Home Movie Schedule అప్ కమింగ్ మూవీస్ లిస్ట్
TOLLYWOOD
 Movie Schedule

అప్ కమింగ్ మూవీస్ లిస్ట్

Bookmark and Share
Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT

ఎల్లుండి సెప్టెంబర్ నెల ప్రారంభం అవుతోంది అది కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ చిత్రంతో . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మించిన పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది . ఈ సినిమాపై బాలయ్య తో పాటుగా బాలయ్య అభిమానులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు . ఇక సెప్టెంబర్ 2న చిన్న సినిమా వెళ్ళిపోమాకే రిలీజ్ అవుతోంది , చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు కు నచ్చడంతో తానే రిలీజ్ చేస్తున్నాడు దాంతో వెళ్ళిపోమాకే సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి . 
 
 

ఇక సెప్టెంబర్ 8న నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి . అల్లరి నరేష్ నటించిన '' మేడ మీద అబ్బాయ్ '' , నాగచైతన్య నటించిన          '' యుద్ధం శరణం '', మంచు మనోజ్ నటించిన '' ఒక్కడు మిగిలాడు '', సచిన్ జోషి నటించిన '' వీడెవడు '' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి . ఇక సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ నటించిన '' జై లవకుశ '' మహేష్ నటించిన '' స్పైడర్ '' సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతున్నాయి . వీటితో పాటు శర్వానంద్ నటించిన మహానుభావుడు చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది . అయితే ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూడాలి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..