Home Justin గూగుల్ మేనేజర్ ని రేప్ చేసి చంపేశారు
TOLLYWOOD
 JUSTIN

గూగుల్ మేనేజర్ ని రేప్ చేసి చంపేశారు

Thursday September 21st 2017

న్యూయార్క్ లో గూగుల్ మేనేజర్ గా పనిచేస్తున్న ''వనేస్సా మార్కోటి ''(27) అనే యువతి ని అత్యంత కిరాతకంగా రేప్ చేయడమే కాకుండా తగులబెట్టి చంపేశారు . న్యూయార్క్ లో జాబ్ చేస్తున్న వనేస్సా వీకెండ్ కోసం తల్లి ఉంటున్న ప్రిన్స్ టన్ నగరం కు వెళ్ళింది . అయితే మద్యాహ్నం వాకింగ్ కోసం అంటూ పక్కనే ఉన్న విలేజ్ రోడ్డు లోకి వెళ్ళింది . జాగింగ్ కోసం వెళ్ళిన సమయంలో కొంతమంది దుండగులు వనేస్సా పై అత్యాచారం చేసి ఆమెని గుర్తు పట్టకుండా తగులబెట్టారు . అయితే జాగింగ్ కు వెళ్ళిన కూతురు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది ఆమె తల్లి . వనేస్సా తల్లి ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు జాగిలాలతో గాలించగా ముళ్ళ పొదల్లో వనేస్సా శవమై కనిపించింది . అయితే ఆమె వంటిపై బట్టలు లేకపోగా గాయాలు కూడా ఉండటంతో ఆమె పై అత్యాచారం చేసి చంపేశారని నిర్దారణకు వచ్చారు పోలీసులు . ప్రస్తుతం ఆ చుట్టూపక్కల జాగిలాలతో జల్లెడ పడుతున్నారు పోలీసులు 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..