Home Movie Schedule
TOLLYWOOD
 MOVIE SCHEDULE

సెప్టెంబర్ 15న 7 సినిమాలు రిలీజ్

సెప్టెంబర్ 15న ఏడు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి . ఒకేరోజున 7 సినిమాలు రిలీజ్ అంటే కొన్ని సినిమాలకు మాత్రమే థియేటర్ లు దొరికే అవకాశం ఉంది మిగతా సినిమాలకు ఏవో తూతూ మంత్రంగా కొన్ని థియేటర్ లు మాత్రమే దక్కనున్నాయి ఇక చివరి నిమిషంలో కొంతమంది బయ్యర్లు హ్యాండ్ ఇవ్వడం వల్ల కొన్ని సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం కూడా కామన్ అవుతుంది . ఇప్పటికి ఇలా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి . పెద్ద పెద్ద సినిమాలకే ఈ బాధ తప్పలేదు ఇక చిన్న సినిమాల పరిస్థితి  అయితే చెప్ప తరమా !     ఇక సెప్టెంబర్ 15న రిలీజ్ కి సిద్దమైన చిత్రాల జాబితా ఒకసారి చూద్దాం .  1) సునీల్ హీరోగా నటించిన ''ఉంగరాల రాంబాబు''  2) సచిన్ జోషి హీరోగా నటించిన ''వీడెవడు''  3) నయనతార - శింబు నటించిన ''సరసుడు '' 4) విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన '' శ్రీవల్లి '' 5) నారా రోహిత్ , నాగ శౌర్య  '' కథలో రాజకుమారి '' 6) ''ప్రేమ ఎంత మధురం '' 7)  '' ప్రాజెక్ట్ జెడ్ ''

అప్ కమింగ్ మూవీస్ లిస్ట్

ఎల్లుండి సెప్టెంబర్ నెల ప్రారంభం అవుతోంది అది కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ చిత్రంతో . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మించిన పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది . ఈ సినిమాపై బాలయ్య తో పాటుగా బాలయ్య అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు . ఇక సెప్టెంబర్ 2న చిన్న సినిమా వెళ్ళిపోమాకే రిలీజ్ అవుతోంది , చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు కు నచ్చడంతో తానే రిలీజ్ చేస్తున్నాడు దాంతో వెళ్ళిపోమాకే సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి .      ఇక సెప్టెంబర్ 8న నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి . అల్లరి నరేష్ నటించిన '' మేడ మీద అబ్బాయ్ '' , నాగచైతన్య నటించిన          '' యుద్ధం శరణం '', మంచు మనోజ్ నటించిన '' ఒక్కడు మిగిలాడు '', సచిన్ జోషి నటించిన '' వీడెవడు '' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి . ఇక సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ నటించిన '' జై లవకుశ '' మహేష్ నటించిన '' స్పైడర్ '' సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతున్నాయి . వీటితో పాటు శర్వానంద్ నటించిన మహానుభావుడు చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది . అయితే ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూడాలి . 

చెన్నైకి చేక్కేస్తున్న జనతా గ్యారేజ్ టీమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్  బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఓ వారం పాటు విరామం తీసుకొని ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అంతటి నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.n nఅయితే ఈ వారం నుండి యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్, ముంబాయి లలో కీలక షెడ్యుల్స్ పూర్తి  చేసుకున్న మేకర్స్ తాజా షెడ్యుల్ కోసం చెన్నై వేలుతున్నారట. ఇక్కడే ఈ నెల చివరి వరకు షూటింగ్ చేయనునట్లు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేసుకొని యూనిట్ మళ్ళి తిరిగి జూన్ 1 కల్ల హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం.n nఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో సమంత నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుంద ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తునాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

పటాస్ నైజం థియేటర్స్ లిస్టు

కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న పటాస్ సినిమా ఈ నెల 23 న విడుదలకు రెడీ అయ్యింది. భారి స్తాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా నైజాం థియేటర్స్ లిస్టు మీకోసం
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..