Home Political News బాలయ్య ఓడిపోవడం ఖాయమట
TOLLYWOOD
 NEWS

బాలయ్య ఓడిపోవడం ఖాయమట



Thursday January 01st 1970
హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యుడి గా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే . అయితే ఎం ఎల్ ఏ గా గెలిచిన మొదట్లో హిందూపురం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవాడు బాలయ్య దాంతో ఆ నియోజకవర్గపు ప్రజలు బాలయ్య ని ఎన్నుకొని మంచి పనే చేశామని సంతోష పడ్డారు . అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు మూడేళ్లు పూర్తయ్యేసరికి బాలయ్య పట్ల ఆగ్రహంగా ఉన్నారు అక్కడి ప్రజలు . 
 
చాలాకాలంగా బాలయ్య హిందూపురంని గాలికి వదిలేసాడు . అసలే ఎండ తీవ్రత ఎక్కువగా పైగా నీటి ఎద్దడి కూడా అధికం అనంతపురం జిల్లాలో కానీ బాలయ్య మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు . మూడేళ్ళ కాలం పూర్తయ్యింది ఇక మిగిలింది రెండేళ్లు కానీ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బాలయ్య పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అక్కడి ప్రజలు . మాకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రతినిధి కావాలి కానీ పండగకు , పబ్బానికి వచ్చిపోయే ప్రజాప్రతినిధి అవసరం లేదని అంటున్నారు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..