Home Featured Interview ఐటెం సాంగ్ చేసిన భామ ఇప్పుడు హీరోయిన్ గా
టాలీవుడ్
 Featured Interview

ఐటెం సాంగ్ చేసిన భామ ఇప్పుడు హీరోయిన్ గా

Sunday June 18th 2017
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా సాలిడ్ అందాల భామ అనుష్క ని తీసుకోవాలని మెగా కాంపౌండ్ భావిస్తోందట . ఇంతకుముందు మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అనుష్క . చిరు రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆ సినిమా చేయగా అప్పట్లో అనుష్క న్యూ కమ్మర్ అన్నమాట అందుకే ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు .
 
 

కట్ చేస్తే ఇప్పుడు అనుష్క రేంజ్ మారింది స్టార్ హీరోయిన్ గా తెలుగునాట వెలుగొందుతోంది . బాహుబలి తో ఆ స్టార్ డం మరింత పెరిగింది . దాంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా అనుష్క ని ఎంపిక చేయాలనీ చూస్తున్నారట . అసలు ఖైదీ నెంబర్ 150 చిత్రంలో హీరోయిన్ గా అనుష్క నే తీసుకోవాలని అనుకున్నారు కానీ అనుష్క డేట్స్ ఖాళీ లేకపోవడంతో కాజల్ వచ్చి చేరింది . మరి ఇప్పుడు డేట్స్  చూడాలి .

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..