Home Lifestyle చర్మాన్ని రక్షించుకోవాలంటే
TOLLYWOOD
 Lifestyle News

చర్మాన్ని రక్షించుకోవాలంటే

Thursday January 01st 1970

చర్మం మెరుస్తూ నిగనిగ లాడటానికి ఆహార పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు:

 
ప్రతి ఒక్కరు తనచర్మం నిగనిగ లాడుతూ ఉండాలని కోరుకుంటారు.అయితే కాలుష్యం,ఎండమొదలైన వాటి బారిన పడి  చర్మం 
కమిలిపోయి,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రబావాల నుండి మీ చర్మాన్ని 
రక్షించుకోవాలంటే. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 
 
1. బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
2.నిమ్మ,ఉసిరి,లాంటి పుల్లటి పండ్లను  ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే ' సి' విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది. 
3. ఒక చిన్న పాత్రలో నారింజతొక్కలు వేసి ఐదు నిముషాలు మరిగించి దించి ఆతొక్కలను చర్మానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. 
4. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
5. నానబెట్టిన బాదాం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు. 
6. టీ స్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే పలితం ఉంటుంది. 
7. కొబ్బరి నూనెను  చర్మమంతా వారానికి ఒకసారి మర్ధనా చేసుకోవాలి.  
8. కలబందను కొద్దిరోజుల పాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది. 
9. రోజు ఒక గుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 
10. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనే,కోడిగుడ్డు తెల్లసొనను కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..
MOST
 READ