Home Lifestyle News
TOLLYWOOD
 LIFESTYLE

వేసవిలో కేశ సౌందర్యానికి తీసుకొనే జాగ్రత్తలు

వేసవిలో కేశ సౌందర్యానికి తీసుకొనే జాగ్రత్తలు : -   వేసవిలో చర్మ సంరక్షణకుఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే కేశాలకు  కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది వెంట్రుకలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారౌతాయి. సూర్యరశ్మి లోని అల్ట్రా వయొలెట్ కిరణాల కారణంగా కొనలు చిట్లి,పొడిబారినట్లు కనిపిస్తాయి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ కురులు పట్టుకుచ్చు గా ఉంటాయి. అందుకోసం.. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి రాసినట్టుగానే జుట్టుకు లేదా మాడుకు కూడా కొంచెం సన్ స్క్రీన్ లోషన్ రాయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వళ్ళ ఎండకు మాడు చుర్రుమనదు. అయితే... ఇలా సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నప్పుడు ఇంటికి రాగానే లేదా రాత్రి పడుకోబోయేముందు తలస్నానం చేయాల్సి ఉంటుంది. అల సాధ్యం కానప్పుడు ఆ లోషన్లకు బదులుగా కొబ్బరినూనెతో మర్దనా చేయాలి. ఇక తలస్నానానికి చివరగా జుట్టుకు నిమ్మరసం కలపిన నేటితో తడపడం వల్ల జుట్టు ధృడంగా మారుతుంది.    మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి.. ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు సమస్య ఉన్నవారైతే.. ఈమిశ్రమాన్ని జుట్టుకే కాకుండా,జుట్టు కుదుళ్ళకు కూడా బాగా పట్టించాలి. ఇలా చేసినట్లయితే జుట్టుకి మంచి కండీషనింగ్ లభించడమే కాకుండా,చుండ్రు నుంచి దూరం కావచ్చు.    ఇక వేసవిలో ఈతను ఇష్టపడేవారు.. స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళడం పరిపాటి. అయితే స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ కలుపుతారు. ఉప్పునీరు కూడా ఉండవచ్చు. ఇలాంటప్పుడు పూల్ లో దిగడానికి ముందుగానే తలను మంచి నీటితో తడుపుకోవాలి.జుట్టు తగినంత నీరు పీల్చుకున్న తరువాత  ఉప్పునీరు లేదా క్లోరిన్ నీటిని పీల్చుకోదు.కాబట్టి సమస్య ఉండదు. అయితే స్విమ్మింగ్ పూర్తైన తర్వాత ఇంటికొచ్చి శుబ్రంగా తలస్నానం చేయడం మరువద్దు.    వేసవిలో రసాయనాలు ఎక్కువ ఉన్న షంపూలు,ఇతర ప్రోడక్టుల వాడకాన్నితగ్గించాలి. ముక్యంగా హెయిర్ డై ని వాడకూడదు. హెయిర్ స్ప్రే లు వాడటం తాగించాలి.    వేసవిలో చెమట నుంచి జుట్టుని రక్షించేందుకు రెండురోజులకోసారి షాంపూ చేయాలి. షాంపూ చేసిన ప్రతిసారి కండిషనర్ ను తప్పనిసరిగా వాడాలి. ఇవి జుట్టులో ఉన్న తేమను కోల్పోకుండా నిగనిగలాడేలా చేయడమేకాక ఒత్తుగా,పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది.    వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది. కొబ్బరి నూనె ను కానీ మరే ఇతర హెయిర్ ఆయిల్ ను కానీ గోరువెచ్చగా చేసి కురులకు పట్టించి మర్దనా  చేసి టవల్ ను గట్టిగా చుట్టాలి. తర్వాత షాంపూ చేయాలి.    కొబ్బరి నీళ్ళు,పళ్ళ రసాయనాలు,సలాడ్ల ను తరచూ తీసుకుంటుండాలి. ఇవి చర్మం ఇంకా కేశాలు పొడిబారకుండా నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి.  

చర్మాన్ని రక్షించుకోవాలంటే

చర్మం మెరుస్తూ నిగనిగ లాడటానికి ఆహార పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు:   ప్రతి ఒక్కరు తనచర్మం నిగనిగ లాడుతూ ఉండాలని కోరుకుంటారు.అయితే కాలుష్యం,ఎండమొదలైన వాటి బారిన పడి  చర్మం  కమిలిపోయి,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రబావాల నుండి మీ చర్మాన్ని  రక్షించుకోవాలంటే. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.    1. బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. 2.నిమ్మ,ఉసిరి,లాంటి పుల్లటి పండ్లను  ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే ' సి' విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.  3. ఒక చిన్న పాత్రలో నారింజతొక్కలు వేసి ఐదు నిముషాలు మరిగించి దించి ఆతొక్కలను చర్మానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.  4. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది. 5. నానబెట్టిన బాదాం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.  6. టీ స్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే పలితం ఉంటుంది.  7. కొబ్బరి నూనెను  చర్మమంతా వారానికి ఒకసారి మర్ధనా చేసుకోవాలి.   8. కలబందను కొద్దిరోజుల పాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.  9. రోజు ఒక గుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.  10. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనే,కోడిగుడ్డు తెల్లసొనను కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..