Home News
TOLLYWOOD
 Political Gossips

ఆంధ్రాలో మరో కొత్తపార్టీ

ఇటివలే రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కరక్ట్ గా చెప్పాలంటే మరో ఎనిమిది నెలల్లో మరో కొత్త పార్టీ ఆవిష్కరణ జరగనుందని అంటున్నాడు మాజీ విశాక ఎంపి సబ్బం హరి ? ఇటివలే అయన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొందని, రాష్ట్ర విభజన సమస్య వల్ల సమైక్యంద్ర కోరుకున్న వారందరితో కలిసి ఓ పార్టీ పెట్టాలని ఉందని అయన అంటున్నారు. అంతే కాదు మరో ఎనిమిది నెలల వరకు చూస్తామని , పరిస్తితుల్లో మార్పులు రాకపోతే ఖచ్చితంగా పార్టీ పెడతానని అంటున్నాడు.  

లొంగిపోయిన భూమా నాగిరెడ్డి

నంద్యాల శాసన సభ్యుడు భుమా నాగిరెడ్డి నేడు పోలిసుల ఎదుట లొంగిపోయారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న భుమా నాగిరెడ్డి పై తెలుగుదేశం నాయకులు హత్యాయత్నం చ కేసు పెట్టడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న రాత్రి భూమా ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లారు కానీ అప్పటికే భూమా బయటకి వెళ్లిపోవడంతో ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు అయ్యింది కాబట్టి పోలీసులకు పొంగిపోతేనే బాగుంటుందని భావించడంతో నేరుగా నంద్యాల డిఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు. చట్టాన్ని గౌరవిస్తానని అందుకే పోలీసుల దగ్గర లొంగి పోయానని తెలిపారు భూమా నాగిరెడ్డి.

సమగ్ర సర్వే తో భయపడుతున్న ఆంధ్రా వాళ్ళు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో అని ఆంధ్రా వాళ్ళలో భయం నెలకొంది. ఈ లెక్కలన్నీ ఆంధ్రావాళ్ళ లెక్కలను తేల్చడానికే అన్నట్లుగా కొంతమందిలో అనుమానం రేకేత్తగా ఆ అనుమానాలను బలపరుస్తూ టిడిపి తెలంగాణ నేతలు లేవనెత్తుతున్న అంశాల వల్ల మరింతగా భయం నెలకొంది. ఐతే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇదంతా భవిష్యత్ లో పలు సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చర్యలు తీసుకోవడానికి అలాగే దాదాపు 20లక్షలకు పైగా అన్యాక్రంతమైన రేషన్ కార్డులను ఏరివేయడానికి తెలంగాణా సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుందని చెబుతోంది. ఐతే ఈ సమగ్ర సర్వే వల్ల ఉమ్మడి రాష్ట్రంలో వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకు ప్రభుత్వ పథకాలని కొనసాగిస్తారా లేక కోత పెడతారా అన్నది తేలాల్సి ఉంది. ఈ సర్వే వల్ల తమకు ఎక్కడ నష్టం జరుగుతుందో అనే భయం వలస వచ్చిన వాళ్ళలో ఉంది ఆ భయాన్నిపోగొట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.

రెండు పెళ్ళిళ్ళ వాళ్ళ వల్లనేనట!

రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇలా దాపురించింది అని ఘాటు పదజాలాన్ని వాడుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు నెల్లూరు చిన్నోడు ఆనం వివేకానంద రెడ్డి . గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తింది ,ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి వందల కోట్లు డబ్బు సంపాదించి పదవులను అనుభవించిన నాయకులు వేరే పార్టీలోకి వెళ్ళారని ఇక ఈ రాష్ట్ర వ్యవహారాలను చుసిన ముసలోళ్ళు  ఒక్కొక్కరు రెండేసి పెళ్ళిళ్ళు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ని భ్రస్టు పట్టించారు  అని దిగ్విజయ్ సింగ్ ,శశి థరూర్ లనుద్దేశించి ఘాటుగా విమర్శించారు. భార్య చనిపోవడంతో టివి యాంకర్ తో లేటువయసు లో ఘాటు రొమాన్స్ చేస్తూ దొరికిపోయి పెళ్లి చేసుకుంటున్నాం అని అన్నాడు డిగ్గీ రాజా ,ఇక శశి థరూర్ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్న విషయం తెలిసిందే !

చిరంజీవి బిజెపి లోకి వెళతాడా!

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరతాడ అంటే బిజెపి లోకి లాగడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నది నిజమని పిస్తోంది. ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టి ఫలితాలు వెలువడ్డాక దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరు రాజ్యసభ తో పాటు మంత్రి పదవిని సైతం పొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నామరూపాల్లేకుండా దెబ్బ తినడంతో ...... తమ్ముడు మద్దతు ఇచ్చిన బిజెపి -టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో కొంతమంది బిజెపి నేతలు చిరు ని బిజెపి లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించారట!చిరు కి వెంకయ్య నాయుడు కి గతంలో నే కాకుండా ఇప్పటికి మంచి సంబంధాలు ఉండటంతో ఆ రకంగా ప్రయత్నాలు చేయాలనీ భావిస్తున్నారట . ఐతే చిరు పార్టీ మారటం మరీ తొందరే అవుతుందని అది ఇప్పట్లో ఉండదని కానీ త్వరలోనే ఆ కార్యక్రమం చేపడతామని అంటున్నారు. మరి దీనిపై చిరు స్పందన ఎలా ఉంటుందో చూడాలి .

పవన్ రాజ్యసభ కు వెల్లనున్నాడా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవలను మరింతగా వినియోగించుకోవాలని అనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి -టిడిపి కూటమికి మద్దతు ఇచ్చి ఆ కూటమి అధికారంలోకి రావడానికి దోహద పడ్డాడు పవన్ . కాబట్టి పవన్ కళ్యాణ్ మనకు చేసిన మేలుకు తగిన రీతిలో మనం పవన్ ని గౌరవించాలని బిజెపి భావిస్తోంది. ఆ మేరకు పవన్ తో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు మంతనాలు జరపడమే కాకుండా తన ఇంట్లో విందు కూడా ఇచ్చాడు. పవన్ ఇమేజ్ తో బిజెపి ని మరింతగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకు ప్రతి ఫలంగా పవన్ ను రాజ్యసభ కు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే పవన్ పార్టీ పెడుతూనే నేను పవర్ కోసం రాజకీయాల్లోకి రావడం లేదు ప్రశించడానికి వస్తున్నా అంటూ వచ్చాడు. దానికి బిజెపి నేతలు కూడా రాజ్యసభ కు వెళ్లి ప్రజా సమస్యల పై  ప్రశ్నించు పవన్ అని అడగనున్నారట. మరి పవన్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. 

మోడీ నైనా ఎదిరిస్తానంటున్న పవన్

భారత దేశ ప్రధానిగా ఎన్నిక అవుతున్న నరేంద్ర మోడీ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాబు ఇద్దరు కూడా మంచి పాలననే అందిస్తారని నమ్ముతున్నాను ఒకవేళ అలా జరగక పోతే సరైన పాలన అందించక పోతే వాళ్ళను సైతం ఎదిరిస్తానని అన్నాడు పవన్ కళ్యాణ్ . నేను పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి పవర్ కోసం కాదని ప్రశ్నించాల్సి వస్తే మోడీ ,బాబు లను సైతం ప్రశ్నిస్తానని ఐతే వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని నమ్ముతున్నానని అన్నాడు పవన్. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజా సమస్యల పై పోరాడటమే నా పని అని త్వరలోనే జనసేన పార్టీ నిర్మాణం చేపడతానని 2019 ఎన్నికల నాటికీ పార్టీని సమాయత్తం చేస్తానని అంటున్నాడు పవన్ కళ్యాణ్ .

అన్నయ్య ఓటమి ఖాయం మరి తమ్ముడు!

వెండితెరపై మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఘోర పరాజయాన్ని చవి చూసినప్పటికీ అనూహ్యంగా రాజ్యసభ కు వెళ్లి కేంద్రమంత్రి కూడా అయ్యాడు చిరంజీవి. ఆ తర్వాత జరిగిన విభజన నేపథ్యంలో సీమాంద్ర ప్రచార భాధ్యతలను నెత్తిన పెట్టుకున్నారు కానీ సీమాంద్ర లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉండటం తో దాదాపు ఓటమి ఖయమై పోయింది. అక్కడ పోటీ నామమాత్రంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక అన్నయ్య ఓటమి ఖాయమైన నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి మోడీ సేన గా మోడీ కి మద్దతుగా తిరుగుతున్న పవన్ తన సత్తా ఏమిటో కొద్ది రోజుల్లోనే తెల్చనున్నాడు. టిడిపి -బిజెపి కూటమి తరుపున తురుపు ముక్కగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్న పవన్ సీమాంద్ర ప్రాంతంలో కొంతమేర తన ప్రభావాన్ని చూపించ నున్నాడు. సీమాంద్ర ప్రాంతంలో జగన్ -టిడిపి ల మధ్యే ప్రధానంగా పోరు సాగనుంది మరి ఈ పోరులో పైచేయి ఎవరిదీ కానుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. అన్నయ్య ఓటమి ఖాయమైన నేపథ్యంలో మరి తమ్ముడి పరిస్థితి ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

బాలయ్య -పవన్ ఒకే వేదిక మీదకి !

నటసింహం నందమూరి బాలకృష్ణ -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి రానున్నారా అంటే అవుననే అంటున్నాయి టిడిపి శ్రేణులు. బాలయ్య హిందూపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మోడీ తో కలిసి ఈ ఇద్దరూ వేదిక ను పంచు కొనున్నారని తెలుస్తోంది. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 లేదా 25 తేదీలలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు ఆ సమయంలో అదే వేదిక పై మోడీ తో పాటు చంద్రబాబు ,బాలయ్య ,పవన్ లతో పాటుగా బిజెపి నేతలు టిడిపి నేతలు కూడా పాల్గొననున్నారు. పవన్ బిజెపి కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే! బిజెపి పొత్తు వల్ల టిడిపి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడు పవన్. పైగా విజయవాడ పార్లమెంట్ సీట్ ని తన నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కి ఇవ్వమని కోరుతున్నారు పవన్.

అరవింద్ కేజ్రీవాల్ పై మళ్ళీ దాడి!

అవినీతిని ఊడ్చి పారేస్తా అంటూ చీపురు గుర్తు తో ఢిల్లీ ఎన్నికల్లో పాల్గొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్ సరైన బలం లేకపోవడంతో రాజీనామా చేసి మాజీ అయ్యారు. అయితే మాజీ అయినప్పటి నుండి కేజ్రీవాల్ కు వరుస పరాభవాలు ఎదురౌతున్నాయి,ఒక్క నెల రోజుల వ్యవధి లోనే 5సార్లు దాడులు జరగడం శోచనీయం. తాజాగా ఢిల్లీ లో ప్రచారం లో పాల్గొన్న కేజ్రీవాల్ కు పూల దండ వేయడానికి వచ్చి దండ వేసిన అనంతరం కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించాడు ఓ ఆటో డ్రైవర్ . వెంటనే ఆప్ కార్యకర్తలు ఆ వ్యక్తి కి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్ పై దాడి చేసింది లాల్ అనే వ్యక్తి అని పోలీసులు తెలిపారు. కాగా వరుసగా తనపైనే ఇలా ఎందుకు దాడులు జరుగుతున్నాయో తెలియడం లేదంటూ వాపోయారు,కేజ్రీవాల్ కు కంటి దగ్గర దెబ్బ తగలడం తో ప్రచారాన్ని ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..