Home Political News గవర్నర్ రాసలీలలు
TOLLYWOOD
 NEWS

గవర్నర్ రాసలీలలు



Thursday January 01st 1970
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు అప్పటి గవర్నర్ రాజ్ భవన్ లోనే రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెల్సిందే . కాగా ఇప్పుడు మరో గవర్నర్ పై  ఆరోపణలు వచ్చాయి దాంతో తన పదవికి రాజీనామా చేసాడు . సంఘటన వివరాలలోకి వెళితే ..... మేఘాలయ గవర్నర్ వి . షణ్ముఖ నాథన్ (67) ఏకంగా రాజ్ భవన్ లోనే అందమైన అమ్మాయిలను రప్పించుకుంటూ సరసాలు ఆడుతున్నాడని రాజ్ భవన్ కాస్త శృంగార భవన్ గా మారిందని ఆరోపిస్తూ దాదాపు వందమంది రాజ్ భవన్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఇక చేసేది లేక గవర్నర్ షణ్ముఖ నాథన్ రాజీనామా చేసారు . 
 
రాజ్ భవన్ లోకి ఎవరైనా ఎంటర్ కావాలంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ మేఘాలయ రాజ్ భవన్ కు వెళ్లాలంటే మాత్రం ఆడవాళ్లు అయితే చాలు అందునా అందమైన అమ్మాయిలు అయితే ఏకంగా బెడ్ రూమ్ వరకు వెళ్లిపోవచ్చట . ఒంటి మీదకు 67 ఏళ్ల వయసు వచ్చింది కానీ కామవాంఛ మాత్రం తగ్గలేదు దాంతో అమ్మాయిలను ఏకంగా రాజ్ భవన్ లోకి తెచ్చుకొని రాసలీలలు సాగిస్తున్నాడట దాంతో రాజ్ భవన్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..