలదీసే సరికి అసలు విషయం చెప్పింది. సోమవారం రాత్రి స్థానికులకు ఈ విషయం తెలియడంతో పాఠశాలను ధ్వంసం చేశారు. దాంతో కీచకుడుఅన్నవరపు శ్రీనివాసరావు పరారయ్యాడు. ఆ మేరకు బాలిక తల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైలుపేట ఐదో లైనులో జవహర్ భారతి కాన్వెంట్ స్కూల్‌ను అన్నవరపు శ్రీనివాసరావు (50) నడుపుతున్నారు.అదే ప్రాంతంలో సొంత పాఠశాలలు రెండు ఉన్నాయి. స్కూల్‌లో పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ఓ బాలికను మార్చి 26న ఇంటికి రావాలని, కష్టమైన ప్రశ్నలు చెబుతానంటూ పిలిచాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను తల్లి గట్టిగా అడ గడంతో సోమవారం మధ్యాహ్నం విషయం చెప్పింది. భర్త చనిపోవడంతో ఉన్న ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆమె పాచి పని చేసి బతికిస్తోంది.కేసు నమోదు చేసిన సి ఐ రామారావు ఎస్ ఐ బ్రహ్మం విచారణ జరుపుతున్నారు ,నిందితుడిని పట్టుకొని కటినంగా శిక్షిస్తామని చెప్పారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..