Home Featured Interview అల్లు అర్జున్ పరువు తీసేసారు
టాలీవుడ్
 Featured Interview

అల్లు అర్జున్ పరువు తీసేసారు

Tuesday July 11th 2017
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరువు తీశారు.  డీజే దువ్వాడ జగన్నాథం సక్సెస్ మాట ఎలా ఉన్నా నాలుగు రోజుల్లోనే నాన్ బాహుబలి సినిమాల్లో నెంబర్ వన్ అంటూ ప్రచారం చేయడం అల్లు అర్జున్ కు శాపంగా మారింది . బయటి హీరోల అభిమానులు కాకుండా మెగా ఫ్యాన్స్ మూకుమ్మడిగా దాడి చేసి అల్లు అర్జున్ సినిమాని తక్కువ చేసారు . చిరంజీవి అభిమానులు దిల్ రాజు ఆఫీసు పై దండెత్తి దువ్వాడ జగన్నాథం సినిమా లెక్కలు చూపించండి అంటూ హుకుం జారీ చేసారు దాంతో వాళ్లకు సర్ది చెప్పి పంపించాడు పాపం దిల్ రాజు .
 
 

చిరంజీవి ఫ్యాన్స్ కి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బాక్స్ లు బద్దలు కొట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది , అయితే డీజే యూనిట్ చెబుతున్న దాని ప్రకారం ఖైదీ నెంబర్ 150 రికార్డులు బద్దలు అయినట్లే ! అందుకే ఆవేశంతో దిల్ రాజు ఆఫీసు కు వెళ్లారు . బాహుబలి తర్వాత స్థానం చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానిదే అని తెలుసుకొని వెళ్లిపోయారు కానీ అల్లు అర్జున్ డౌన్ డౌన్ అని నినాదాలు ఇచ్చారు .

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..