Home Justin మళ్ళీ అగ్ర హీరోలతో పోటీ పడుతున్న శర్వానంద్
TOLLYWOOD
 JUSTIN

మళ్ళీ అగ్ర హీరోలతో పోటీ పడుతున్న శర్వానంద్

Monday December 12th 2016

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బాలకృష్ణ , నాగార్జున , ఎన్టీఆర్ లకు దీటుగా పోటీ పడి మరీ తన చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు యంగ్ హీరో శర్వానంద్ . అది ఇచ్చిన జోష్ అనుకుంటా వచ్చే ఏడాది కూడా సంక్రాంతి బరిలో ఎంతమంది హీరోలు ఉన్నా నేను వచ్చేది కన్ఫర్మ్ అంటూ అప్పుడే సీటు రిజర్వ్ చేసుకున్నాడు శర్వా . వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కనున్న ''శతమానం భవతి '' చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది . డిసెంబర్ కల్లా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరిలో సంక్రాంతి బరిలో పోటీ కి దిగుతున్నామని ప్రకటించారు . కాగా అదే సంక్రాంతి లో చిరంజీవి 150 వ చిత్రం అలాగే బాలయ్య '' గౌతమీపుత్ర శాతకర్ణి '' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి . అంటే చిరు - బాలయ్య లను డీ కొట్టడానికి రెడీ అంటున్నాడు . మరి ఈసారి ఏమౌతుందో చూడాలి .

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్