Home Featured Interview నాని హిట్టు సినిమా హిందీలోకి
టాలీవుడ్
 Featured Interview

నాని హిట్టు సినిమా హిందీలోకి

Wednesday September 06th 2017
నాని నటించిన హిట్ చిత్రం నిన్ను కోరి బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగులో మంచి హిట్ అయిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఆల్రెడీ వచ్చింది కూడా . కానీ ఆ సినిమాకు నిన్ను కోరి చిత్రానికి స్వల్ప మార్పులు ఉండటంతో మొత్తానికి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చారు సంజయ్ లీలా భన్సాలీ . నాని సినిమాపై బాలీవుడ్ చూపు పడటంతో నిన్ను కోరి నిర్మాత డివివి దానయ్య కు ఆశ పుట్టింది అందుకే డబ్బులు తీసుకోకుండా వాటా దారుడిగా చేరాడు.

నాని , నివేదా థామస్ , ఆది నటించిన నిన్ను కోరి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు . నాని పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించనున్నట్లు తెలుస్తోంది . నాని కి గత మూడేళ్ళుగా బాగానే కలిసి వస్తోంది . ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ అందుకున్న నాని నిన్ను కోరి చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాడు . ప్రస్తుతం నాని దిల్ రాజు బ్యానర్ లో ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) అనే సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా కూడా  ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

Related Links

Nani to play Army Officer in hanu film
Ninnu Kori Telugu Movie Review
ninnukori teaser news
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..