Home News
TOLLYWOOD
 Political NEWS

పవన్ కళ్యాణ్ ని అవమానిస్తున్న కిషన్ రెడ్డి

గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి పవన్ ని ఆకాశానికి ఎత్తేసారు బిజెపి నాయకులు కానీ ఆ అవసరం ఇప్పుడు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు , ఒంటి కాలు మీద లేస్తున్నారు బిజెపి నాయకులు . తాజాగా పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ ని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధిస్తుండటంతో బిజెపి నాయకులకు ఎక్కడా లేని కోపం వస్తోంది పవన్ పై అందుకే పవన్ ని చీపురు పుల్ల ని తీసి అవతల పడేసినట్లు అవమానకరంగా మాట్లాడుతున్నారు . అసలు పవన్ ని లెక్క లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు . బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు , తెలంగాణ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అయితే పవన్ పూచిక పుల్ల లా తీసి పడేస్తున్నాడు . గత ఎన్నికలలో పవన్ బీజేపీ - టిడిపి కూటమి కి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . 

టిఆర్ఎస్ లో చేరుతానంటున్న సంగీత

నా స్వస్థలం వరంగల్ దాంతో త్వరలోనే టిఆర్ఎస్ లో చేరుతానని అంటోంది ముత్యాల ముగ్గు హీరోయిన్ సంగీత . విశ్వేశ్వర రావు ప్రోత్సాహం తో సినిమా రంగంలోకి వచ్చానని , బాపు గారి ముత్యాల ముగ్గు చిత్రం ముందుగా రిలీజ్ అయ్యిందని ఇప్పటి వరకు 600 చిత్రాల్లో నటించానని , హీరోయిన్ గా 100 చిత్రాల్లో నటించానని ఇక ఇన్నాళ్లు చెన్నై లో ఉన్నానని ప్రస్తుతం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని తెలుగు చిత్రాల్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నానని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని  కలుష్టానని  తెలిపింది సంగీత . 

ఎంఎల్ ఏ ని బూతులు తిడుతూ లేఖ

మంగళగిరి ఎం ఎల్ ఏ ని బండ బూతులు తిడుతూ లేఖ రాయడమే కాకుండా చంపుతామని బెదిరించారు ఎవరో ఆగంతకుడు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై ఉన్న ఓటుకి నోటు కేసు విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసిబి కోర్టుని ఆశ్రయించాడు మంగళగిరి ఎం ఎల్ ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి . ఈ ఎం ఎల్ ఏ ప్రతిపక్ష వై ఎస్సా ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కావడంతో మూలాన పడిన ఓటుకి నోటు కేసు పునర్విచారణ చేయాలనీ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు అయితే దాన్ని హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో సుప్రీమ్ కోర్టు కి వెళ్ళాలని నిర్ణయించు కున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకవచనం తో బండ బూతులు తిడుతూ మంగళగిరి లోనే నిన్ను చంపేస్తామని బెరిస్తూ లేఖ పంపారు దాంతో ఆ లేఖ తో సహా  పోలీసులకు ఫిర్యాదు చేసాడు .

చంద్రబాబు ని పొగిడిన కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని తెలంగాణ ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తాడు . ఇద్దరు చంద్రుల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నుండి ''దోస్త్ మేరా దోస్త్ '' అనుకునే స్థాయికి రావడంతో విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు . ఇక బాబు ని కెసిఆర్ పొగడటానికి కారణం ఏంటో తెలుసా ....... బాబు పట్టిసీమ ప్రాజెక్ట్ ని పూర్తిచేయడం . రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పట్టిసీమ ని కట్టి రాయలసీమ ప్రజల కోసం మంచి పని చేసాడని అలాగే గోదావరి జలాలు సముద్రంలో కలిసి పోకుండా పోలవరం ని కూడా త్వరిత గతిన పూర్తీ చేయాలనీ అక్కడున్నది కూడా సాటి తెలుగు వాళ్ళే నని కెసిఆర్ చెప్పడంతో ఆంధ్రా ప్రజానీకం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

వంద కోట్లు ఇచ్చినా టిడిపి లోకి వెళ్ళం అనే జగన్ పార్టీ ఎం ఎల్ ఏ ల మాటలను నమ్మొచ్చా ?

1) నమ్ముతాం 2) నమ్మలేము 3) తెలియదు 4 ) ఇలా చెప్పిన వాళ్ళే టిడిపి లోకి జంప్ అయ్యారు

జగన్ పార్టీ ఎం ఎల్ ఏ లను టిడిపి లోకి చేర్చుకోవడాన్ని సమర్ధిస్తారా ?

1) చేర్చుకోవడం లో తప్పులేదు 2) చేర్చుకోవడం తప్పు 3) వలసలను ప్రోత్సహించడం తప్పు 4) జగన్ నిర్వాకం వల్లే వెళ్ళిపోతున్నారు 5) తెలియదు

జగన్ కు షాక్ ఇచ్చిన ఎం ఎల్ ఏ లు

వై ఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆ పార్టీ ఎం ఎల్ ఏ లు షాక్ ఇచ్చారు . ఈరోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు . కర్నూల్ జిల్లా నుండి బలమైన నాయకుడు అయిన భూమా నాగిరెడ్డి తో పాటు ఆయన కుమార్తె అఖిల కూడా టిడిపి తీర్దం పుచ్చుకున్నారు . వీళ్ళ తో పాటు జమ్మల మడుగు ఎం ఎల్ ఏ ఆది నారాయణ రెడ్డి తో పాటు కృష్ణా జిల్లా కు చెందిన జలీల్ ఖాన్ కూడా టిడిపి తీర్దం పుచ్చుకున్నారు దాంతో జగన్ పార్టీ తీవ్ర షాక్ కి గురయ్యింది.

గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు ?

1) తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ )2) తెలుగుదేశం 3) కాంగ్రెస్ (ఐ )4)కమ్యూనిస్టులు 5) తెలియదు

బాబు కాళ్ళు కడుగుతానంటున్న ముద్రగడ

కాపు రిజర్వేషన్ ల కోసం మా బతుకులు బాగు చేయడానికి కంకణం కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడు కాళ్ళు కడగటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు దీక్ష విరమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం . కాపుల కోసం దీక్ష ప్రారంభించిన ముద్రగడతో ఈరోజు ఉదయం ప్రభుత్వం తరుపున కళా వెంకట్రావు ,అచ్చేన్నాయుడు , బొడ్డు భాస్కర్ రావు చర్చలు జరిపారు . చర్చలు సానుకూల వాతావరణం లో జరుగడంతో కాపులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ముద్రగడ దీక్ష విరమించారు . కాపు కార్పోరేషన్ కు ఈ ఏడాది 500 కోట్లు వచ్చే ఏడాది నుండి వెయ్యి కోట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు .

గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన టిఆర్ఎస్

భాగ్యనగరం లో గులాబీ సేన సత్తా చాటింది . సెటిలర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా డివిజన్ల లో టిఆర్ఎస్ స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . ఒకప్పుడు పోటీ చేయడానికే ముందుకు రాని టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరిందంటే నమ్మలేకపోతున్నారు . మొత్తం 150 స్థానాలున్న గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు వంద సీట్ల లో ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది టిఆర్ఎస్ . పూర్తిస్థాయి ఎన్నికల ఫలితాలు రావడానికి రాత్రి 8 గంటల వరకు పట్టవచ్చు అని తెలుస్తోంది . మొత్తానికి కేటిఆర్ అంతా నేనే అయి గ్రేటర్ ఎన్నికల్లో నడిపించాడు . దాంతో నగరంలో ఏకపక్షంగా వస్తున్నాయి ఫలితాలు.
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD