Home Justin అఖిల్ ఎందుకిలా
TOLLYWOOD
 JUSTIN

అఖిల్ ఎందుకిలా

Friday January 20th 2017

అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ముహూర్తం ఏంటో కాని పాపం హీరోగా నటించిన మొదటి సినిమా ఘోర పరాజయం పొందగా రెండో సినిమాకు ఎక్కడా లేని ఇబ్బందులు ఎదురౌతున్నాయి . అదిగో ఫలానా డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఓకే అయ్యిందని ,కాదు కాదు అది క్యాన్సిల్ అయ్యింది మరో దర్శకుడి తో రెండో సినిమా అంటూ గత ఆరు నెలలు గా చర్చ జరుగుతూనే ఉంది దర్శకుల లిస్టు మారుతూనే ఉంది . కానీ అఖిల్ రెండో సినిమా మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు ,ఇప్పటికే బోలెడు మంది దర్శకుల లిస్టు బయటకు రాగా తాజాగా అక్కినేని ఫ్యామిలీ కి మనం వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన విక్రం కుమార్ పేరు వినిపిస్తోంది . కాంబినేషన్ సెట్ అయ్యింది అనేలోపు అది క్యాన్సిల్ అవుతోంది మరి ఈ దశలో అఖిల్ తో విక్రం కుమార్ సినిమా సెట్ అవుతుందా ? లేక ఇంతకుముందు లాగే ఒకే అయి వెంటనే క్యాన్సిల్ అవుతుందా చూడాలి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్