Home Trade News
TOLLYWOOD
 TradeNews

8 కోట్ల షేర్ రాబట్టిన గరుడ వేగ

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ చాలాకాలం తర్వాత నటించిన సూపర్ హిట్ చిత్రం పీఎస్ వి గరుడవేగ . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసారు . ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన గరుడ వేగ సూపర్   హిట్ అయి రాజశేఖర్ కు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలా చేసింది . అయితే దాదాపు 18 కోట్ల బడ్జెట్ పెట్టడం వల్ల ఎక్కువ సొమ్ము తిరిగి రాలేదు కానీ ఇతరత్రా లాభాలతో మంచి లాభాలు వచ్చినట్లే ! ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టింది గరుడ వేగ కాగా శాటిలైట్ రూపంలో అలాగే డబ్బింగ్ రూపం లో , రీమేక్ ల రూపంలో మిగతా పది కోట్లు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . చాలాకాలం తర్వాత రాజశేఖర్ కు సూపర్ హిట్ రావడంతో రాజశేఖర్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది .

30 కోట్ల గ‌రుడవేగ

జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌పై డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా  నటించిన చిత్రం `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ న‌వంబ‌ర్ 3న విడుద‌లైంది. తొలి ఆట నుండే సూప‌ర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిపోయింది.     విడుద‌లై మూడు వారాలైన ఓవ‌ర్ సీస్ స‌హా విడుద‌లైన ప్ర‌తిచోట సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారంద‌రూ రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, కిషోర్‌, అదిత్ అరుణ్‌, శ్ర‌ద్ధాదాస్‌, స‌న్నిలియోన్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌దిత‌రులు న‌ట‌న‌ను అప్రిసియేట్ చేస్తున్నారు. త‌న ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామెన్స్‌తో రాజ‌శేఖ‌ర్ క‌మ్‌బ్యాక్ అయ్యార‌ని ప్ర‌శంసిస్తున్నారు. 

మంచి వసూళ్లు సాధిస్తున్న ఖాకీ

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ఖాకీ తెలుగు , తమిళ్లో ఈనెల 17న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది. గతకొద్ది కాలంగా కార్తీ కి సరైన హిట్ లేదు దాంతో ఈ ఖాకీ హిట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు కార్తీ . వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖాకీ పోలీస్ చిత్రాల్లో విభిన్న చిత్రంగా నిలిచింది.        రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఖాకీ చిత్రానికి అదనపు ఆకర్షణ గా నిలిచింది, అలాగే కార్తీ నటన ఈ చిత్రానికి మేజర్ హైలెట్. తమిళంలో సూపర్ హిట్ కొట్టేసింది అలాగే తెలుగులో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా కార్తీ కి మంచి ఫాలోయింగ్ ఉంది దాంతో ఈ వసూళ్లు వస్తున్నాయి.

రాజుగారి గది 2 ఫస్ట్ డే వసూళ్లు

కింగ్ నాగార్జున , సమంత లు పోటీపడి మరీ నటించిన చిత్రం రాజుగారి గది 2. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది, ఇక ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు . దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో  ఈ సినిమా ఎన్ని కోట్ల షేర్ రాబట్టిందో తెలుసా ....... దాదాపుగా నాలుగు కోట్ల షేర్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ ఉంది అలాగే కర్ణాటక , చెన్నై , రెస్ట్ ఆఫ్ ఇండియా లలో మరో 2 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది.      తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందింది అలాగే 24 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది దాంతో అందరికీ లాభాలు రావాలంటే తప్పకుండా 25 కోట్లకు పైగా షేర్ సాధించాలి అప్పుడే సక్సెస్ అయినట్లు లెక్క. మొదటి రోజున 4 కోట్ల షేర్ అంటే రెండు వారాల్లో మొత్తం లాగించడం ఖాయం ఇదే ఊపు ఉంటే. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నీ పివిపి సంస్థ నిర్మించింది.

140 కోట్ల క్లబ్ లో జై లవకుశ

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన జై లవకుశ 16 రోజుల్లో 140 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . సెప్టెంబర్ 21న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జై లవకుశ మంచి వసూళ్లు సాధిస్తూ మొత్తంగా 16 రోజులకు గాను 140 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 75 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసింది . మరో 15 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు కూడా లాభాల బాటలోకి వస్తారు . నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ కు ముందుగానే డబ్బులు వచ్చాయి . దాదాపు 35 కోట్ల లాభాలు రిలీజ్ కి ముందే వచ్చాయి ఇక ఇప్పుడు రావాల్సింది బయ్యర్ల కు మాత్రమే !        మరో వారం రోజుల పాటు మరే పెద్ద సినిమా రిలీజ్ లేదు కాబట్టి తప్పకుండా బెటర్ గానే వసూళ్లు రావచ్చు అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు . రవితేజ . నాగార్జున్ ల సినిమాలు రావాలంటే ఇంకా ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు మరిన్ని వసూళ్లు ఎన్టీఆర్ సాధించడం ఖాయం . ఎన్టీఆర్ నట విశ్వరూపం జై లవకుశ చిత్రాన్ని నిలబెట్టింది . 

మహానుభావుడు 6 రోజుల కలెక్షన్లు

శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు చిత్రం దసరా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 29 న రిలీజ్ ఆయిన మహానుభావుడు ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 27 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. ఆరు రోజుల్లోనే 14 కోట్ల షేర్ సాధించి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాడు శర్వానంద్.      మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంతో శర్వానంద్ - యువి క్రియేషన్స్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. రిలీజ్ రోజు నుండే మహానుభావుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్ల ని సాధించిన మహానుభావుడు 6 రోజుల్లోనే అందరికీ లాభాలు తెచ్చిపెట్టాడు. దాంతో ఆ సినిమా తీసినవాళ్ళు , కొన్నవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. 

జై లవకుశ 11రోజుల కలెక్షన్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తో మంచి వసూళ్ల ని సాధిస్తున్నాడు . సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది . ఇక ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ....... 120 కోట్ల గ్రాస్ వసూళ్ల ని వసూల్ చేసింది జై లవకుశ చిత్రం . 120 కోట్ల లో దాదాపుగా  72 కోట్ల షేర్ వచ్చింది దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ వసూల్ చేస్తే బయ్యర్లంతా లాభాల బాటలోకి వెళతారు . జై లవకుశ ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు ఒకసారి చూద్దామా !         నైజాం                          - 15 కోట్లు ( షేర్ )  సీడెడ్                          -  10. 92 కోట్లు  కృష్ణా                           -   4. 25 కోట్లు  గుంటూరు                    -  5. 67 కోట్లు  ఈస్ట్                            -   5 .10 కోట్లు  వెస్ట్                             -   3. 40 కోట్లు  ఉత్తరాంధ్ర                  -  6. 05 కోట్లు  నెల్లూరు                      -   2. 30 కోట్లు  కర్ణాటక                       -   4. 75 కోట్లు  తమిళనాడు               -  1. 22 కోట్లు  అమెరికా                     -  4. 62 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా    -   5. 25 కోట్లు  మొత్తం షేర్             -    71. 82 కోట్ల షేర్ 

110 కోట్ల క్లబ్ లో మహేష్ స్పైడర్

సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్ 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్లా గ్రాస్ వసూళ్ల ని సాధించినట్లుగా యు కే యూఈ సెన్సార్ మెంబర్ ఉమైర్ సందు ట్వీట్ చేసాడు . మహేష్ కున్న క్రేజ్ తో ఈ మాదిరి వసూళ్లు వచ్చాయి . మురుగదాస్ దర్శకత్వంలో  స్పైడర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . తమిళ దర్శకులు ఎస్ జె సూర్య విలన్ గా నటించగా రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన నటించింది .      ఓవర్ సీస్ లో కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకొని సంచలనం సృష్టించింది స్పైడర్ చిత్రం . మహేష్ ఓవర్సేస్ మొనగాడు కావడంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో , అలాగే ఓవర్ సీస్ లలో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది స్పైడర్ చిత్రం . అయితే అంతకంటే వేగంగా ప్లాప్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యింది స్పైడర్ పై దాంతో కాస్త నెమ్మదించాయి వసూళ్లు . మొత్తానికి స్పైడర్ మంచి వసూళ్లు సాధిస్తోంది కానీ బయ్యర్లు కూడా లాభాల్లోకి రావాలంటే స్పైడర్ 200 కోట్లకు పైగా వసూల్ చేయాలి . 

ఓవర్సీస్ లో సత్తా చాటిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్ సీస్ లో సత్తా చాటాడు . 1. 5 మిలియన్ లు దాటిన మూడు సినిమాలు అందించి అరుదైన ఘనత సాధించాడు . ఇప్పటివరకు వరుసగా మూడు చిత్రాలు నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలతో ఆ మైలురాయి అందుకోగా తాజాగా జై లవకుశ చిత్రంతో మరోసారి ఆ ఘనత ని సాధించాడు ఎన్టీఆర్ . జై లవకుశ చిత్రం కూడా ఓవర్ సీస్ లో 1. 5 మిలియన్ డాలర్ల ని దాటేసింది . దాంతో వరుసగా మూడు సినిమాలతో ఆ ఫీట్ ని సాధించిన హీరోగా సంచలనం సృష్టించాడు ఎన్టీఆర్ .      మహేష్ స్పైడర్ రిలీజ్ కావడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది ఎన్టీఆర్ జై లవకుశ చిత్రానికి . కానీ స్పైడర్ వెనుకంజ వేయడం వల్ల మొత్తానికి మళ్ళీ పుంజుకున్నాడు ఎన్టీఆర్ . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో జై లవకుశ చిత్రాన్ని నెట్టుకొస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం తో కళ్యాణ్ రామ్ కు బాగానే లాభాలు వచ్చాయి . ఇక ఇప్పుడు రావాల్సింది బయ్యర్లకు . రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ జై లవకుశ తో .

3 రోజుల్లో 18 కోట్లు కొల్లగొట్టిన శర్వానంద్

దసరా బరిలో శర్వానంద్ దిగాడు , మహానుభావుడు చిత్రంతో మూడు  రోజుల్లోనే పద్దెనిమిది  కోట్ల గ్రాస్ వసూళ్ల ని అలాగే ఎనిమిదిన్నర కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించాడు . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో సైతం మహానుభావుడు హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి వసూళ్ల ని సాధిస్తోంది . మొదటి రోజులాగే రెండో రోజు కూడా జోరు చూపించి రెండు  రోజుల్లోనే 13. 5 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసాడు మహానుభావుడు .      మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ అతి శుభ్రత కలిగిన వాడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు . ఇక అందాల భామ మెహరీన్ కౌర్ శర్వానంద్ సరసన నటించింది ఈ చిత్రంలో . మారుతి కి కూడా మరో మంచి హిట్ లభించింది ఈ మహానుభావుడు చిత్రంతో . నిన్న ఆదివారం కావడంతో నిన్న కూడా మంచి వసూళ్ల ని రాబట్టాడు , మూడు రోజులకు కలిపి 18 కోట్ల గ్రాస్ ని ఎనిమిదిన్నర కోట్ల షేర్ ని సాధించాడు శర్వానంద్ . యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెడుతోంది .

72 కోట్లు కలెక్ట్ చేసిన స్పైడర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన స్పైడర్ చిత్రం రెండు రోజుల్లో 72 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజున 51 కోట్లు వసూల్ చేసిన స్పైడర్ రెండో రోజు 21 కోట్లు వసూల్ చేసి మొత్తంగా రెండు రోజుల్లో 72 కోట్లు వసూల్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా.మహేష్ బాబు స్టామినా తో ఈ భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. మహేష్ ఇమేజ్ కి తోడు దసరా పండగ సెలవులు కూడా తోడయ్యాయి దాంతో ఈ వసూళ్లు వచ్చాయి.     అక్టోబర్ 4 వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా విలన్ గా ఎస్ జె సూర్య నటించాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ , ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మించారు. మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్ని కోట్ల ని సాధిస్తుందో చూడాలి.

3 రోజుల్లో 75కోట్లు రాబట్టిన ఎన్టీఆర్

మూడు రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ . జై లవకుశ ఈనెల 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 49 కోట్ల వరకు రాబట్టి రెండో రోజు నుండి కాస్త మందగించింది దాంతో మూడు రోజుల్లో 75కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . మహేష్ సినిమా రావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు అంటే మొత్తంగా ఆరు రోజుల్లో ఎంత లాక్కొస్తే అంత మంచిదనే ఉద్దేశ్యం తో ఆ చిత్ర బృందం ఉన్నారు .వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే మూడు రోజుల వసూళ్లు వచ్చాయి అయితే ఇది షేర్ కాదు గ్రాస్ మాత్రమే . ఇందులో జి ఎస్ టి రూపంలో పెద్ద మొత్తమే పోతుంది . బయ్యర్లు ఒడ్డున పడాలంటే 95 కోట్ల షేర్ రాబట్టాలి . ఈరోజు ఆదివారం కాబట్టి ఆపై కూడా సెలవులు ఉన్నందున మొదటి వారంలో ఎంత వసూల్ చేస్తే అంత విజయం . ఈ సినిమా బయ్యర్లంతా లాభాల్లో తేలియాడాలంటే జై లవకుశ 160 కోట్ల వసూళ్ల ని సాధించాలి .

వంద కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ జై లవకుశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ వంద కోట్ల క్లబ్ లో చేరింది . సెప్టెంబర్ 21న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ని సాధించింది . దసరా సెలవులు కూడా తోడవడంతో మొదటి ఆరు రోజుల్లో వంద కోట్లు సాధించి సంచలనం సృష్టించాడు ఎన్టీఆర్ . ఇప్పటికే జనతా గ్యారేజ్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ తో రెండోసారి వంద కోట్ల మైలురాయి ని అందుకున్నాడు .      జై లవకుశ చిత్రానికి హిట్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ సినిమా స్పైడర్  కూడా వెంటనే రిలీజ్ అవుతుండటంతో జై లవకుశ పై నీలినీడలు కమ్ముకున్నాయి . అయితే ఈరోజు రిలీజ్ అయిన స్పైడర్ కు డివైడ్ టాక్ రావడంతో జై లవకుశ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది . దానికి తోడు అక్టోబర్ 4వరకు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయం . జై లవకుశ హిట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . 

స్పైడర్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు

మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది . ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్ల ని కొట్టేసింది . ఇంతటి భారీ వసూళ్లు రావడానికి కారణం మహేష్ కున్న క్రేజ్ మాత్రమే కారణం . మహేష్ కు ఓవర్సీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే ఈ వసూళ్లు . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్లు వచ్చాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ వసూల్ చేసిన మొత్తం 39 కోట్లు .      ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ లెక్కలు అయితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నై , కర్ణాటక , ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా సమగ్ర లెక్కలు రావాల్సి ఉంది . సాయంత్రానికి సరైన ఫిగర్ వస్తుంది . ఇప్పటివరకు అయితే 39 కోట్ల వసూళ్ల ని రాబట్టాడు మహేష్ బాబు . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రానికి మిశ్రమ ఫలితం వచ్చింది . అయితే మహేష్ కున్న ఇమేజ్ తో భారీ వసూళ్లు వస్తున్నాయి . దానికి తోడు దసరా సెలవులు కూడా తోడవడంతో మొదటి వారం మంచి వసూళ్ల ని సాధించడం ఖాయం . 

22 కోట్ల షేర్ వసూల్ చేసిన అర్జున్ రెడ్డి

ఆగస్టు 25న రిలీజ్ ఐన అర్జున్ రెడ్డి భారీ వసూళ్ల ని సాధిస్తోంది . బాలయ్య నటించిన పైసా వసూల్ డిజాస్టర్ కావడంతో అర్జున్ రెడ్డి మరింతగా పుంజుకుంది అలాగే నిన్న రిలీజ్ అయిన యుద్ధం శరణం , మేడ మీద అబ్బాయి చిత్రాలు కూడా ప్లాప్ కావడంతో అర్జున్ రెడ్డి దశ తిరిగినట్లే ! అసలే యూత్ కి నచ్చిన సినిమా ఆపై పోటీకి మరో సినిమా ఏది కూడా లేకపోవడంతో అర్జున్ రెడ్డి కి బాగా కలిసి వచ్చింది దాంతో రికార్డుల మోత మోగిస్తున్నాడు అర్జున్ రెడ్డి . ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అర్జున్ రెడ్డి ఎంత వసూల్ చేసాడో తెలుసా ........     22 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేసి ఈవారం కూడా అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ ని దున్నేయనున్నాడు . ఇప్పటికే 35 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈచిత్రం అవలీలగా 50 కోట్ల ని సాధించడం ఖాయమని అంటున్నారు . ఎందుకంటే ఇప్పటివరకు సరైన సినిమా ఏది కూడా పోటీ లేదు పైగా మరో రెండు వారాల వరకు ఎన్టీఆర్ సినిమా రాదు దాంతో అప్పటి వరకు అర్జున్ రెడ్డి హవా కొనసాగడం ఖాయం . విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు . 

మహేష్ స్పైడర్ ఏరియాలవారీగా బిజినెస్

మహేష్ బాబు స్పైడర్ తో సరికొత్త సంచలనం సృష్టించేలా ఉన్నాడు . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ పడి హక్కులు సొంతం చేసుకుంటున్నారు . పోటీ ఎక్కువ కావడంతో భారీ ఎత్తున బిజినెస్ జరిగింది , ఇంతకీ మహేష్ స్పైడర్ కు జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా ...... 157 కోట్ల పైమాటే ! మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమా ఏరియాల వారీగా చేసిన బిజినెస్ ఒకసారి చూద్దామా !                      నైజాం                      -  23 కోట్లు  సీడెడ్                       -  12 కోట్లు  ఉత్తరాంధ్ర               -   8. 1 కోట్లు  గుంటూరు                -    7. 2 కోట్లు  కృష్ణా                        -   5. 4 కోట్లు  ఈస్ట్                         -    6 కోట్లు  వెస్ట్                          -   5. 04 కోట్లు  నెల్లూరు                   -   2. 09 కోట్లు  కర్ణాటక                     - 10 . 80 కోట్లు  కేరళ                         - 1. 26 కోట్లు  తమిళనాడు               -  17 కోట్లు  నార్త్                            - 1 కోటి  ఓవర్ సీస్                   -  23 కోట్లు  శాటిలైట్                      -  33 కోట్లు  ఆడియో                      -  2 కోట్లు  మొత్తం : 157. 7 కోట్లు 

50 కోట్ల దిశగా అర్జున్ రెడ్డి

చిన్న చిత్రంగా వచ్చి తెలుగు రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టిస్తున్న చిత్రం అర్జున్ రెడ్డి.ఆగస్ట్ 25న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి విడుదలైన అన్ని ఏరియాలలో సంచలన విజయం సాధిస్తూ భారీ వసూళ్లని ట్రేడ్ విశ్లేశకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొదటి వారంలో అర్జున్ రెడ్డి సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా....... 30 కోట్ల పైనే . ఫస్ట్ వీక్ లొనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించడంతో అవలీలగా 50 కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమని నమ్ముతున్నారు.     బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి కి రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. బాక్సా ఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయం . వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ నట జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.

అర్జున్ రెడ్డి 4 రోజుల కలెక్షన్లు

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి భారీ విజయం సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది . కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది అర్జున్ రెడ్డి చిత్రం . సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేయడంతో భారీ వసూళ్లు సాధ్యం అవుతున్నాయి . ఇక ఓవర్ సీస్ లో కూడా అప్పుడే వన్ మిలియన్ డాలర్ల ని అధిగమించి మరింత సంచలనం సృష్టించింది .        ఏరియాల వారిగా అర్జున్ రెడ్డి సాధించిన షేర్స్ ఇలా ఉన్నాయి  నైజాం               -  4. 46 కోట్లు  సీడెడ్               -  1. 02 కోట్లు  ఈస్ట్                 -   64 లక్షలు  వెస్ట్                  -   32 లక్షలు  కృష్ణా                -   63 లక్షలు  గుంటూరు         -  55 లక్షలు  నెల్లూరు            -  18 లక్షలు  ఉత్తరాంధ్ర       -   78 లక్షలు  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లతో పాటు గా ఓవర్ సీస్ షేర్ కలుపుకొని 13. 2 కోట్ల షేర్ . 

మొదటి రోజునే లాభాలు తెచ్చిన అర్జున్ రెడ్డి

విజయ్ దేవరకొండ కు అదృష్టం దరిద్రం ని పట్టినట్లుగా పట్టింది , కాకపోతే మొదటి రోజునే సినిమా పెట్టిన పెట్టుబడి రావడం , లాభాలు కూడా రావడం ఏంటి ? 2 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది . రిలీజ్ కి ముందు నానా ఇబ్బందులు పడి రిలీజ్ చేసారు . కట్ చేస్తే ఈ సినిమాకు ముద్దుల పోస్టర్ వల్ల కూడా భారీ ఎత్తున లాభం జరిగింది దాంతో అనూహ్యంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి .    కట్ చేస్తే మొదటి రోజునే నాలుగు కోట్ల షేర్ వచ్చింది . అంటే మొదటి రోజునే అర్జున్ రెడ్డి లాభాల పంట పండించాడు ఇక మిగిలినదంతా బోనస్ . ఇక శాటిలైట్ అదనం కూడా . మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా ఏకంగా 15 కోట్ల లాభాలను తెచ్చిపెట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . ఇంకా ఈ జోరు ఇలాగే కొనసాగితే 15 కోట్ల లాభాలను కూడా దాటడం ఖాయం . ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది అర్జున్ రెడ్డి . కుర్రాళ్ళ కి మంచి జోష్ అందిస్తున్న ఈ సినిమా పట్ల యువత పిచ్చ క్రేజ్ ఉంది . 

యాభై కోట్ల దిశగా వివేగం

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 49 కోట్ల వసూళ్ల ని సాధించి యాభై కోట్ల మార్క్ కు చేరువయ్యింది . శివ దర్శకత్వంలో తెరకెక్కిన వివేగం చిత్రాన్ని తెలుగులో వివేకం పేరుతో డబ్ చేసారు . తెలుగులో అంతగా సత్తా చాటలేకపోయింది వివేకం కానీ తమిళనాట మాత్రం వివేగం భారీ వసూళ్ల ని సాధిస్తోంది . రిలీజ్ అయిన రోజున 33 కోట్ల ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది వివేగం .      రెండో రోజు ఆ జోరు చూపించలేదు కానీ 15 కోట్లు వసూల్ చేయడంతో రెండు రోజుల్లోనే దాదాపు 49 కోట్ల వసూళ్ల ని రాబట్టింది వివేగం . మిగతా భాషల్లో వివేగం అంతగా క్రౌడ్ లేదు కానీ అజిత్ కు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ అథితి పాత్ర పోషించింది . 

ఫిదా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం అద్భుత విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అయిదు వారాలలో దాదాపు 46 కోట్ల వసూళ్ల ని సాధించి 50 కోట్ల వైపు దూసుకుపోతోంది . చిన్న చిత్రంగా వచ్చిన ఫిదా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ భారీ వసూళ్ల ని సాధించడం అంటే నిజంగా సంచలనమే మరి .         ఏరియాల వారీగా ఫిదా వసూళ్ళు ఇలా ఉన్నాయి  నైజాం                   -  17. 48 కోట్లు  సీడెడ్                   -   4. 04 కోట్లు  కృష్ణా                    -   2. 1 కోట్లు  గుంటూరు            -   2. 42 కోట్లు  ఉత్తరాంధ్ర          -   4. 3 కోట్లు  ఈస్ట్                    -    2. 24 కోట్లు  వెస్ట్                     -   1. 63 కోట్లు  నెల్లూరు              -   0. 99 లక్షలు  ఓవర్ సీస్           -   7. 85 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా  - 2. 81 కోట్లు  మొత్తం         -  45. 85 కోట్లు 

20 కోట్ల నష్టాన్ని మిగిల్చిన నితిన్ లై

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం లై . అర్జున్ విలన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది కోట్లు మాత్రమే వసూల్ చేసింది లై . ఇక డిజిటల్ రైట్స్ , శాటిలైట్ రూపంలో వచ్చిన మొత్తం తో 15 కోట్లు మాత్రమే రాబట్టినట్లు కానీ ఈ సినిమా రూపొందింది 35 కోట్ల భారీ బడ్జెట్ తో అంటే 20 కోట్ల లాస్ అన్నమాట .   నితిన్ కు అంతటి మార్కెట్ లేకపోయినప్పటికీ పెద్ద సాహసమే చేసారు లై చిత్ర దర్శక నిర్మాతలు . నెల విడిచి సాము చేస్తే ఫలితం ఎలా ఉంటుందో లై మరోసారి చాటి చెప్పింది . ఇక 14 రీల్స్ విషయానికి వస్తే ......... ఈ సంస్థ నిర్మించిన చిత్రాలలో ఎక్కువగా డిజాస్టర్ లే ! ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు . కానీ యంగ్ టాలెంట్ ని గుర్తించి తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేద్దాం అని మాత్రం అనుకోవడం లేదు ఏమిటో . 

జయ జానకి నాయక ఫస్ట్ డే వసూళ్లు

నిన్న రిలీజ్ అయిన జయ జానకి నాయక చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించింది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు . రెండు తెలుగు రాష్ట్రాలలో జయ జానకి నాయక సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.నైజాం                 -  90 లక్షలుసీడెడ్                 -  55 లక్షలుఉత్తరాంధ్ర           -  45 లక్షలుఈస్ట్                    -  24 లక్షలువెస్ట్                    -  28 లక్షలుకృష్ణా                  -  16 లక్షలుగుంటూరు           -   49 లక్షలునెల్లూరు              -   19 లక్షలుమొత్తం               - 3. 26 కోట్లు

నేనేరాజు నేనే మంత్రి ఫస్ట్ డే వసూళ్లు

రానా హీరోగా నటించిన నేనేరాజు నేనే మంత్రి నిన్న రిలీజ్ అయి మొదటి రోజు మంచి వసూళ్ల నే సాధించింది . నిన్న రిలీజ్ అయిన చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్లు వసూల్ చేసింది నేనేరాజు నేనే మంత్రి చిత్రం . కాజల్ అగర్వాల్ , కేథరిన్ లు నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.నైజాం          -  1. 22 లక్షలుసీడెడ్          -  65 లక్షలుఉత్తరాంధ్ర    -  68 లక్షలుకృష్ణా           -   28 లక్షలుగుంటూరు     -  24 లక్షలుఈస్ట్            -  35 లక్షలువెస్ట్             -  20 లక్షలునెల్లూరు       - 9 లక్షలు

30 కోట్ల దిశగా ఫిదా

పది కోట్లతో నిర్మించిన ఫిదా 30 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. మొదటి వారం లొనే 15 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేస్తున్న ఫిదా లాంగ్ రన్ లో 30 కోట్ల ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.   శేఖర్ కమ్ముల దర్సకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫిదా తెలుగు రాష్ట్రాల లొనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది. మొత్తానికి పది కోట్లతో తీసిన ఫిదా 30 కోట్లు సాధించడం గొప్ప విషయమే మరి.

ఫిదా ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా

దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు . శేఖర్ కమ్ముల చాలాకాలం తర్వాత నటించిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ  సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు . వరుణ్ తేజ్ నటన కూడా ఆకట్టుకోవడంతో ఫిదా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల 70 లక్షల షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . మొదటి రోజునే ఇంతటి వసూళ్లు ఫిదా లాంటి సినిమాలకు రావడానికి కారణం దిల్ రాజు నిర్మాణ సంస్థ కావడం ఒక కారణమైతే శేఖర్ కమ్ముల చాలారోజుల తర్వాత చేసిన సినిమా కావడం మరో కారణం .     ప్రేక్షకులను సినిమా థియేటర్ వరకు తీసుకు రావడానికి నిన్నటి వరకు దిల్ రాజు - శేఖర్ కమ్ముల కారణం అయితే ఇప్పుడు మాత్రం సాయి పల్లవి కారణం . మలయాళ భామ అయినప్పటికీ తెలంగాణ బాష నేర్చుకొని ఆ యాసలో డబ్బింగ్ చెప్పడమే కాకుండా నటనతో ఆకట్టుకుంటోంది . 

రెండు రోజుల్లో 20 కోట్లు రాబట్టిన నాని

నాని నటించిన నిన్ను కోరి చిత్రం రెండు రోజుల్లోనే 19 కోట్లకు పైగా వసూళ్ళ ని రాబట్టి సంచలనం రేపుతోంది . కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన నిన్ను కోరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తోంది . విచిత్రం ఏంటంటే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం కంటే మంచి వసూళ్లు సాధిస్తున్నాడు నాని . ఓవర్ సీస్ లో 4 కోట్ల వసూళ్ళ ని రాబట్టింది ఇప్పటికే . n nఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్ళ ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది . దాంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు . నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు .

1600 కోట్ల క్లబ్ లో బాహుబలి 2

బాహుబలి 2 పదహారు వందల కోట్ల క్లబ్ లో చేరింది . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధించి చరిత్ర సృష్టించింది . ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది . ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా , సత్యరాజ్ లు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు .      తెలుగు , తమిళ్ , హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషలలో దుమ్ము రేగ్గొట్టింది బాహుబలి 2. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో బాహుబలి 2 కి ఇప్పటికి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . వరల్డ్ వైడ్ గా 1600 కోట్లు సాధించిన బాహుబలి 2 త్వరలోనే చైనాలో కూడా రిలీజ్ కానుంది . 

రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు

మే 26న రిలీజ్ అయిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా 5 రోజుల్లో 12 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి హిట్ అనిపించుకుంది . అక్కినేని నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . రకుల్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు . కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా మంచి పాత్ర ని కొట్టేసింది రకుల్ .    అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం నాగచైతన్య కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది . ఇక ఏరియాల వారీగా రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు ఇలా ఉన్నాయి .    నైజాం                  - 4. 2 కోట్లు  సీడెడ్                  - 1. 78 కోట్లు  కృష్ణా                    - 0. 99 లక్షలు  గుంటూరు            - 1. 05 కోట్లు  ఉత్తరాంధ్ర           - 1. 84 కోట్లు  ఈస్ట్                      - 1. 05 కోట్లు  వెస్ట్                       - 0. 77 కోట్లు  నెల్లూరు                - 0. 35 కోట్లు  మొత్తం                -  12. 06 కోట్లు 

మొదటి రోజునే మూడున్నర కోట్లు తెచ్చింది

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిన్న రిలీజ్ అయ్యింది , కట్ చేస్తే మొదటి రోజునే మూడున్నర కోట్ల వసూళ్ళ ని సాధించి భేష్ అనిపించింది . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం . అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ వచ్చింది అయితే టాక్ రావడం వేరు కలెక్షన్లు రావడం వేరు పైగా అది బిఫోర్ రిలీజ్ టాక్ అని చిన్న డౌట్ ఉండేది.కానీ సినిమా రిలీజ్ అయ్యాక మంచి వసూళ్లు రావడం ఖాయమని తేల్చేసింది నిన్నటితో . ఫస్ట్ డే మూడున్నర కోట్లు అంటే దరిదాపులో పెద్ద సినిమాల రిలీజ్ లు కూడా లేవు పైగా మరో రెండు వారాలు స్కూళ్ళ కు సెలవులు కూడా దాంతో ఈ సినిమా 25 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

వారం రోజుల్లో 16 కోట్లు రాబట్టిన నిఖిల్

నిఖిల్ చాలా అదృష్టవంతుడు . కేశవ సినిమా యావరేజ్ గానే ఉన్నప్పటికీ బ్రహ్మాండమైన వసూళ్ళ ని సాధిస్తున్నాడు . కేవలం వారం రోజుల్లోనే పదహారు కోట్ల భారీ వసూళ్ళ ని సాధించాడు దాంతో కేశవ సినిమా హిట్ జాబితాలో చేరిపోయింది . కేశవ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత గ్రాఫ్ తగ్గింది అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు . నిఖిల్ ఎంత అదృష్టవంతుడంటే యావరేజ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్ల ని కొల్లగొట్టాడు.మొదటి వారంలోనే 16 కోట్లు వసూల్ కావడంతో ఆ చిత్ర యూనిట్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు . నిఖిల్ మొదటిసారి సీరియస్ రోల్ చేసి మెప్పించాడు . రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మించగా సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు . పెద్ద నోట్లు రద్దు అయి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి వసూళ్ళ ని రాబట్టాడు అంటే నిఖిల్ మంచి రేంజ్ కి వెళ్ళినట్లే.

3రోజుల్లో 11కోట్లు వ‌సూలు చేసిన ‘కేశవ’

గ‌త‌ మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమ‌ర్షియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద  హిట్ అవ్వ‌ట‌మే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.  నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక్క‌సారి డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం కేశ‌వ‌. ఈ చిత్రం విడుద‌ల‌య్యి అంద‌రి ప్ర‌శంశ‌లు పొంద‌టమే కాకుండా క‌లెక్ష‌న్ల రాబ‌ట్ట‌టంలో విజ‌యం సాధించింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఒపెనింగ్ గా నిల‌వ‌ట‌మే కాకుండా, మెద‌టి వీకెండ్ 11 కొట్ల 40 ల‌క్ష‌లు వ‌సూలు చేసి ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ టాప్ చైర్ ని సొంతం చేసుకుంది.    తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మెద‌టి నుండి ప‌గ‌, ప్ర‌తీకారం అనే క‌థాంశంతో న‌డుస్తుండ‌టంతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో ధియోట‌ర్స్ లో సీట్స్ లో ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిపాడేసింది. చూస్తున్నంత వ‌ర‌కూ క్లైమాక్స్ ఎంట‌నే ఆశ‌క్తితో ప్రేక్ష‌కులు చిత్రాన్ని చూస్తున్నారు. మంచి చిత్రాల‌కి, కొత్త చిత్రాల‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తార‌నేది మ‌రోక్క‌సారి ఈ చిత్రంతో ప్రూవ్ అవ్వ‌టం చాలా హ్య‌పి అంటున్నారు. నిర్మాత అభిషెక్ నామ‌    రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌., 

1300 కోట్ల క్లబ్ లో బాహుబలి 2

ఏప్రిల్ 28న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది . వెయ్యి కోట్లని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించగా తాజాగా ఆ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించి ఎవరూ అందుకోలేని దిశగా దూసుకుపోతోంది . ఈ దేశం , ఆ దేశం అనే తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది బాహుబలి 2.     ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు . దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్ల ని ఒక్క భారత్ లోనే వసూల్ చేసింది బాహుబలి 2 , అలాగే ఓవర్ సీస్ లో కూడా 240 కోట్ల వసూళ్ల ని సాధించింది . మొత్తంగా 1300 కోట్ల కు పైగా వసూల్ చేసింది . 

ఏడు వందల కోట్ల క్లబ్ లో బాహుబలి 2

బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు , వారం తిరక్కుండానే 700 కోట్ల క్లబ్ లో చేరిపోయింది . ఏప్రిల్ 28న భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజ్ అయిన బాహుబలి 2 కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది . భారతదేశ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూల్ చేసిన బాహుబలి 2 ఓవర్ సీస్ లోనూ 150 కోట్ల కు పైగా వసూల్ చేసి మొత్తంగా 700 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.బాహుబలి 2 ఏరియాల వారీగా వసూల్ చేసిన గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయితెలంగాణ , ఆంధ్రప్రదేశ్        -  143 కోట్ల గ్రాస్ nహిందీ                         -   275 కోట్లు nకర్ణాటక                        -   54 కోట్లు nతమిళనాడు                   -   48 కోట్లు nకేరళ                          -   28 కోట్లు nరెస్ట్ ఆఫ్ ఇండియా            -    11 కోట్లు nఓవర్ సీస్                     -    145 కోట్లు nమొత్తం                        -    705 కోట్ల గ్రాస్

బాహుబలి 2 నాలుగు రోజుల వసూళ్లు

ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 చరిత్ర సృష్టిస్తోంది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధిస్తోంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత వసూల్ చేసిందో తెలుసా ........ దాదాపు 88 కోట్ల షేర్ వసూల్ చేసి అది కూడా నాలుగు రోజుల్లోనే ఇంతటి భారీ మొత్తం రావడంతో అందరూ షాక్ అవుతున్నారు . బాహుబలి 2 ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లలో నాలుగు రోజుల్లో సాధించిన  వసూళ్లు ఇలా ఉన్నాయి.తెలంగాణ           -  24 కోట్ల షేర్ nరాయలసీమ        -  14. 55 కోట్ల షేర్ nకృష్ణా                -    6. 40 కోట్ల షేర్ nగుంటూరు           -   10 కోట్ల షేర్ nవైజాగ్               -   10. 96 కోట్ల షేర్ nఈస్ట్                 -   9. 96కోట్ల షేర్ nవెస్ట్                 -   8. 21 కోట్ల షేర్ nనెల్లూరు             -   3. 80 కోట్ల షేర్ nమొత్తం              -   87. 88 కోట్ల షేర్

400 కోట్ల క్లబ్ లో బాహుబలి 2

సునామి సృష్టిస్తోంది బాహుబలి 2. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది . కేవలం మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరింది బాహుబలి 2. ఈ లెక్కన చూస్తుంటే అమీర్ ఖాన్ దంగల్ రికార్డులను అవలీలగా బద్దలు కొట్టడమే కాకుండా మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది బాహుబలి 2.     ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , ఓవర్ సీస్ , కర్ణాటక , తమిళనాడు , ఉత్తరాది అనే తేడా లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది బాహుబలి 2. రెండు రోజుల్లోనే 217 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించిన బాహుబలి మూడో రోజు కూడా అదేజోరు ని కొనసాగించింది దాంతో బాహుబలి 2 మొదటి మూడు రోజుల్లోనే 400 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది . తొలి  వీకెండ్ లోనే ఇంతటి వసూళ్ల ని సాధిస్తే రానున్న రోజుల్లో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం . 

ఫస్ట్ డేనే వంద కోట్లు సాధించిన బాహుబలి 2

భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన బాహుబలి 2 మొదటి రోజునే వంద కోట్ల కు పైగా వసూళ్లు సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది . అధికారికంగా ఇంకా లెక్కలు రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం అవలీలగా వంద కోట్ల పైనే వసూల్ చేసింది బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా 8000 వేలకు పైగా స్క్రీన్ లలో రిలీజ్ అయిన బాహుబలి 2 సంచలనాలను నమోదు చేస్తోంది .     హిందీ వెర్షన్ లో 35 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది . అలాగే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో 45 కోట్లు , కర్ణాటక లో 10కోట్లు , కేరళలో 4 కోట్లు , తమిళనాడు ఇలా అన్ని భాషల్లో కలిపి వంద కోట్ల కు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది . ఖచ్చితమైన లెక్కలు రావాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే . అయితే మొత్తానికి వంద కోట్ల పై చిలుకు సాధించి కొత్త రికార్డ్ సృష్టించింది బాహుబలి 2. 

శివలింగ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

రాఘవ లారెన్స్ హీరోగా నటించిన శివలింగ చిత్రానికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది అయితే హర్రర్ చిత్రాలకు లారెన్స్ కేరాఫ్ అడ్రస్ కావడంతో మొదటి వారం మంచి వసూళ్ల నే సాధించింది . మొదటి వారం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా ....... రెండు తెలుగు రాష్ట్రాలలో 6కోట్ల కు పైగా షేర్ ని వసూల్ చేసింది శివలింగ చిత్రం . ప్రముఖ దర్శకులు పి . వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రితిక సింగ్ హీరోయిన్ గా నటించింది.అనుకున్న రేంజ్ లో షేర్ రాలేదు కానీ 6 కోట్ల షేర్ ఓ డబ్బింగ్ చిత్రానికి రావడం గొప్పే మరి . తెలంగాణ లో 2 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేయగా ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 4కోట్ల షేర్ రాబట్టింది . మొత్తంగా 6. 09 కోట్ల షేర్ వచ్చింది శివలింగ చిత్రానికి . లారెన్స్ గత చిత్రాల మాదిరిగా సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది.

18 కోట్లు కలెక్ట్ చేసాడు గురు

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రం ఇప్పటివరకు 18 కోట్లు వసూల్ చేయడం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు . కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ భారీ వసూళ్ల ని సాధించాడు గురు . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించగా రితిక సింగ్ బాక్సర్ గా నటించింది . వెంకటేష్ కు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో కనిపించిన విధానానికి అందరూ షాక్ అయ్యారు కూడా .     అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బాగానే వసూళ్ల ని సాధించినప్పటికీ ఓవర్ సీస్ లో మాత్రం అంతగా ప్రభావం చూపించలేక పోయింది . అక్కడ ప్లాప్ అయ్యింది గురు చిత్రం . ఓవర్ సీస్ ని పక్కన పెడితే ఇక్కడ మాత్రం 18 కోట్ల షేర్ ని రాబట్టి భారీ లాభాలను అందించింది . 

కాటమ రాయుడు క్లోజింగ్ కలెక్షన్లు ఇవే

పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో నటించిన కాటమ రాయుడు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు కానీ మంచి వసూళ్ల నే సాధించింది . ప్రపంచ వ్యాప్తంగా కాటమ రాయుడు చిత్రం 62 కోట్లకు పైగా షేర్ ని  వసూల్ చేసింది . సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కున్న క్రేజ్ తో ఈమాత్రం వసూళ్లు చేయగలిగింది .                  ఏరియాల వారీగా కాటమ రాయుడు వసూళ్లు ఇలా ఉన్నాయి  నైజాం                          -  15. 54 కోట్లు  సీడెడ్                         -   8. 3 కోట్లు  ఉత్తరాంధ్ర                 -   6. 3 కోట్లు  ఈస్ట్                            -   5. 35 కోట్లు  వెస్ట్                             -   4. 22 కోట్లు  గుంటూరు                   -   4. 97 కోట్లు  కృష్ణా                            -  3. 65 కోట్లు  నెల్లూరు                       -  2. 08 కోట్లు  కర్ణాటక                         -  5. 47 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా      -  1. 30 కోట్లు  యు ఎస్ ఏ                   - 3. 42కోట్లు  రెస్ట్ ఆఫ్ వరల్డ్              -  1. 50 కోట్లు  మొత్తం                       -   62. 1 కోట్లు 

15 రోజుల్లో 17 కోట్లు కలెక్ట్ చేసిన గురు

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం మొత్తంగా 15 రోజుల్లో 17 కోట్లు కలెక్ట్ చేసింది . అది కూడా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే సుమా ! పదిహేడు కోట్ల షేర్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు . సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ,మొదట్లో అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదు కానీ ఆ తర్వాత క్రమేపి పుంజుకొని మంచి వసూళ్ళ ని రాబట్టింది గురు చిత్రం .      ఓవర్ సీస్ లో దెబ్బ తిన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ఇప్పటికే దాదాపు 17 కోట్ల షేర్ ని రాబట్టగా శాటిలైట్ , ఇతరత్రా కలిపి మరో ఆరేడు కోట్లు రావడం ఖాయం అంటే మొత్తంగా 25 కోట్ల సినిమా అన్నమాట . అంటే ఎంత లేదన్నా గురు సినిమాతో 15 కోట్లకు పైగా  లాభం పొందారు వెంకటేష్ అలాగే చిత్ర నిర్మాతలు కూడా . రితికా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన విషయం తెలిసిందే . 

లాభాల బాటలోకి వెళ్ళింది గురూ

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి లాభాల బాటలోకి వెళ్ళింది . ఓవర్ సీస్ నష్టాలు వచ్చినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తోంది గురు చిత్రం . 9 రోజుల్లోనే 13కోట్ల 35 లక్షల షేర్ ని వసూల్ చేసి ఔరా ! అనిపించింది . సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితిక సింగ్ హీరోయిన్ గా నటించింది . ఇక ఏరియాల వారీగా గురు వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా !   నైజాం              -  5. 89 కోట్లు  సీడెడ్              -  1. 53 కోట్లు  ఉత్తరాంధ్ర      -  1. 84 కోట్లు  ఈస్ట్                 - 1. 09 కోట్లు  వెస్ట్                  - 0. 62 కోట్లు  గుంటూరు       -  0. 95 కోట్లు  కృష్ణా                -  1. 08 కోట్లు  నెల్లూరు           -  0. 35 కోట్లు  మొత్తం            -  13. 35 కోట్లు 

150 కోట్ల క్లబ్ లో కాటమ రాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు చిత్రం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది . టాక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే కొల్లగొట్టింది కాటమ రాయుడు చిత్రం అయితే భారీ లాభాలకు అమ్ముకోవడం వల్ల కొంతమంది డిస్ట్రి బ్యుటార్లకు నష్టాలు మాత్రం తప్పడం లేదు . మార్చి 17న రిలీజ్ అయిన కాటమ రాయుడు మొదటి వారం 55 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది .     కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం లో పవన్ సరికొత్తగా కనిపించాడు . అయితే హీరోయిన్ గా శృతి హాసన్ మైనస్ అయ్యిందనే ప్రచారం బాగా సాగింది . మొత్తానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వరల్డ్ వైడ్ గా 150 కోట్ల వసూళ్ళ ని సాధించడం పవన్ కళ్యాణ్ క్రేజే కారణం . 

ఫస్ట్ వీక్ షేర్ లో టాప్ 10 చిత్రాలు ఏవో తెలుసా

మొదటి వారంలో తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఏకంగా పవన్ కళ్యాణ్ చిత్రాలు మూడు స్థానం సంపాదించి సంచలనం సృష్టిస్తున్నాయి . టాప్ 10 లో పవర్ స్టార్ వి 3 చిత్రాలు ఉండటం విశేషం . టాప్ టెన్ లో బాహుబలి , ఖైదీ నెంబర్ 150 , జనతా గ్యారేజ్ , శ్రీమంతుడు , కాటమ రాయుడు , అత్తారింటికి దారేది ,సర్దార్ గబ్బర్ సింగ్ , సరైనోడు , నాన్నకు ప్రేమతో , గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ఉండగా అందులో పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు , అత్తారింటికి దారేది , సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు వరుసగా 5, 6, 7 వ స్థానాలలో నిలిచాయి .    ఫస్ట్ వీక్ లో టాప్ టెన్ చిత్రాల లిస్ట్  బాహుబలి తెలుగు లో 107 కోట్ల షేర్   ఖైదీ నెంబర్ 150 - 77. 31 కోట్ల షేర్  జనతా గ్యారేజ్  -  62. 5కోట్ల షేర్  శ్రీమంతుడు     -  55. 25 కోట్ల షేర్  కాటమ రాయుడు  - 55. 25 కోట్ల షేర్  అత్తారింటికి దారేది  -  42. 27 కోట్ల షేర్  సర్దార్ గబ్బర్ సింగ్  -  46. 94 కోట్ల షేర్  సరైనోడు                 - 45 . 21 కోట్ల షేర్  నాన్నకు ప్రేమతో   -  44. 2 కోట్ల షేర్  గౌతమిపుత్ర శాతకర్ణి   - 41. 69 కోట్ల షేర్ 

పది రోజుల్లో 125 కోట్లు వసూల్ చేసిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి . మొత్తం పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి ఆశ్చర్య పరిచింది . అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 90 కోట్లు కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 కోట్లకు పైగా వసూళ్ల ని రాబట్టాలి . అయితే డివైడ్ టాక్ లోనూ  వరల్డ్ వైడ్ గా 125 కోట్లు రాబట్టడం విశేషమే మరి . డాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించాడు .     తమిళ చిత్రం వీరం కి రీమేక్ గా తెరకెక్కిన కాటమ రాయుడు చిత్రం ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయింది దాంతో పవన్ కున్న ఇమేజ్ తోనే ఈమాత్రం వసూళ్ల ని సాధిస్తోంది . అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది .

కాటమ రాయుడు ఫస్ట్ వీక్ కలెక్షన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల షేర్ ని సాధించింది . కిషోర్ పార్దాసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు . పవన్ సరసన శృతి హాసన్ నటించిన కాటమ రాయుడు చిత్రం మార్చి 24న రిలీజ్ అయ్యింది . అయితే అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోయినా సర్దార్ గబ్బర్ సింగ్ లా డిజాస్టర్ మాత్రం కాలేదు . ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల షేర్ ఏరియాల వారీగా ఇలా ఉంది.నైజాం                   -    13. 1 కోట్లుసీడెడ్                   -     7. 16 కోట్లుఉత్తరాంధ్ర                -     5. 68కోట్లుఈస్ట్                     -     4. 96 కోట్లువెస్ట్                      -     3. 93కోట్లుకృష్ణా                     -     3. 29 కోట్లుగుంటూరు                -      4. 52కోట్లునెల్లూరు                  -      1. 9 కోట్లుకర్ణాటక                   -      5. 2కోట్లుయూఎస్ ఏ               -      3. 70 కోట్లురెస్ట్ ఆఫ్ ఇండియా        -      2. 60 కోట్లురెస్ట్ ఆఫ్ వెరల్డ్ మొత్తం : 55. 86 కోట్లు

ఫస్ట్ డే కాటమ రాయుడు వసూళ్లు ఎంతో తెలుసా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ మీద సత్తా చాటాడు . కాటమ రాయుడు చిత్రంతో మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసాడో తెలుసా ....... 42 కోట్ల పైనే . ఓవర్ సీస్ లో 15 కోట్లకు పైగా వసూల్ చేయగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో 27 కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించాడు . అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లు కూడా రావాల్సి ఉంది దాంతో మొత్తం మీద ఫస్ట్ డే వసూళ్లు 50 కోట్ల ని చేరడం ఖాయంగా కనిపిస్తోంది . మిరా మిరా మీసం అంటూ పవన్ పంచెకట్టు లో తిప్పిన మీసానికి ఈ రికార్డులు దాసోహం అయ్యాయి.కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించిన విషయం తెలిసిందే . శృతి హాసన్ నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు . మొదటి రోజునే 50 కోట్ల గ్రాస్ ని రాబట్టడంతో  ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

2 కోట్లు వసూల్ చేసిందట ఆ చిత్రం

ఈరోజుల్లో సినిమా రిలీజ్ చేయడమే కష్టమై పోతున్న సమయంలో ఓ డబ్బింగ్ చిత్రం రిలీజ్ కావడమే కాకుండా 2 కోట్ల రూపాయలను వసూల్ చేయడం సంచలనం సృష్టిస్తోంది . ప్రతీవారం 5 నుండి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే వాటిలో కొన్ని సినిమాలు అయితే కనీసం పోస్టర్ ల ఖర్చు ని కూడా వసూల్ చేయలేక పోతున్నాయి కానీ '' 16 '' అనే డబ్బింగ్ చిత్రం మాత్రం ఏకంగా 2 కోట్ల రూపాయలను వసూల్ చేయడం సంచలనంగా మారింది . అయితే ఈ సినిమాని మీ థియేటర్ లో వేసుకోండి నాయనా అని అంటే 2 లక్షలు ముందుగా కడితేనే థియేటర్ ఇస్తాము లేదంటే లేదు అని చెప్పారట .      దాంతో అవసరం లేదు అంటూ మరొక థియేటర్ లో వేశారు కట్ చేస్తే ఫుల్ క్రౌడ్ తో పరుగులు తీస్తోంది 16 చిత్రం . డిఫరెంట్ జోనర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని 16 తో మరోసారి ప్రూవ్ చేసారు . పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడం కష్టం అవుతున్న ఈరోజుల్లో ఓ డబ్బింగ్ చిత్రం 2 కోట్లని వసూల్ చేయడం సంచలనంగా మారింది .

శాతకర్ణి ఎంత వసూల్ చేసాడో తెలుసా

నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో నటించిన వందో చిత్రం '' గౌతమిపుత్ర శాతకర్ణి '' . జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం అఖండ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మీద 77 కోట్ల కు పైగా వసూళ్లు సాధించినట్లు స్వయంగా దర్శక నిర్మాతలు ప్రకటించారు . రేపు శాతకర్ణి చిత్రం రిలీజ్ అయి యాభై రోజులను పూర్తిచేసుకుంటున్న సందర్బంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో పాటు 77 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు . బాలయ్య శాతకర్ణి గా సింహగర్జన చేసిన విషయం తెలిసిందే . బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , చిరంతన్ భట్ సంగీతం , క్రిష్ డైరెక్షన్ , బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ వెరసి బాలయ్య నటజీవితంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గౌతమీపుత్ర శాతకర్ణి .     ఓవర్ సీస్ లోను శాతకర్ణి చిత్రం భారీ వసూళ్ల ని సాధించింది . ఇప్పటివరకు బాలయ్య కు వన్ మిలియన్ డాలర్ల సినిమా అనేది లేదు శాతకర్ణి చిత్రానికి ముందు కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం ఏకంగా రెండు మిలియన్ డాలర్ల ని కొల్లగొట్టింది .

గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన  గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలో దిగి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . జనవరి 12న రిలీజ్ అయిన శాతకర్ణి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్లకు పైగా షేర్ ని సాధించి బాలయ్య చిత్రాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య తల్లిగా ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటించగా భార్య గా శ్రియా శరన్ నటించింది .  ఇక ఏరియాల వారీగా శాతకర్ణి వసూళ్లు ఇలా ఉన్నాయి  నైజాం                :  10. 15కోట్లు కృష్ణా                 :  3. 15 కోట్లుగుంటూరు            :  4. 2 కోట్లుఉత్తరాంధ్ర             :  5. 2 కోట్లుఈస్ట్                  :   3. 5 కోట్లువెస్ట్                  :    3. 5 కోట్లుసీడెడ్                :    8 కోట్లునెల్లూరు              :   1. 8 కోట్లుకర్ణాటక               :   4. 25 కోట్లుఓవర్ సీస్            :   8 కోట్లురెస్ట్ ఆఫ్ ఇండియా    :  1 కోటిమొత్తం                :  52. 75 కోట్లు 

25 కోట్లు వసూల్ చేసిన నాని

నేను లోకల్ చిత్రంతో 25 కోట్లు వసూల్ చేసాడు నాని . నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి నాని చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . నాని సరసన కీర్తి సురేష్ నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది నేను లోకల్ చిత్రం .     మొదటి మూడు రోజుల్లోనే మంచి వసూళ్ల ని సాధించి కృష్ణగాడి వీర ప్రేమ గాధ , మజ్ను , జెంటిల్ మన్ , భలే భలే మగాడివోయ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి నేను లోకల్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది . కథ , కథనం యావరేజ్ గానే ఉన్నప్పటికీ నాని యాక్టింగ్ , కీర్తి సురేష్ గ్లామర్ తో మంచి వసూళ్లు వస్తున్నాయి . 

గౌతమిపుత్ర శాతకర్ణి 8 రోజుల కలెక్షన్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సంచలన విజయం సాధిస్తోంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయగా సంక్రాంతి సమరంలో ఘనవిజయం సాధిస్తోంది . ఇక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది శాతకర్ణి చిత్రం . మొత్తం 8  రోజులలో 50 . 21 కోట్ల షేర్ ని సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది .ఏరియాల వారీగా గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు ఇలా ఉన్నాయినైజాం                     -    9. 15 కోట్ల షేర్ nసీడెడ్                     -    7. 59 కోట్ల షేర్ nనెల్లూరు                 -     1. 65 కోట్లు nగుంటూరు              -     3. 76 కోట్లు nకృష్ణా                      -     2. 62 కోట్లు nవెస్ట్                        -     3. 11 కోట్లు nఈస్ట్                       -    3. 18 కోట్లు nవైజాగ్                    -     4. 75 కోట్లు nఓవర్ సీస్             -      9 కోట్లు nకర్ణాటక                  -     4 . 20 కోట్లు nరెస్ట్ ఆఫ్ ఇండియా   -  1. 20 కోట్లు nమొత్తం షేర్            - 50 . 21 కోట్లు . n 

చిరంజీవి సినిమా ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం మొదటి వారం ఎన్ని కోట్ల ని కలెక్ట్ చేసిందో తెలుసా ..... అక్షరాలా 108. 48 కోట్లు . ఈ విషయాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేసాడు . కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే 76. 15 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని చాలా సంతోషంగా చెబుతున్నాడు అల్లు అరవింద్ . మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో వంద కోట్లకు పైగా వసూళ్ల ని రాబట్టడంలో ఖైదీ యూనిట్ చాలా సంతోషంగా ఉంది .     9 ఏళ్ల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఇంతటి భారీ విజయాన్ని సాధించడంతో మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు . తమిళనాట సంచలన విజయం సాధించిన కత్తి చిత్రాన్ని తెలుగులో ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేసారు . వివివినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించడం విశేషం . 

వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నాడు . జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని చేరుకుంది . 50 ప్లస్ ఏజ్ లో 50 కోట్ల క్లబ్ ని కేవలం మూడు రోజుల్లోనే అందుకొని సంచలనం సృష్టించాడు బాలయ్య . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంపై సినీ విమర్శకుల ప్రశంసల తో పాటు యావత్ సినీ ప్రముఖులు , ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు .     ఓవర్ సీస్ , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , రెస్ట్ ఆఫ్ ఇండియా అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు శాతకర్ణి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు . ఒకవైపు కలెక్షన్ల తుఫాన్ మరోవైపు ప్రశంసలు లభిస్తుండటంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . ఇక ఈ సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తయినప్పటికీ రెండో వారంలోకి ప్రవేశించి నప్పటికీ వసూళ్ల లో మాత్రం జోరు తగ్గలేదు . 

వంద కోట్ల దిశగా బాలయ్య శాతకర్ణి

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది . జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో వసూళ్ల ని సాధించి నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది . అలాగే దర్శకులు క్రిష్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ గా శాతకర్ణి నిలిచింది . తొలి మూడు రోజుల్లోనే 50 కోట్ల ని రాబట్టిన శాతకర్ణి వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది . అసలు బాలయ్య కు ఏ సెంటర్లు అంతగా కలిసి రావు కానీ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం మాత్రం ఏ సెంటర్ల లో దుమ్ము దులిపేస్తోంది .      క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ల ని సాధిస్తూ అంతకుమించిన పేరు ప్రతిష్ట లని తెచ్చిపెట్టాయి బాలయ్య కు అలాగే క్రిష్ కు . వంద కోట్ల దిశగా దూసుకుపోతున్న బాలయ్య చిత్రం అటు నుండి 125 కోట్ల ని అవలీలగా చేరుకోగలదు అని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి బాలయ్య భారీ హిట్ కొట్టడంతో నందమూరి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు . 

400 కోట్ల క్లబ్ లో దంగల్

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం సృష్టించింది . 370 కోట్ల వసూళ్ల ని కేవలం ఇండియాలోనే సాధించి సంచలనం సృష్టించింది దంగల్ . ధీర వనితల కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ఇప్పటివరకు టాప్ 2గా ఉన్న పీకే , భజ్రంగీ భాయీజాన్ చిత్రాల వసూళ్ల ని అధిగమించి సంచలనం సృష్టించింది దంగల్ . ప్రస్తుతం భారతీయ చిత్రాల్లో అమీర్ దంగల్ నెంబర్ వన్ గా ఉంది .     ఇప్పటికే 370 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించిన దంగల్ మరో రెండు మూడు రోజుల్లో నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది . అమీర్ ఖాన్ నటన హృదయాలకు హత్తుకునే సన్నివేశాలతో మొత్తానికి దంగల్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది .

శాతకర్ణి 2 రోజుల వసూళ్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం జనవరి 12న రిలీజ్ అయి సంచలన విజయం సాధిస్తోంది . బాలయ్య సరసన శ్రియా శరన్ నటించగా తల్లిగా హేమమాలిని నటించింది . రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల కు పైగా షేర్ సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతోంది . రెండు తెలుగు రాష్ట్రాలలో షేర్ వివరాలు ఇలా ఉన్నాయి .  నైజాం                :  2. 29 కోట్లు   సీడెడ్                :  2. 77 కోట్లు  కృష్ణా                 :  1. 06 కోట్లు  గుంటూరు          :  2. 14 కోట్లు  ఈస్ట్                  :  1. 25 కోట్లు  వెస్ట్                  :    1. 73 కోట్లు  నెల్లూరు           :     77 లక్షలు  వైజాగ్              :    1. 50 కోట్లు  మొత్తం            : 13. 51 కోట్లు  ఇవి కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోని షేర్ మాత్రమే గ్రాస్ కాదు . 

గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ డే కలెక్షన్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . రెండు తెలుగు రాష్ట్రాలలో పది కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం . బాలకృష్ణ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధిస్తోంది గౌతమిపుత్ర శాతకర్ణి . ఒక్క రోజులోనే తెలుగులోనే పది కోట్ల కు పైగా షేర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు .  కేవలం రెండు రాష్ట్రాలలోనే సాధించిన వసూళ్లు అలా ఉంటె ఇక ప్రపంచ వ్యాప్తంగా కలిపితే 18 కోట్లకు చేరేలా ఉంది షేర్ . నైజాం లో 2. 3 కోట్ల షేర్  సీడెడ్               :   2. 2 కోట్లు  ఉత్తరాంధ్ర       :   88 లక్షలు  ఈస్ట్                  :   78 లక్షలు  వెస్ట్                   :   1. 34 కోట్లు  కృష్ణా                 :   80 లక్షలు  గుంటూరు         :   1. 64 లక్షలు  నెల్లూరు            :    43 లక్షలు  మొత్తం :           10 . 5 కోట్ల షేర్ 

చరణ్ ధృవ ఫస్ట్ డే కలెక్షన్లు

రాంచరణ్ హీరోగా నటించిన ధృవ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజున ధృవ రెండు తెలుగు రాష్ట్రాలలో 10 . 57 కోట్ల షేర్ సాధించింది . పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో ఈ సొమ్ము పెద్దదే కానీ గత ఏడాది చరణ్ నటించిన బ్రూస్ లీ మొదటి రోజున ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా ..... 12. 7 కోట్లు కానీ సంవత్సరం తర్వాత రిలీజ్ అయిన ధృవ మరింత ఎక్కువ సొమ్ము మొదటి రోజున రాబట్టాలి కానీ దాని కంటే తక్కువగా 10. 57 కోట్లు మాత్రమే రాబట్టింది . ఏరియాల వారీగా ధృవ వసూళ్లు ఇలా ఉన్నాయి . nనైజాం                -   3. 26 కోట్లు nసీడెడ్                -    2. 07 కోట్లు nకృష్ణా                  -    68 లక్షలు nగుంటూరు         -     1. 08 కోట్లు nఈస్ట్                   -      85 లక్షలు nవెస్ట్                    -       90 లక్షలు nవైజాగ్                -       1. 32 కోట్లు nనెల్లూరు             -        41 లక్షలు nమొత్తం              -        10 . 57 కోట్లు 

ధృవ ప్రీమియర్ కలెక్షన్లు వెరీ పూర్

ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించాలని అందునా ప్రీమియర్ షోలతోనే ఎక్కువ సొమ్ము రాబట్టాలని భావించిన ఆ చిత్ర బృందం రాంచరణ్ , అరవింద్ స్వామి , సురేందర్ రెడ్డి లతో కలిసి అమెరికా చెక్కేశారు కానీ ప్రీమియర్ కలెక్షన్లు చూసి షాక్ అయ్యారట ! ఎందుకంటే చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రానికి ఓవర్సీస్ లో $285K డాలర్లను వసూల్ చేయగా ధృవ కేవలం $223,783 డాలర్లను మాత్రమే వసూల్ చేసింది . చరణ్ పాత రికార్డు ని సైతం బద్దలు కొట్టకపోవడంతో ఆ చిత్ర బృందం ఖంగు తిన్నారట . పైగా ఓవర్సీస్ జనాలను ఆకర్షించడానికి అక్కడ భారీ వసూళ్ల ని సాధించడానికి పనిగట్టుకొని వెళ్లి కూడా ప్రయోజనం లేకపోయింది అని ఫీల్ అవుతున్నారట . సినిమాకు , చరణ్ కు మంచి అప్లాజ్ వస్తోంది కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు మరి . 

ఫస్ట్ డే నే షాక్ ఇచ్చిన బేతాళుడు

బిచ్చగాడు సంచలన విజయం సాధించడం తో ఆ ప్రభావం బేతాళుడు పై పడింది అందుకే మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి ముప్పై లక్షల షేర్ రాబట్టి షాక్ ఇచ్చింది ట్రేడ్ విశ్లేషకులకు . విజయ్ ఆంటోనీ నటించి సంగీతం అందించిన బేతాళుడు చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది . బిచ్చగాడు తర్వాత వచ్చిన చిత్రం కాబట్టి బేతాళుడు పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు బయ్యర్లు కానీ ఆశించిన స్థాయిలో విజయం దక్కేలా లేదు ఎందుకంటే ఫస్టాఫ్ ని ఓ రకంగా తీసుకెళ్లాడు కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో రాణించలేక పోవడంతో మిశ్రమ స్పందన వస్తోంది అయితే వసూళ్లు మాత్రం మొదటి రోజు అనూహ్యంగా వచ్చాయి . ఒక డబ్బింగ్ చిత్రానికి కోటి ముప్పై లక్షల షేర్ రావడం నిజంగా సంచలనమే ! 

15 కోట్లు వసూల్ చేసిన మజ్ను

నాని -అను ఇమ్మన్యూల్ నటించిన మజ్ను చిత్రం మొత్తానికి పాజిటివ్ టాక్ తో రన్ అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా యావరేజ్ గానే ఉన్నాయి . మొత్తానికి మూడు వారాల్లో 15 . 25 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఫరవాలేదని పించింది . విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లలో 11 . 56 కోట్ల షేర్ ని  ఓవర్సీస్ , కర్ణాటక కలుపుకొని దాదాపు నాలుగు కోట్ల షేర్ ని వసూల్ చేసింది . ఇక ఏరియాల వారీగా మజ్ను సాధించిన షేర్ ఇలా ఉంది . నైజాం         - 4 .59 కోట్లు సీడెడ్          - 1 . 49 కోట్లు ఉత్తరాంధ్ర      - 1 . 57 కోట్లు ఈస్ట్             - 0 . 89 కోట్లు వెస్ట్              - 0 . 87  కోట్లు కృష్ణా              - 0 . 81  కోట్లు గుంటూరు       - 0 . 90  కోట్లు నెల్లూరు          - 0 . 44 కోట్లు కర్ణాటక            - 1 . 29  కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 0 . 20 కోట్లు ఓవర్సీస్       - 2 . 20 కోట్లు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా - 15 .25 కోట్లు 

ప్రేమమ్ ఫస్ట్ డే కలెక్షన్లు

అక్కినేని నాగచైతన్య శృతి హాసన్ , అనుపమ పరమేశ్వరన్ , మడోన్నా సెబాస్టియన్ నటించిన ప్రేమమ్ నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే . రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క రోజే 2 కోట్ల 34 లక్షల రూపాయల షేర్  వసూల్ చేసి సంచలనం సృష్టించింది ప్రేమమ్ . చందు మొండేటి దర్శకత్వం లో  తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది . మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ తెలుగులో కూడా భారీ విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేమమ్ వసూళ్లు ఇలా ఉన్నాయి . n nనైజాం          - 85 లక్షలు nసీడెడ్           - 32 లక్షలు nగుంటూరు      - 25 లక్షలు nకృష్ణా             - 19 లక్షలు nఈస్ట్               - 21 లక్షలు nవెస్ట్                - 15 లక్షలు nనెల్లూరు          - 11 లక్షలు nమొత్తం షేర్    - 2. 34 కోట్లు 

జనతా గ్యారేజ్ అక్కడ కూడా దెబ్బ కొట్టింది

ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మంచి విజయమే సాధించినప్పటికీ యుఎస్ లో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని అనుకున్నారు కానీ అక్కడ 2 మిలియన్ డాలర్ల ని కూడా వసూల్ చేయలేకపోయింది . సెప్టెంబర్ 1 న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ మొత్తం పదహారు రోజులకు గాను $ 1 ,777, 542 మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసింది . మొదట్లో ఊపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆ జోరు కాస్త తగ్గింది దాంతో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడానికి ఇవ్వాలో రేపో సమయం తీసుకోనుంది జనతా గ్యారేజ్ . యుఎస్ లో జనతా గ్యారేజ్ హిట్టే కానీ అనుకున్న రేంజ్ లో వసూళ్లు దక్కలేదు అవలీలగా 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందని అనకుంటే నత్త నడకతో సాగుతోంది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎన్టీఆర్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . 

జనతా గారేజ్ 2 రోజుల కలెక్షన్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం జనతా గారెజ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ ఐన విషయం తెలిసిందే. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దాదాపు 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాగే రెండో రోజు కూడా జోరు చూపించినప్పటికి కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి .మొత్తం 2రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా  ఉన్నాయి .నైజాం        - 7.66 కోట్లు సీఢెడ్.       - 4.44 కోట్లు ఈస్ట్.         - 2. 58 కోట్లువెస్ట్.          - 2. 15కోట్లు ఉత్తరాంధ్ర  - 3 కోట్లు కృష్ణా        -  1. 94 కోట్లు గుంటూరు  -  2. 99 కోట్లు నెల్లూరు.    - 1. 04 కోట్లు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల 76 లక్షల షేర్ సాధించి సత్తా చాటాడు ఎన్టీఆర్.

మొత్తానికి 28 కోట్లు రాబట్టాడు

గతనెల 12 న రిలీజ్ అయిన వెంకటేష్ బాబు బంగారం చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది అయితే ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళు మునిగిపోవడం ఖాయమని అనుకున్నారు అంతా కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ సినిమా ఏది లేకపోవడంతో మొత్తానికి 28 కోట్ల షేర్ రాబట్టాడు వెంకటేష్ దాంతో ఆ సినిమా కొనుకున్న బయ్యర్లు ఒడ్డున పడ్డట్లే ! నష్టాలు వస్తాయని భావించిన వాళ్ళకు ఆ స్థానంలో నష్టాలు రాకుండా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో అందరూ దాదాపుగా సంతోషంగానే ఉన్నారు . మారుతి దర్శకత్వంలో వెంకటేష్ - నయనతార జంటగా నటించిన బాబు బంగారం మొత్తానికి హిట్ బాట పట్టింది . ఏరియాల వారీగా బాబు బంగారం వసూళ్లు ఇలా ఉన్నాయి . నైజాం - 8 . 15 కోట్లు సీడెడ్ -  3 .3 కోట్లు ఉత్తరాంధ్ర - 3. 1 కోట్లు గుంటూరు - 2 .1 కోట్లు కృష్ణా    -    1 . 8 కోట్లు ఈస్ట్      -    1 .98 కోట్లు వెస్ట్       -    1. 78 కోట్లు నెల్లూరు  -    94 లక్షలు కర్ణాటక      - 2 .60 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 50 లక్షలు యు ఎస్ ఏ -  1. 60 కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 65 లక్షలు మొత్తం -  28 . 52 కోట్లు 

ఫస్ట్ డే 21 కోట్లని కొల్లగొట్టిన జనతా గ్యారేజ్

భారీ అంచనాల మద్య నిన్న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ దాదాపు 21 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది . ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్రాల్లో అత్యధికంగా బాహుబలి , సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు ఫస్ట్ డే వసూళ్ళ లో మొదటి రెండు స్థానాలు ఆక్రమించగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూడో స్థానాన్ని ఆక్రమించింది . ఓవర్సీస్ , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , రెస్ట్ ఆఫ్ ఇండియా అన్న తేడా లేకుండా మొదటి రోజు భారీ వసూళ్ళ ని సాధించింది . అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ ఉంది , అనుకున్నంత గొప్పగా లేదని అంటున్నారు కానీ లాంగ్ వీకెండ్ ఉండటంతో పైగా నైజాం లో టికెట్ రేట్ల ని పెంచడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి . ఇక మరో మూడు రోజులు కూడా ఈ స్థాయిలో కాకపోయినా బాగానే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వరుసగా సెలవులు వస్తున్నాయి . టాక్ సంగతి ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి దాంతో ఈ చిత్రం అవలీలగా 60 కోట్ల షేర్ ని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. 

మంచి కలెక్షస్న్ తో దూసెళ్తున్న చుట్టాలబ్బాయి

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కి భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య నిన్న రిలీజైన చుట్టాలబ్బాయి మిక్స్ డ్ రివ్యూస్ వినిపిస్తున్నా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న చుట్టాలబ్బాయి ఆది కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రిలీజైన ప్రతి సెంటర్ లోను హౌజ్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న చుట్టాలబ్బాయి ఆంధ్రా, నైజాం సెంటర్ లలో ఇప్పటికే 3.1 కోట్లు వసూలు చేసింది. నిన్న రిలీజ్ అయినా ఈ సినిమా కి థియేటర్స్  దొరకలేదు అని అర్థం అవుతుంది సినిమా కలెక్షన్స్ బాగుండటం తో ఈరోజు నుంచి దగ్గర దగ్గర 70 థియేటర్స్ ని పెంచారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో అందరు డిస్టరుబూటోర్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ కలెక్షన్స్ చెప్పటం విశేషం.

మూడు రోజుల్లో 50 కోట్ల వసూళ్లు

మొదటి రోజు 14.11 కోట్లు , రెండో రోజు 16.43 కోట్లు ,మూడో రోజు 19.88 కోట్లు మొత్తంగా మూడు రోజుల్లో 50.42 కోట్ల వసూళ్ళ తో దుమ్ము లేపుతున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ . ఈనెల 12న అక్షయ్ కుమార్ - ఇలియానా జంటగా నటించిన ''రుస్తుం '' రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా లభిస్తున్నాయి . అక్షయ్ నటన . ఇలియానా గ్లామర్ వెరసి రుస్తుం ని హిట్ బాట పట్టించాయి .

13 రోజుల్లో 43 కోట్ల షేర్ ని రాబట్టిన అ ....ఆ

కేవలం 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది త్రివిక్రమ్ ''అ ....ఆ '' చిత్రం . ఇక ఓవర్ సీస్ లో అయితే టూ మచ్ వసూళ్ళ తో మహేష్ చిత్రానికే ఎసరు పెడుతున్నాడు నితిన్ . త్రివిక్రమ్ మాయాజాలం నితిన్ - సమంత ల నటన ,చివర్లో రావు రమేష్ పండించిన హాస్యం వెరసి అ ....ఆ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి . ఇక ఏరియాల వారీగా అ .....ఆ వసూళ్లు ఇలా ఉన్నాయి .  నైజాం - 12.25 కోట్లు సీడెడ్ - 3.82 కోట్లు ఉత్తరాంద్ర - 3.46 కోట్లు గుంటూరు - 2.34 కోట్లు ఈస్ట్ - 2.06 కోట్లు కృష్ణా - 2.03 కోట్లు వెస్ట్ - 1.73 కోట్లు నెల్లూరు - 0.83 కోట్లు కర్ణాటక - 2.64 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.72 కోట్లు యుఎస్ ఏ - 9.9 కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 1. 35 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ గా - 43. 13 కోట్ల షేర్ వసూల్ చేసింది.

అ ....ఆ 11 రోజుల వసూళ్లు

జూన్ 2న రిలీజ్ అయిన ''అ ....ఆ '' భారీ వసూళ్ళ ని సాధిస్తూ నితిన్ ని యాభై కోట్ల క్లబ్ లో చేర్చుతూ నితిన్ రేంజ్ ని పెంచింది . నితిన్ , సమంత , రావు రమేష్ ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అ ....ఆ బాగానే వసూల్ చేస్తోంది . 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 27.66 కోట్ల షేర్ ని వసూల్ చేసి భారీ లాభాలను ఆర్జిస్తోంది . తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఇలా ఉన్నాయి . నైజాం        - 11.77 కోట్లు (షేర్ )సీడెడ్          - 3.67 కోట్ల షేర్ ఉత్తరాంద్ర      - 3.46 కోట్ల షేర్ గుంటూరు      - 2.33 కోట్ల షేర్ కృష్ణా             - 1.96 కోట్ల షేర్ ఈస్ట్               - 1.99 కోట్ల షేర్ వెస్ట్                - 1.69 కోట్ల షేర్ నెల్లూరు          - 0. 79 కోట్ల షేర్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో 27.66 కోట్ల షేర్ ని కేవలం 11రోజుల్లోనే వసూల్ చేసింది.

దుమ్ము రేపుతున్న అ ..... ఆ కలెక్షన్లు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాయాజాలం మరోసారి వెండితెర మీద పనిచేసింది దాంతో ''అ ...... ఆ '' చిత్రం భారీ వసూళ్ళ ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది . కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . అంటే మొదటి వారంలోనే దాదాపుగా అందరి పెట్టుబడి వస్తుండగా ఇక మిగిలిన రోజులన్నీ లాభాల బాటలో పయనించ నున్నాయి . మొదటి వారంలోనే పెట్టుబడి వస్తున్న మొదటి చిత్రంగా ఈ మద్య రిలీజ్ అయిన చిత్రాల్లో రికార్డు సృష్టిస్తోంది . nఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అ .....ఆ 5 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి . n n nనైజాం    - 7.67 కోట్లు nసీడెడ్    - 2.58 కోట్లు nఉత్తరాంద్ర - 1.95 కోట్లు nగుంటూరు - 1.44 కోట్లు nకృష్ణా     - 1.38 కోట్లు nఈస్ట్      - 1. 51 కోట్లు nవెస్ట్     - 1. 12 కోట్లు nనెల్లూరు  - ౦. 53 కోట్లు nమొత్తం - 18. 18 కోట్లు 

అ .............ఆ వీకెండ్ కలెక్షన్లు

జూన్ 2న రిలీజ్ అయిన అ .......ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళ ని సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది . వీకెండ్ లో 15.89 కోట్లు వసూల్ చేసి నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది . త్రివిక్రమ్ మాయాజాలం , సమంత పెర్ఫార్మెన్స్ , మిక్కీ జే మేయర్ పాటలు వెరసి తొలి వీకెండ్ లో మంచి వసూళ్ళ ని సాధించింది అ .......ఆ . ఇక ఓవర్సీస్ లోను బ్రహ్మాండమైన వసూళ్ళ ని సాధిస్తూ 2మిలియన్ క్లబ్ లో చేరడానికి శరవేగంగా దూసుకేలుతోంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అ .......ఆ వసూళ్లు ఇలా ఉన్నాయి nనైజాం - 6.66 కోట్లు nసీడెడ్ - 2.27 కోట్లు nగుంటూరు - 1.26 కోట్లు nకృష్ణా  -  1.22 కోట్లు nఈస్ట్    - 1.35 కోట్లు nవెస్ట్    -  1 కోటి nఉత్తరాంద్ర - 1.65 కోట్లు nనెల్లూరు -  0. 48 కోట్లు nమొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ వసూళ్లు - 15. 89 కోట్లు

2 రోజుల్లో 31 కోట్ల ని వసూల్ చేసింది

సినిమా రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి . దాంతో కేవలం 2 రోజుల్లోనే 31. 51 కోట్లను వసూల్ చేసి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది ''హౌజ్ ఫుల్ 3'' . బాలీవుడ్ లో సీక్వెల్ లు వరుసగా ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . హౌజ్ ఫుల్ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన రెండు చిత్రాలు కాసుల వర్షం కురిపించడంతో మూడో చిత్రం కూడా చేసారు . అక్షయ్ కుమార్ , రితేష్ దేశ్ ముఖ్ , అభిషేక్ బచ్చన్ , జాక్వలెన్ ఫెర్నాండేజ్ , లిసా హెడెన్ , నర్గీస్ ఫక్రి కాంబినేషన్ లో సాజిద్ -ఫరాద్ సంయుక్తంగా రూపొందించారు . మొదటి రోజున 15.21 కోట్లు వసూల్ చేయగా రెండో రోజున 16.30 కోట్ల వసూళ్ళ ని రాబట్టింది హౌజ్ ఫుల్ 3.

అ...ఆ ఓవర్సీస్ వసూళ్లు

నితిన్ -సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ''అ ........ఆ '' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ళ ని రాబడుతూ నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది . ఓవర్సీస్ లో మొదటి రోజున భారీ ఓపెనింగ్స్ సాధించి కేవలం వీకెండ్ లోనే 1 మిలియన్ డాలర్ల ని దాటేసి 2 మిలియన్ క్లబ్ వైపు దూసుకుపోతోంది . ఇక ఓవర్సీస్ లో అ .......ఆ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి .ప్రీమియర్ అండ్ గురు వారం రోజున - $ 495 , 611శుక్రవారం - $ 362 , 561శనివారం - $ 533 , 535 ఆదివారం - $ 329kఓవరాల్ గా - $ 1. 72 మిలియన్ డాలర్లు.

ఫస్ట్ వీక్ 5 కోట్లు రాబట్టిన రాయుడు

గతనెల 27న రిలీజ్ అయిన విశాల్ రాయుడు మొదటి వారంలో 5 కోట్ల వసూళ్ళ ని రాబట్టి సంచలనం సృష్టించింది . దాంతో నిన్న సాయంత్రం రాయుడు చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు . ఈ సక్సెస్ మీట్ లో హీరో విశాల్ తో పాటు హీరోయిన్ శ్రీ దివ్య , నిర్మాత హరి పాల్గొన్నారు . తమిళంలో ఘనవిజయం సాధిస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని , రిలీజ్ రోజున ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రం చూశానని , వాళ్ళ స్పందన చూసాక తప్పకుండా తెలుగులో సినిమా చేయాలనీ అనిపించిందని అలాగే ఒక సినిమా ఎలా ఉందో , దాని రిజల్ట్ ఏంటో తెలియాలంటే ప్రివ్యూ వేసుకొని చూడటం కాదని ,ప్రేక్షకులతో కలిసి చూస్తేనే తెలుస్తుందని అన్నాడు . ప్రేక్షకులతో కలిసి సినిమా చూడలేక పోయానని మా అమ్మ బాధపడిందని , తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావురా ఇడియట్ అంటూ నా మొఖం మీదే తలుపులు వేసిందని అందుకే త్వరలోనే పందెం కోడి సీక్వెల్ చేస్తానని తెలిపాడు విశాల్ . ఇక నిర్మాత హరి మాట్లాడుతూ '' మొత్తం 500ల థియేటర్ లలో సినిమా రిలీజ్ చేసాం , మొదటి వారమే 5 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది . ఇప్పటికి కూడా మంచి కలెక్షన్ల తో 200 ల థియేటర్ లలో రన్ అవుతోందని సంతోషాన్ని వ్యక్తం చేసాడు . 

అ .... ఆ మొదటి రోజు వసూళ్లు

త్రివిక్రమ్ బ్రాండ్ ఉండటం వల్ల మొదటి రోజునే ''అ .... ఆ '' చిత్రం భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది . నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా ''అ ..... ఆ '' నిలిచింది . ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక కోటి అరవై తొమ్మిది లక్షలను వసూల్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్ష్ ట్వీట్ చేసాడు . మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్ కలిపి 6 కోట్ల కు పైగా వసూళ్ళ ని సాధించి ఔరా ! అనిపించింది ఈ ''అ ... ఆ ''. ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి నైజాం -  2. 30 కోట్లు సీడెడ్ - 75 లక్షలు కృష్ణా - 40 లక్షలు గుంటూరు - 47 లక్షలు ఈస్ట్ -   56 లక్షలు వెస్ట్ -  50 లక్షలు నెల్లూరు - 20 లక్షలు 

అల్లు అర్జున్ సరైనోడు టోటల్ ఫైనల్ కలెక్షన్స్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన సరైనోడు చిత్రం గత నెల ఏప్రిల్ 22న విడుదలై మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపి వదిలిపెట్టింది. దీంతో మరో సారి స్టైలిష్ స్టార్ సత్తా ఏంటనేది తెలిసిపోయింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ మాస్ యాంగిల్ యాక్షన్ హైలెట్ గా నిలిచింది. దీనికి తోడు బోయపాటి పండించిన యాక్షన్ సీన్స్ మరో హైలెట్ అని చెప్పవచ్చు. దీంతో ఓవరాల్ గా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సరైనోడు చిత్రం విడుదలై ఇప్పటికి 40 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు సరైనోడు బిజినెస్ క్లోజ్ అయినట్లే. ఈ 40 రోజుల్లో సరైనోడు సాధించిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.n nనైజంలో                   -   19. 00 కోట్లు nసీడెడ్ లో                 -   11. 00 కోట్లు nవైజాగ్ లో                -  8. 00 కోట్లు nఈస్ట్ లో                   -  5. 15 కోట్లు nవెస్ట్ లో                    -  4. 40 కోట్లు nకృష్ణా లో                  -   4. 05 కోట్లు nగుంటూరు లో           -   5. 30 కోట్లు nనెల్లూర్ లో               -   2. 29 కోట్లు nరెస్ట్ ఆఫ్ ఇండియా   -    1.60 కోట్లుnకర్ణాటక                   -  8.00 కోట్లు nఓవర్సీస్                 -  5.25 కోట్లు  nతెలుగు మరియు nహిందీ శాటిలైట్ రైట్స్ - 16.00 కోట్లు  n nమొత్తం                  -  90.00 కోట్లు

వంద కోట్ల క్లబ్ లో చేరిన సూర్య 24

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ''24'' చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది . ఈనెల 6న రిలీజ్ అయిన 24 చిత్రం ఓవర్సీస్ లోనూ , అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ బాగానే వసూల్ చేసింది ,అలాగే తమిళంలో కూడా మంచి వసూళ్లు సాధించినప్పటికీ తమిళం తో ఈక్వేల్ గా తెలుగులో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తోంది .తెలుగులో ఏకంగా 34 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది 24 చిత్రం . ఓవరాల్ గా తెలుగు , తమిళ భాషల్లోనే కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలిపి మొత్తం వంద కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది సూర్య 24 చిత్రం . 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్ళ తో 60 కోట్లకు పైగా షేర్ వసూళ్ళ తో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ .......... మరో పదిహేను కోట్ల వసూళ్లు సాధిస్తే లాభాల బాటలోకి వస్తాడు సూర్య .

20కోట్ల షేర్ ని రాబట్టిన సుప్రీమ్

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ''సుప్రీమ్ ''. ఈనెల 5న భారీ ఎత్తున రిలీజ్ అయిన సుప్రీమ్ చిత్రం ఓవరాల్ గా 20 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది .ఫస్టాఫ్ బాగున్నప్పటికీ ,సెకండాఫ్ అనుకున్నంతగా లేకపోవడంతో సినిమా పోయినట్లే అని అనుకున్నారు కానీ సుప్రీమ్ తర్వాత వచ్చిన చిత్రాలు కానీ అంతకుముందు వచ్చిన చిత్రాలు కానీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని సాధించకపోవడంతో సుప్రీమ్ కు కలిసొచ్చింది . పైగా ఫస్టాఫ్ హిలేరియస్ గా ఉండటంతో వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి సుప్రీమ్ ని ఆశ్రయిస్తున్నారు .సాయి ధరం తేజ్ - రాశి ఖన్నా జంటగా వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు మరింత జాగ్రత్తగా ప్రచారం చేయడంతో 20 కోట్ల షేర్ ని అందుకొని హిట్ జాబితాలో చేరింది సుప్రీమ్.

మహేష్ బ్రహ్మోత్సవం మూడు రోజుల కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ఈ నెల మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓవరాల్ గా బాగున్నప్పటికీ కథ కథనం వల్ల ప్రేక్షకులకు విసుగొచ్చేసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాని సూపర్ స్టార్ మహేష్ నటన మాత్రం ఈ చిత్రంలో ఓ రేంజ్ లో ఉండనే చెప్పాలి. బంధాలు అనుబంధాల నేపధ్యంలో సాగిన ఈ చిత్రంలో చెప్పాల్సింది దర్శకుడు చెప్పలేకపోయాడు. దీంతో సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మహేష్ తన సత్తా చాటుతున్నాడు. బ్రహ్మోత్సవం తో మహేష్ సాధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. నైజంలో - 8. 8 కోట్లు సీడెడ్ లో - 2. 9 కోట్లు ఈస్ట్ లో - 2. 2 కోట్లు వెస్ట్ లో - 2. 4 కోట్లు కృష్ణా లో - 1. 3 కోట్లు గుంటూరు లో - 2. 5 కోట్లు నెల్లూర్ లో - 0. 73 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 1.6 కోట్లుకర్ణాటక - 3.5 కోట్లు ఓవర్సీస్ - 5.5 కోట్లు మొత్తం - 33.3 కోట్ల షేర్ వసూళ్లు

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్లు

అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ''సరైనోడు '' చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ కున్న క్రేజ్ ,బోయపాటి కాంబినేషన్ కావడంతో మొదటి రోజు వసూళ్లు బాగానే ఉన్నాయి ,అయితే సరైనోడు చిత్రానికి  రిలీజ్  కు ముందు వచ్చిన టాక్ కు ఈ వసూళ్ళ కు చాలా వ్యత్యాసం ఉంది . ఒకవేళ టాక్ బాగుంటే మరిన్ని కోట్లు కలెక్ట్ చేసేది . ఇక ఏరియాల వారీగా సరైనోడు వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా ! నైజాం - 2. 40 కోట్లు  సీడెడ్ - 1. 95 కోట్లు  కృష్ణా -    0.56 కోట్లు  గుంటూరు - 1.37 కోట్లు  ఈస్ట్ - 1.02 కోట్లు  వెస్ట్ - 1. 03 కోట్లు  వైజాగ్ - 0.74 కోట్లు  నెల్లూరు -0.52 కోట్లు  తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 9.59 కోట్లు

శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా టోటల్ కలెక్షన్స్

యంగ్ హీరో శర్వానంద్  'ఎక్స్ ప్రెస్ రాజా' అంటూ సంక్రాంతి కానుకగా వచ్చి హైట్రిక్ హిట్ కొట్టాడు. మేర్ల పాక దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత అత్యధిక లాభాలను గడించిన సినిమాగా నిలిచింది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రంతో శర్వానంద్ కు మార్కెట్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన యంగ్ బ్యూటీ సురభి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం టోటల్ గా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. నైజంలో-4. 25 కోట్లు  సీడెడ్ లో -   1. 35 కోట్లు  వైజాగ్ లో -  1. 35 కోట్లు  ఈస్ట్ లో -  1. 00 కోట్లు  వెస్ట్ లో -  0. 75 కోట్లు  కృష్ణా లో -   0. 87 కోట్లు  గుంటూరు లో -   1. 23 కోట్లు  నెల్లూర్ లో -   0. 37 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా -    0.10 కోట్లు కర్ణాటక -  0.60 కోట్లు  ఓవర్సీస్ -  1.43 కోట్లుమొత్తం -13.30 కోట్లు 

స్పీడున్నోడు ఫైనల్ టోటల్ కలెక్షన్స్

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు కాని ఇటీవలే తమిళ సినిమా సుందర పాండ్యన్ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెలుగులో స్పీడున్నోడు గా రీమేక్ చేసి భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే 2016 లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. స్పీడున్నోడు దెబ్బకు బయ్యర్స్ పది కోట్ల మేరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఓవర్ సిస్ డిస్ట్రి బ్యూటర్ కు ఐతే కనీసం కలెక్షన్స్ లో కలుపుకోలేని రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా ఏ రేంజ్ ప్లాపో అర్ధమవుతోంది. స్పెడున్నోడు టోటల్ గా సాధిందిచిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. నైజంలో                   -   2. 22 కోట్లు  సీడెడ్ లో                 -   1. 11 కోట్లు  వైజాగ్ లో                -  0. 90 కోట్లు  ఈస్ట్ లో                   -  0. 53 కోట్లు  వెస్ట్ లో                    -  0. 35 కోట్లు  కృష్ణా లో                  -   0. 33 కోట్లు  గుంటూరు లో           -   0. 77 కోట్లు  నెల్లూర్ లో               -   0. 25 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా   -    0.15 కోట్లు కర్ణాటక                   -  0.65 కోట్లు  ఓవర్సీస్                 -  0.00 కోట్లు      మొత్తం                  -  7.24 కోట్లు

రామ్ నేను...శైలజ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మలయాళ భామ కీర్తి సురేష్ జంటగా నటించిన నేను...శైలజ చిత్రం న్యూ ఇయర్ కానుకగా విడుదలై రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా రామ్ సేటిల్డ్ పెర్ఫామెన్స్ కీర్తి సురేష్ స్క్రీన్ ప్రేసేన్స్ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఇక దర్శకుడు కిశోరే తిరుమలకు ఇది మొదటి సినిమానే అయినప్పటి ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా అన్ని యాంగిల్స్ లో సినిమాని చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న రామ్ కెరియర్ ని నేను శైలజ గాడిలో పెట్టింది. అయితే మొత్తానికి ఈ చిత్రం బిజినెస్ ముగిసింది. ఈ చిత్రం ఫైనల్ గా కలెక్ట్ చేసిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.నైజంలో-7.05 కోట్లు సీడెడ్ లో-2.40 కోట్లు  వైజాగ్ లో-1.92 కోట్లు  ఈస్ట్ లో-1.26 కోట్లు  వెస్ట్ లో -0.85 కోట్లు  కృష్ణా లో -1.21 కోట్లు  గుంటూరు లో -1.42 కోట్లు  నెల్లూర్ లో -0.50 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా-0.50 కోట్లు కర్ణాటక-1.58 కోట్లు  ఓవర్సీస్-2.36 కోట్లు    మొత్తం=21.06 కోట్లు

స్పీడున్నోడు మూడు రోజుల కలెక్షన్స్

తమిళ సినిమా సుందర పాండ్యన్ ను తెలుగులో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేశాడు. శ్రీనివాస్ తోలి చిత్రం అల్లుడు శీను కు వినాయక్ బ్రాండ్ ఉండడంతో ఆ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. అయితే ఇప్పుడీ స్పీడున్నోడు చిత్రం ఆ బ్రాండ్ ఇమేజ్ ఏమి లేకుండా వచ్చి భారీ డిజాస్టర్ గా నిలవబోతోంది. 17 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసిన స్పీడున్నోడు ఫుల్ రన్ లో కూడా పట్టుమని పదికోట్లు కూడా దాటే పరిస్థితి కనబడట్లేదు. స్పీడున్నోడు వసూల్ చేసిన మూడు రోజుల కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.   నైజంలో - 1. 45 కోట్లు సీడెడ్ లో - 0. 80 కోట్లు వైజాగ్ లో - 0. 63 కోట్లు ఈస్ట్ లో - 0. 36 కోట్లు వెస్ట్ లో - 0. 23 కోట్లు కృష్ణా లో - 0. 26 కోట్లు గుంటూరు లో - 0. 57 కోట్లు నెల్లూర్ లో - 0. 15 కోట్లు కర్ణాటక - 0.55 కోట్లు ఇతర ఏరియాలు - 0.15 కోట్లు మొత్తం - 5.15 కోట్లు

50 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయిన నాగ్

కింగ్ నాగార్జున తాజాగా నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై యునానిమాస్ హిట్ గా నిలిచింది. డెబ్యూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి మూడు వారాలు పూర్తయ్యేలోపు 33.56 కోట్ల వసూళ్ళను, మొత్తం వరల్డ్ వైడ్ గా 42 కోట్ల వసూళ్ళ ను రాబట్టింది. సోగ్గాడే తో ఇంకా వసూల్ చేస్తే మాత్రం అంతో ఇంతో 2 నుండి 3 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే మొత్తం కలిపి వరల్డ్ వైడ్ గా సోగ్గాడే 45 కోట్ల బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రేంజ్ హిట్ అందుకున్న నాగ్ మాత్రం 50 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయాడు. సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు పోటి పడటం వల్లే నాగ్ 50 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో  55.9 కోట్లు, బాలయ్య డిక్టేటర్ 20 కోట్లు, శర్వానంద్ 12 కోట్లు వసూల్ చేశారు కాని పెట్టిన పెట్టుబడికి ఎవరు డబుల్ వసూళ్ళ ను రాబట్టలేదు. కాని పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్ళ ని మాత్రం నాగ్ రాబ్బట్టాడు. ఓల్డ్ హీరోల్లో  నాగార్జున సంక్రాంతి లాంటి హెవీ కాంపిటేషన్ లో యంగ్ హీరోలతో పోటి పడి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సత్తా చాటాడు.  

నైజాంలో ఎన్టీఆర్ ను దాటేస్తున్న నాగార్జున

ఈ ఏడాది సంక్రాంతి బరి లో ఎన్నడు లేని విధంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో  యంగ్  టైగర్ ఎన్టీఆర్ నటించిన క్లాస్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో' మరొకటి అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు హిట్ గా నిలిచాయి. కాని నాగ్ తరం హీరోల కాలం పోయి యువ హీరోలు ఇండస్ట్రీ ని ఏలుతున్న తరుణంలో నాగార్జున నాలుగు సినిమాలతో పోటికి దిగి సోగ్గాడే చిత్రంతో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని నలబై కోట్ల మార్క్ ను క్రాస్ చేసేశాడు.తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నైజంలో  సోగ్గాడే చిత్రంతో గట్టి పోటినే  ఇస్తున్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం రెండు వారాల్లో 10.22 కోట్లు వసూల్ చేయగా, సోగ్గాడే చిన్ని నాయనా తో నాగ్  రెండు వారాల్లో 10 కోట్ల వసూళ్లు రాబట్టాడు. ఇక మూడో వారం పూర్తయ్యేసరికి నాన్నకు ప్రేమతో కలెక్షన్స్ బ్రేక్ చేయడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అ సోగ్గాడే చిత్రంతో నాగ్ వరల్డ్ వైడ్ గా అన్ని రైట్స్ కలుపుకొని ఇప్పటికే 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు.  సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో బయ్యర్లు అందరు మంచి లాభాలు రాబట్టుకుంటున్నారు.

డిక్టేటర్ రెండు వారాల వసూళ్లు

బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సంక్రాంతి రేసులో దూసుకు వచ్చిన ఈ చిత్రం ప్రారంభంలో మంచి వసూళ్ళ నే సాధించినప్పటికీ ఆ తర్వాత క్రమేనా ఊపు తగ్గింది . మొత్తానికి మరీ నాసిరకంగా ఏమి లేదు కానీ దాదాపు 21 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఒడ్డున పడింది . ఇక బయ్యర్లు లాభాల్లోకి రావడం కష్టమే కానీ నష్టాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఏరియాల వారీగా డిక్టేటర్ వసూళ్లు ఇలా ఉన్నాయి .  నైజాం - 4. 05 కోట్లు  సీడెడ్ - 4. 34 కోట్లు  ఈస్ట్ - 1.90 కోట్లు  వెస్ట్  - 1.69 కోట్లు  గుంటూరు - 2.19 కోట్లు  కృష్ణా - 1.08 కోట్లు  వైజాగ్ - 2.42 కోట్లు  నెల్లూరు - 0.95కోట్లు  కర్ణాటక - 1. 70కోట్లు  ఓవర్సీస్ - 0. 40కోట్లు  మొత్తం - 20.72 కోట్లు 

సంచలనం సృష్టిస్తున్న సోగ్గాడే పది రోజుల కలెక్షన్స్

అక్కినేని నాగార్జున కళ్యాణ కృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. రెండో వారంలో 150 థియేటర్ల ని కలుపోకొని అడుగుపెట్టి కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. ఈ చిత్రంతో బయ్యర్లు భారీ లాభాలనే ముతగాట్టుకున్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా పది రోజుల కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.    నైజంలో              -   7. 70 కోట్లు  సీడెడ్ లో            -   4. 11 కోట్లు  వైజాగ్ లో           -  2. 12 కోట్లు  ఈస్ట్ లో             -  2. 78 కోట్లు  వెస్ట్ లో              -  1. 44 కోట్లు  కృష్ణా లో            -   1. 86 కోట్లు  గుంటూరు లో    -   2. 46 కోట్లు  నెల్లూర్ లో        -  1. 24 కోట్లు  కర్ణాటక              -   2.25 కోట్లు రెస్టాఫ్ ఇండియా  - 0.35 కోట్లు ఓవర్సీస్             - 3.46 కోట్లు మొత్తం కలిపి - 29.80కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది.

సోగ్గాడే చిన్ని నాయనా ఫస్ట్ వీక్ కలెక్షన్లు

నాగార్జున ద్విపాత్రాభినయం పోషించిన ''సోగ్గాడే చిన్ని నాయనా '' మొదటి వారంలోనే 22 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి నాగార్జున చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . సంక్రాంతి చిత్రాల్లో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న ఈ సోగ్గాడు మరిన్ని సంచలనాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది . ఇప్పటికే నైజాం తో పాటు మిగతా చోట్ల కూడా భారీ ఎత్తున థియేటర్లు పెంచారు నాగార్జున చిత్రానికి దాంతో ఈ వారం కూడా మంచి కలెక్షన్ల ని రాబట్టే చాన్స్ ఉంది . ఇక ఏరియాల వారీగా సోగ్గాడు లాగించిన షేర్లు ఇలా ఉన్నాయి .  నైజాం  - 5. 60 కోట్లు  సీడెడ్ - 3. 81కోట్లు  కృష్ణా - 1. 43 కోట్లు  గుంటూరు - 2 కోట్లు  ఈస్ట్ -  2. 37 కోట్లు  వెస్ట్ -  1. 10 కోటు  వైజాగ్ - 1. 38 కోట్లు  నెల్లూరు - 0. 98 కోట్లు  రెస్ట్ ఆఫే ఇండియా , ఓవర్సీస్  వెరసి 23 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది సోగ్గాడే చిన్ని నాయనా .

నాన్నకు ప్రేమతో ఫస్ట్ వీక్ కలెక్షన్లు

ఎన్టీఆర్ కు సంక్రాంతి బాగానే కలిసొచ్చింది ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ బాగానే కుమ్మేస్తున్నాడు . కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల లో మాత్రం దుమ్ము లేపుతోంది నాన్నకు ప్రేమతో . మొదటి వారం ముగిసేసరికి నాన్నకు ప్రేమతో ఓవర్సీస్ లో 11కోట్లకు పైగా వసూల్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 42కోట్ల షేర్ వసూల్ చేసి 60కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు ఎన్టీఆర్ . ఇక ఏరియాల వారీగా నాన్నకు ప్రేమతో సాధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి .  నైజాం - 8.90 కోట్లు  సీడెడ్ - 5.15కోట్లు  వైజాగ్ - 2.69 కోట్లు  ఈస్ట్ - 2.59కోట్లు  వెస్ట్ - 2.17 కోట్లు  కృష్ణా - 2 కోట్లు  గుంటూరు - 2.75 కోట్లు  నెల్లూరు - 1.18 కోట్లు  కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఇండియా - 4.70 కోట్లు  ఓవర్సీస్ - 11.71 కోట్లు  మొత్తం  42 కోట్ల షేర్.

సోగ్గాడే నాలుగు రోజుల వసూళ్లు

నాగార్జున ద్విపాత్రాభినయం పోషించిన సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతి రారాజుగా నిలిచింది . ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని చోట్లా మంచి కలెక్షన్లు వస్తున్నాయి . నాగార్జున సరసన రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాఠీ నటించగా కృష్ణకుమారి గా అనుష్క ,అలాగే హంసానందిని ,అనసూయ లు కూడా నటించారు . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి మంచి వసూళ్లు వస్తున్నాయి . నాలుగు రోజుల్లో 14 కోట్లకు పైగా షేర్ సాధించి ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది . ఇక ఏరియాల వారీగా సోగ్గాడే చిన్ని నాయనా సాధించిన వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా . nనైజాం - 3.08 కోట్లు nసీడెడ్ - 2.2 కోట్ల షేర్ nఉత్తరాంధ్ర - 74 లక్షల షేర్ nఈస్ట్ - 1.45 లక్షల షేర్ nవెస్ట్ - 71 లక్షల షేర్ nకృష్ణా - 81లక్షల షేర్ nగుంటూరు - 1.13 లక్షల షేర్ nనెల్లూరు - 41 లక్షల షేర్ nకర్ణాటక - 1.32 లక్షల షేర్ nరెస్ట్ ఆఫ్ ఇండియా - 20 లక్షల షేర్ nఓవర్సీస్ - 2.05 లక్షల షేర్ nమొత్తం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 14కోట్ల 10 లక్షల షేర్ వసూల్ చేసాడు నాగార్జున .

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో నాలుగు రోజుల కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. పూర్తి క్లాస్ చిత్రంగా వెళ్తున్న సినిమాలో అక్కడక్కడ మాస్ టచ్ ఇచ్చి దర్శకుడు సుకుమార్ తన సబ్జెక్ట్  థియరీ మిక్స్ చేసి ఔరా అనిపించాడు.మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంక్రాంతి సీజన్ లో కూడా చాలా థియేటర్స్ లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఓవర్సీస్ లో నంబర్ వన్ చిత్రంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో నాన్నకు ప్రేమతో నాలుగు రోజుల  కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి.నైజంలో        -   7. 22 కోట్లు సీడెడ్ లో      -   4. 46 కోట్లు వైజాగ్ లో      -  2. 18 కోట్లు ఈస్ట్ లో         -   2. 05 కోట్లు వెస్ట్ లో          -  1. 74 కోట్లు కృష్ణా లో        -   1. 62 కోట్లు గుంటూరు లో-   2. 38 కోట్లు నెల్లూర్ లో     -  0. 98 కోట్లుమొత్తం  -  22.6 కోట్లు

నాగ్ సోగ్గాడే ఫస్ట్ డే కలెక్షన్స్

కింగ్ నాగార్జున నూతన దర్స్ఘకుడు కళ్యాణ్ కృష్ణ తో చేసిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలై ప్రేక్షకులను వీపరితంగా అలరిస్తోంది. నాగ్ కేరియర్లోనే బిగ్గెస్ట్ వసూళ్ళ ని రాబట్టుతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లలో విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 3.9 కోట్ల షేర్ సాధించింది. మొదటి రోజు ఏరియా వైస్ గా  సోగ్గాడు సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో        -   1. 05 కోట్లు  సీడెడ్ లో      -   0. 85 కోట్లు  వైజాగ్ లో      -  0. 24 కోట్లు  ఈస్ట్ లో         -  0. 65 కోట్లు  వెస్ట్ లో          -  0. 27 కోట్లు  కృష్ణా లో        -   0. 27 కోట్లు  గుంటూరు లో-   0. 42 కోట్లు  నెల్లూర్ లో     -  0. 15 కోట్లు  మొత్తం కలిపి - 3.9 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో సాధించింది 

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఫస్ట్ డే కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. పూర్తి క్లాస్ చిత్రంగా వెళ్తున్న సినిమాలో అక్కడక్కడ మాస్ టచ్ ఇచ్చి దర్శకుడు సుకుమార్ తన సబ్జెక్ట్  థియరీ మిక్స్ చేసి ఔరా అనిపించాడు.మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంక్రాంతి సీజన్ లో కూడా చాలా థియేటర్స్ లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. బహుబాలి , శ్రీమంతుడు చిత్రాల తర్వాత  హై య్యేస్ట్  కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రంగా న్నన్నకు ప్రేమతో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో నాన్నకు ప్రేమతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి.నైజంలో        -   4. 17 కోట్లు సీడెడ్ లో      -   3. 01 కోట్లు వైజాగ్ లో      -  1. 17 కోట్లు ఈస్ట్ లో         -  1. 17 కోట్లు వెస్ట్ లో          -  0. 98 కోట్లు కృష్ణా లో        -   0. 84 కోట్లు గుంటూరు లో-   1. 53 కోట్లు నెల్లూర్ లో     -  0. 50 కోట్లు మొత్తం  -  13.46 కోట్లు

లోఫర్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ , పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' చిత్రం విడుదలై డివైడ్ టాక్ తో ఆడింది. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయిన కూడా మాస్ హీరోగా వరుణ్ తేజ్ కు మార్కులుబాగానే పడ్డాయి. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వసూళ్ళు చేసిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.నైజంలో        -   3. 55 కోట్లు సీడెడ్ లో      -   1. 80 కోట్లు వైజాగ్ లో      -  1. 25 కోట్లు ఈస్ట్ లో         -  0. 95 కోట్లు వెస్ట్ లో          -  0. 65 కోట్లు కృష్ణా లో        -   0. 78 కోట్లు గుంటూరు లో-   1. 05 కోట్లు నెల్లూర్ లో     -  0. 42 కోట్లు కర్ణాటక లో     -  0. 95 కోట్లు ROA లో       -  0. 20 కోట్లుమొత్తం వరల్డ్ వైడ్ షేర్స్  -  11. 60 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్  -  20 కోట్లు.

లోఫర్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ , పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' చిత్రం విడుదలై డివైడ్ టాక్ తో ఆడింది. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయిన కూడా మాస్ హీరోగా వరుణ్ తేజ్ కు మార్కులుబాగానే పడ్డాయి. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వసూళ్ళు చేసిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.నైజంలో        -   3. 55 కోట్లు సీడెడ్ లో      -   1. 80 కోట్లు వైజాగ్ లో      -  1. 25 కోట్లు ఈస్ట్ లో         -  0. 95 కోట్లు వెస్ట్ లో          -  0. 65 కోట్లు కృష్ణా లో        -   0. 78 కోట్లు గుంటూరు లో-   1. 05 కోట్లు నెల్లూర్ లో     -  0. 42 కోట్లు కర్ణాటక లో     -  0. 95 కోట్లు ROA లో       -  0. 20 కోట్లుమొత్తం వరల్డ్ వైడ్ షేర్స్  -  11. 60 కోట్లు మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్  -  20 కోట్లు.

శంఖరాభరణం ఫస్ట్ డే కలెక్షన్లు

నిఖిల్ ,నందిత జంటగా అంజలి కీలక పాత్రలో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎం వివి సత్యనారాయణ నిర్మించిన చిత్రం ''శంఖరాభరణం ''. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది . అయితే ఈ  చిత్రంపై మొదటి నుండి అంచనాలు ఉండటం వల్ల దానికి తోడూ నిఖిల్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఓపెనింగ్స్ ఫరవాలేదని పించాయి . అయితే రెండో రోజు కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి . ఇక మొదటి రోజు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి .  నైజాం - 50 లక్షలు  కృష్ణా - 11 లక్షలు  వైజాగ్ - 18 లక్షలు  గుంటూరు - 14 లక్షలు  సీడెడ్ - 26 లక్షలు  నెల్లూరు - మూడున్నర లక్షలు  తూర్పు గోదావరి - 12 లక్షలు  పశ్చిమ గోదావరి - 14 లక్షలు  రెస్ట్ ఆఫ్ ఇండియా ,ఓవర్సీస్ కలుపుకొని 20 లక్షలు 

3 రోజుల్లో 25 కోట్లు వసూల్ చేసిన 'రుద్రమదేవి'

అనుష్క , గుణశేఖర్ కాంబినేషన్ లో రూపోందిన 'రుద్రమదేవి ' బక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగోడుతుంది..గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ  తెలుగు వర్షన్ మూడురోజుల్లో 25 కోట్లకు పైగా  షేర్ సాధించింది.రికార్డ్ షేర్ రాబట్టిన చిత్రంగా 'రుద్రమదేవి' టాప్ 3 లో నిలిచింది..అన్ని ఏరియాల కలెక్షన్స్ ఇలా వున్నాయి.. నైజాం:8.10 సీడెడ్ :3.44 ఆంధ్రా:8.08 వైజాగ్ :1.86 ఈస్ట్:1.55 వెస్ట్ :1.08 కృష్ణా:1.07 గుంటూరు:1.73 నెల్లూరుఫ0.82 టోటల్ ఎపి ,నైజాం షేర్ :19.62 కాగా  ఓవర్సీస్ :3.62,రెస్ట్ ఆఫ్ ఇండియా:1.81..అన్ని ఏరియాలు కలుపుకొని 3 రోజుల్లో 25 కోట్ల 5 లక్షల షేర్ సాధించింది.

రుద్రమదేవి ఫస్ట్ డే కలెక్షన్లు

రుద్రమదేవి భారీ వసూళ్ళ ని సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది . నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన రుద్రమదేవి కలెక్షన్లు ఇలా ఉన్నాయి . నైజాం లో 3కోట్ల 50లక్షల షేర్ ,సీడెడ్ లో 1కోటి 55లక్షల షేర్ ,ఉత్తరాంధ్ర లో 67లక్షల షేర్ ,తూర్పు గోదావరి లో 81లక్షల షేర్ ,పశ్చిమ గోదావరి లో 66లక్షల షేర్ ,కృష్ణా లో 47లక్షల 33వేల షేర్ ,గుంటూరు లో 1కోటి 4లక్షల షేర్ ,నెల్లూరు లో 16లక్షల 96వేల షేర్ . టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 9కోట్ల 17లక్షల షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది రుద్రమదేవి . ఇక అమెరికాలో కూడా 80లక్షలకు పైగా వసూల్ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది . ఇదే జోష్ తో వెళితే మొదటి వారంలో 35కోట్ల షేర్ సాధించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

ఫస్ట్ డే 20కోట్లు వసూల్ చేసింది

నిన్న రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం ''సింగ్ ఈజ్ బ్లింగ్ '' 20కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించింది . ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అక్షయ్ కుమార్ కాగా అమీ జాక్సన్ ,లారా దత్త ,కేకే మీనన్ లు నటించిన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల 67లక్షలను వసూల్ చేసింది . అక్షయ్ కుమార్ చిత్రాల్లోతొలిరోజు  అత్యధిక  వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రౌడీ రాథోడ్ లాంటి హిట్ తర్వాత అక్షయ్ కుమార్ - ప్రభుదేవా ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఈ సింగ్ ఈజ్ బ్లింగ్.

27కోట్ల షేర్ వసూల్ చేసిన నాని

హీరో నానిఐ జీవితాంతం గుర్తుండిపోయే సాలిడ్ హిట్ లభించింది 'భలే భలే మగాడివోయ్ '' చిత్రంతో . సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన నాని చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్లని కొల్లగొడుతూ టాప్ హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది . మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 తో కలిసి యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది . నాని సరసన లావణ్య త్రిపాఠీ నటించింది . ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్ళ ని సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది . 47కోట్ల గ్రాస్ వసూళ్ళ ని 27కోట్ల షేర్ ని సాధించి నాని రేంజ్ని పెంచేసింది .

25రోజుల్లో 46కోట్లను కుమ్మేసిన నాని

చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ''భలే భలే మగాడివోయ్ ''. నానికి  వరుస ఫ్లాప్ ల తర్వాత వచ్చిన ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు . ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్ళ ని సాధించి ఆల్టైం టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందంటే ఎంత పెద్ద విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు . ప్రపంచ వ్యాప్తంగా భలే భలే మగాడివోయ్ చిత్రం 46కోట్లకు పైగా వసూల్ చేసింది అది కూడా కేవలం 25రోజుల్లోనే . అగ్ర హీరోల చిత్రాల్లా ఈ భారీ వసూళ్ళ ని సాధించడంతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి . 

బాక్స్ ఆఫీసును అదరగొడుతున్న సుబ్బు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం భారి కలక్షన్స్ సాదిస్తు దూసుకుపోతుంది. గ్లామర్ భామ రెజినా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఈ నెల 24 న భారి గా విడుదలైంది. అంతే కాదు భారి ఓపెనింగ్స్ కూడా దక్కించుకోవడం విశేషం. సో ఈ మెగా హీరో ఇప్పుడు బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తున్నాడు. మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 3 రోజుల కలక్షన్స్ ఇలా ఉన్నాయి ...షేర్ లలో ...   నైజాం -   3.50 కోట్లు, సీడెడ్ -  1.50 కోట్లు, నెల్లూరు -  0.32 కోట్లు, కృష్ణ -  0.51 కోట్లు, గుంటూరు -  0.75 కోట్లు, వైజాగ్ -  0.69 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ -  1. 28n కోట్లు, మొత్తంగా ఆంధ్రా , తెలంగాణా లో కలిపి -  8.51 కోట్లు వసూలు చేసాడు.

వందకోట్లు కొల్లగొట్టిన వివాదాస్పద చిత్రం

వివాదాస్పద చిత్రం ''ఎం ఎస్ జి 2 మెసేంజర్ ఆఫ్ గాడ్ '' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది . జాతీయ స్థాయిలో పలు వివాదాలను రాజేసిన ఈ చిత్రం కొన్ని రాష్ట్రాల్లో నిషేధానికి కూడా గురయ్యింది . ఈనెల 18న రిలీజ్ అయిన ఈ చిత్రానికి విమర్శకుల నుండి చీత్కారాలే లభించాయి కానీ ప్రేక్క్షకులు మాత్రం కలెక్షన్ల ని కట్టబెట్టారు ఏకంగా వంద కోట్లని . గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లను చూసి ట్రేడ్ విశేషకులు ఆశ్చర్య పోతున్నారు .

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2రోజుల కలెక్షన్లు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి వసూళ్ళ నే సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు . గురువారం రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదటి రోజు 3.6 కోట్లు  వసూల్ చేయగా రెండో రోజు 2. 7కోట్ల షేర్ తో సంచలనం సృష్టించాడు మెగా మేనల్లుడు . మొత్తం రెండు రోజుల్లో 8కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది . హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏరియాల వారీగా వచ్చిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి . నైజాం - 2. 4కోట్లు  గుంటూరు - 62లక్షలు  కృష్ణా - 39లక్షలు  సీడెడ్ - 1.08కోట్లు  ఉత్తరాంధ్ర - 55లక్షలు  తూర్పు గోదావరి -62లక్షలు  పశ్చిమ గోదావరి -39లక్షలు  నెల్లూరు - 25లక్షల షేర్ . ఇవి కాక ఇంకా ఓవర్సీస్ ,కర్ణాటక కలిపి 7కోట్ల పైనే షేర్ రావడంతో యూనిట్ సంతోషంగా ఉన్నారు .

నాని సినిమా 2వారాల కలెక్షన్లు

నాని - లావణ్య త్రిపాఠీ జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన ''భలే భలే మగాడివోయ్ '' చిత్రం రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా  37కోట్ల గ్రాస్ వసూళ్ళ ని, 21కోట్ల షేర్ ని  సాధించి సంచలనం సృష్టిస్తోంది . ఏరియాల వారీగా గ్రాస్ వసూళ్లు  ఇలా ఉన్నాయి .  నైజాం - 9కోట్ల 65లక్షల గ్రాస్  సీడెడ్ - 2కోట్ల 4లక్షల గ్రాస్  ఆంధ్రా - 9కోట్ల 75లక్షల గ్రాస్  కర్ణాటక - 5కోట్ల 23లక్షల గ్రాస్  అమెరికా - 8కోట్ల 42లక్షల గ్రాస్  రెస్ట్ ఆఫ్ ఇండియా - 1కోటి 70లక్షల గ్రాస్ వసూళ్ళ తో సంచలనం సృష్టించాడు నాని.

భారీ వసూళ్ళ ని సాధిస్తున్న నాని

మొదటి నుండి భలే భలే మగాడివోయ్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడటంతో వసూళ్ళకు ఎదురు లేకుండా పోయింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్ళ ని సాధించి ఔరా ! అనిపిస్తున్నాడు నాని . ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 32కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిన భలే భలే చిత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతలను సంతోషంలో ముంచెత్తాడు . నాని సహజ నటన ,మారుతి డైరెక్షన్ వెరసి భలే భలే మగాడివోయ్ ని సూపర్ హిట్ చేసాయి . పదికోట్ల షేర్ వస్తుందేమో అని ఆశించిన వాళ్ళకు దిమ్మ తిరిగేలా ఏకంగా 20కోట్ల పైనే షేర్ వచ్చేలా భలే మ్యాజిక్ చేసింది ఈ భలే భలే మగాడివోయ్ చిత్రం .

ఓవర్సీస్ లో10మిలియన్ డాలర్లని క్రాస్ చేసిన బాహుబలి

విజువల్ వండర్ అయిన బాహుబలి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా సంచలన విజయం సాధించి కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది . ఇక ఓవర్సీస్ లో నైతే ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది బాహుబలి . అక్కడ ఏకంగా 10మిలియన్ డాలర్ల ని క్రాస్ చేసి సరికొత్త సంచలనాన్ని సృష్టించి బాక్సాఫీస్ కి కిక్ ఇచ్చింది . తెలుగు సినిమా ఓవర్సీస్ లో 2, 3 మిలియన్ డాలర్ల ని వసూల్ చేయడమే గగనం అవుతున్న సమయంలో ఏకంగా 10మిలియన్ డాలర్లని వసూల్ చేసి కళ్ళు బైర్లు కమ్మెలా చేసింది . దాంతో బాగా లాభాలు వచ్చాయని భావించిన బ్లూ స్కై సినిమా సంస్థ బాహుబలి చిత్ర బృందానికి 4కోట్ల రూపాయలను అదనంగా చెల్లించారట . ఈ సినిమాని కొన్నది 9కోట్లకు కానీ భారీ ఎత్తున లాభాలు రావడంతో ఈ మొత్తాన్ని ఇవ్వాలని అనుకున్నారట.

భలే భలే మగాడివోయ్ ఫస్ట్ డే కలెక్షన్స్

నాని , లావణ్య త్రిపాటి లు ప్రధాన పాత్రల్లో మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంఫై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తోలి రోజు ఏరియ వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.నైజం – 74 లక్షలుసీడెడ్ – 19 లక్షలుతూర్పు గోదావరి – 17 లక్షలుపశ్చిమ గోదావరి – 12.5 లక్షలునెల్లూర్ – 5 లక్షలుకృష్ణ – 11 లక్షలుగుంటూరు – 18 లక్షలుఉత్తరాంద్ర – 18.5 లక్షలుమొత్తం వరల్డ్ వైడ్ గా 3.15 కోట్లు ‘భలే భలే మగాడివోయ్’ సాధించింది

విశాల్ ‘జయసూర్య’ ఫస్ట్ డే కలెక్షన్స్

విశాల్ హీరోగా సుసింద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా “పయ్యం పులి’ ని తెలుగు లో ‘జయ సూర్య’ గా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కనిపించాడు. విశాల్ కు తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తమిళంలో మంచి జోష్ తో దూసుకేల్తున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్ టాక్ తో  దూసుకేల్తోంది. తాజా సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 4 నుండి 5 కోట్లు వసూలు చేసింది. 

శ్రీమంతుడు 25 డేస్ కలెక్షన్స్ అదుర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది.ఇటివలే 25 డేస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్ దాదాపు 154 కోట్లుగా ఎరోస్ సంస్థ విడుదల చేసింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఏరియా వైజ్ గా ఈ కింది విధంగా ఉన్నాయి.నైజం - 21,05,59,099ఆంధ్ర - 26,42,49,667సీడెడ్ – 10,98,75,800కర్ణాటక – 9,80,25,750తమిళనాడు – 3,71,82,500కేరళ – 15,00,000నార్త్ ఇండియా – 3,63,26,457యూఎస్ఏ - 11,87,07,800ఇతర దేశాల్లో - 7,68,15,660వరల్డ్ వైడ్ గా 25 డేస్ టోటల్ షేర్ – 95,32,42,733శాటిలైట్ రైట్స్ (తెలుగు,తమిళం,మలయాళం, హిందీ) – 17,35,00,000ఇతరాలు - 50,00,000ఆడియో రైట్స్ – 75,00,000బిజినెస్ – 113,92,42,733మొత్తం – 154 కోట్లు.

150కోట్ల దిశగా శ్రీమంతుడు

శ్రీమంతుడు చిత్రం రిలీజ్ అయి నాలుగు వారాలు అవుతున్నప్పటికీ మహేష్ జోరు ఇంకా తగ్గలేదు . ఆగష్టు 7న రిలీజ్ అయిన శ్రీమంతుడు చిత్రం తెలుగు ,మలయాళ ,ఓవర్సీస్ లలో బాగానే కుమ్మేస్తోంది ఒక్క తమిళనాట తప్ప . ఇప్పటికి 135కోట్లకు పైగా వసూల్ చేసిన శ్రీమంతుడు చిత్రం 150కోట్ల దిశగా దూసుకుపోతోంది . మిగతా రోజుల్లో మామూలుగా ఉన్నప్పటికీ వీకెండ్ రోజుల్లో మాత్రం బాగానే కుమ్మేస్తోంది . మహేష్ స్టామినా కి తోడు శ్రీమంతుడు కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో శ్రీమంతుడు వసూళ్ళ ని కొల్లగోడుతున్నాడు. 

బాహుబలి తెలుగు వెర్షన్ 50 రోజుల కలక్షన్స్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి చిత్రం 50 రోజులు పూర్తీ చేసుకుంది. విడుదలైన అన్ని బాషలలో సంచలన విజయం సదిస్తూ .. వచ్చింది. కేవలం తెలుగు బాషలోనే దాదాపు 129 కేంద్రాల్లో ఈ సినిమా యాభై రోజులు పూర్తీ చేసుకోవడం విశేషం. రెండు .... మూడు వారాలతోనే సినిమాలు వెనక్కి వెళుతున్న ఈ రోజుల్లో బాహుబలి ఇలా 129 కేంద్రాల్లో యాభై రోజులు ఆడడం నిజంగా గొప్ప పరిణామమే. బలవంతంగా ఈ సినిమాను అడించకండి అని రాజమౌళి ఇచ్చిన పిలుపు మేరకు ఈ సినిమా యాభై రోజుల తరువాత కొన్ని కేంద్రాల్లో తీసివేస్తారు. ఏది ఏమైనా బాహుబలి సినిమా తెలుగు సినిమా క్యాతిని నిలబెట్టింది. మరి బాహుబలి  వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం ..  ( షేర్ లలో ) నైజాం - 41. 13 కోట్లు ,  సీడెడ్ - 21. 52 కోట్లు , గుంటూరు - 9. 70 కోట్లు , ఉత్తరాన్ద్రా - 9. 60 కోట్లు ,ఈస్ట్ - 8. 60 కోట్లు , వెస్ట్ - 6. 78 కోట్లు , కృష్ణా - 6. 70 కోట్లు , నెల్లూరు - 4. 08 కోట్లు , మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 108. 02 కోట్ల వసూళ్లు సాదించింది , ఇక కర్ణాటక లో 35 కోట్ల వసూలు తెలుగు వెర్షన్ కు దక్కింది. మొత్తానికి బాహుబలి అన్ని బాషలలో కలిపి దాదాపు 568 కోట్ల వసూళ్లను రాబట్టింది. త్వరలోనే చైనా లో కూడా విడుదల చేస్తున్నారు.

అమెరికాలో 19కోట్లను కొల్లగొట్టిన శ్రీమంతుడు

శ్రీమంతుడు చిత్రం తెలుగులోనే కాదు అమెరికాలో కూడా పుంగి బజాయిస్తోంది , మహేష్ ఓవర్సీస్ లో మొనగాడు అన్న సంగతి తెలిసిందే దాంతో మహేష్ అక్కడ కూడా రెచ్చిపోయాడు . మూడు వారాలు ముగిసేసరికి అమెరికాలో దాదాపు 19కోట్లను వసూల్ చేసాడు మహేష్ . మూడు వారాలు గడిచినప్పటికీ ఇంకా అక్కడ స్ట్రాంగ్ గానే రన్ అవుతోంది. మూడు వారాల్లో 2. 84మిలియన్ డాలర్లను వసూల్ చేసిన శ్రీమంతుడు నాలుగో వారంలో మూడు మిలియన్ డాలర్ల ను క్రాస్ చేసి సరికొత్త సంచలనం సృష్టించనుంది శ్రీమంతుడు . మహేష్ పెర్ఫార్మెన్స్ ,శృతి అందాలు ,కొరటాల దర్శకత్వ ప్రతిభ వెరసి శ్రీమంతుడు రికార్డుల మోత మోగిస్తున్నాడు . 

కిక్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్లు

కిక్ 2 ఘోరంగా దెబ్బ కొట్టింది నిర్మాత కళ్యాణ్ రామ్ ని , ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కిక్ 2 పై తనకు డబుల్ కిక్ ఇస్తుందని అనుకున్నాడు కానీ మొదటి వారం కలెక్షన్లు చూసి ఖంగుతిన్నాడు . వారం రోజుల్లో కిక్ 2 షేర్ కనీసం 17కోట్లు కూడా రాకపోవడం మరీ దారుణంగా ఉంది .బాక్సాఫీస్ వద్ద కిక్ 2 తేలిపోయింది . మూడు రోజుల్లో దాదాపు 16కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన ఈ చిత్రం మిగతా నాలుగు రోజుల్లో కేవలం 91లక్షలను మాత్రమే సాధించి చతికిలబడిపోయింది. ఇక మొదటి వారం షేర్ వివరాలు ఇలా ఉన్నాయి . తెలంగాణ 5కోట్ల 60లక్షల షేర్ ,సీడెడ్ 2కోట్ల 2లక్షల షేర్ ,ఈస్ట్ 1కోటి 36లక్షల షేర్ ,వెస్ట్ 91లక్షల షేర్ ,గుంటూరు 1కోటి 3లక్షల షేర్ కృష్ణా 93లక్షల షేర్ నెల్లూరు 46లక్షల షేర్ కర్ణాటక 2కోట్ల 1లక్ష షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా 40లక్షల షేర్ ఓవర్సీస్ 1కోటి 2లక్షల షేర్ మొత్తం 16కోట్ల 91లక్షల షేర్

శ్రీమంతుడు 17 రోజుల కలక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో ఇటీవలే విడుదలైన శ్రీమంతుడు చిత్రం సూపర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ లకు పండగ వాతావరణం నెలకొల్పింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. శృతి హసన్ హీరోయిన్ గా జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. శ్రీమంతుడు కలెక్షన్స్ షేర్ లలో .............. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి- 52. 14 కోట్లు, కర్ణాటక -6. 55 కోట్లు, తమిళనాడు - 1. 11 కోట్లు, రెస్త్ అఫ్ ఇండియా - 1. 03 కోట్లు, అమెరిక - 11. 99కోట్లు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కలుపుకొని - 2. 28 కోట్లు, తమిళ సినిమా ప్రపంచః వ్యాప్తంగా - 00. 98 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 75. 97 కోట్లు వసూలును సాదించింది. కేవలం 17 రోజుల్లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రికార్డును అధిగమించింది.

కిక్ 2 మూడు రోజుల కలెక్షన్లు

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ మహారాజ్ రవితేజ హీరో కావడం ,వీకెండ్ రోజులు కావడంతో మూడు రోజుల్లోనే కిక్ 2 పదహారు కోట్ల 36లక్షలను వసూల్ చేసి సంచలనం సృష్టించింది . రవితేజ సినిమాల్లో ఇది రికార్డు కాగా కిక్ 2 నష్టాల్లోంచి బయట పడాలంటే మరో 15కోట్లకు పైగా వసూళ్ళ ని సాధించాలి . మరి ఆ వసూళ్ళ ని సాధించి కళ్యాణ్ రామ్ ని గట్టెక్కిస్తుందా లేదా చూడాలి . మొత్తం 3రోజుల్లో కిక్ 2 సాధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి .  తెలంగాణ 5కోట్ల 5లక్షల షేర్  కృష్ణా 80లక్షల షేర్  సీడెడ్ 1కోటి 92లక్షల షేర్  ఈస్ట్ 1కోటి 10లక్షల షేర్  వెస్ట్ 94లక్షల షేర్  గుంటూరు 1కోటి 20లక్షల షేర్  ఉత్తరాంధ్ర ఒక కోటి షేర్  నెల్లూరు 40లక్షల షేర్  కర్ణాటక 2కోట్ల 5లక్షల షేర్  రెస్ట్ ఆఫ్ ఇండియా 40లక్షల షేర్  ఓవర్సీస్ 1కోటి 50లక్షల షేర్  మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 16కోట్ల 36లక్షల షేర్ ని వసూల్ చేసింది కిక్ 2 అది కూడా 3రోజుల్లో . 

శ్రీమంతుడు రెండు వారాల కలెక్షన్లు

శ్రీమంతుడు రెండు వారాలు దాటినప్పటికీ ఇంకా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు . రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 113కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళ తో 73కోట్ల షేర్ ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ,ఓవర్సీస్ లలో రెండు వారాల్లో 113కోట్ల 25లక్షల గ్రాస్ ని సాధించింది . అమెరికాలో 11కోట్ల 57లక్షలను వసూల్ చేసిన శ్రీమంతుడు కలెక్షన్లు ఏరియాల వారీగా షేర్ లు  ఇలా ఉన్నాయి .సినీ నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియాలో పెద్ద సినిమా నిర్మాణ సంస్థగా వరుస విజయాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ఈ సంస్థ నుండి వచ్చిన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయ్ జాన్ సూపర్ డూపర్ హిట్టై 300 కోట్ల నెట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ సి.వి. నిర్మాతలు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు చిత్రంలో భాగస్వామిగా అయింది.ఆగస్ట్ 7న విడుదలైన శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను సంపాదించుకుంది. భారీ ఓపెనింగ్స్ తో మొదటివారంలో 113.25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అత్యధిక గ్రాస్ ను కలెక్ట్ చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో 1000 థియేటర్స్ లో రిలీజ్ చేసింది. అంతే కాకుండా తమిళనాడు, కేరళలో కూడా ఈ చిత్రాన్నిఅత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా...ఈరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెకటర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘’సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మైత్రీ మూవీమేకర్స్ వారికి స్పెషల్ థాంక్స్. మంచి సపోర్ట్ లభించింది. తెలుగు ఇండస్ట్రీలో మేం కూడా పార్ట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. తెలంగాణ 18కోట్ల 60లక్షల షేర్  nసీడెడ్  7కోట్ల 94లక్షల షేర్  nఆంధ్రా 23కోట్ల 44లక్షల షేర్ nవైజాగ్ 4కోట్ల 58 లక్షల షేర్ nఈస్ట్ 4కోట్ల 87లక్షల షేర్ nవెస్ట్ 3కోట్ల 73లక్షల షేర్ nకృష్ణా 3కోట్ల 74లక్షల షేర్ nగుంటూరు 4కోట్ల 81లక్షల షేర్ nనెల్లూరు ఒక కోటి 71లక్షల షేర్ nతమిళనాడు 1కోటి షేర్ nకర్ణాటక 6కోట్ల 4లక్షల షేర్ nఅలాగే తమిళ వెర్షన్ , దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అన్ని ఏరియాలు కలుపుకొని 73కోట్ల షేర్ ని సాధించాడు శ్రీమంతుడు.

శ్రీమంతుడు కలెక్షన్ల వర్షం

మహేష్ శ్రీమంతుడు చిత్రం అన్ని చోట్లా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది . ఓవర్సీస్ లో 2మిలియన్ డాలర్ల  మార్క్ ని దాటిన శ్రీమంతుడు తెలుగు తమిళ భాషల్లో కూడా భారీ కలెక్షన్ల ని కొల్లగొడుతూ 50కోట్ల పై చిలుకు వసూళ్ళ ని రాబట్టింది . నైజాం లో 9కోట్ల 51లక్షలను , సీడెడ్ లో 4కోట్ల 45లక్షలను ,ఉత్తరాంధ్ర 1కోటి 92లక్షలు ,గుంటూరు 2కోట్ల 69లక్షలు , ఈస్ట్ గోదావరి 2కోట్ల 59లక్షలు ,వెస్ట్ 2కోట్ల 39లక్షలు ,కృష్ణా 1కోటి 92లక్షలు ,నెల్లూరు 86లక్షలు ,కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ,ఓవర్సీస్ అన్నీ కలుపుకొని 41కోట్ల 63లక్షల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించాడు మహేష్ . మొదటి మూడు రోజుల్లోనే 50కోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించాడు . 

శ్రీమంతుడి ఏరియాల వారీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయల షేర్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ....దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘ సినిమా యూనానిమస్ టాక్ తో పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుండి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. ఈ విజయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మరిచిపోయాను.చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా. ప్రేక్షకు నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నటీనటు, టెక్నిషియన్స్‌కి థాంక్స్‌. పైరసీని ఎంకరేజ్‌ చేయవద్దు. సినిమా యూనానిమస్‌ టాక్‌తో ముందుకెళుతుంది. మంచి కలెక్షన్స్‌ వస్తుంది. అన్నీ చోట్ల మంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి’’ అన్నారు.ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) తదితరులు పాల్గొన్నారు.‘శ్రీమంతుడు’ మొదటి రోజు షేర్స్‌(కోట్లలో)నైజాం - 5.60సీడెడ్‌ - 2.90కృష్ణా - 1.20గుంటూరు - 2.05న్లెూరు - 0.60ఈస్ట్‌ - 1.71వెస్ట్‌ - 1.90వైజాగ్‌ - 1.05కర్ణాటక - 2.02తమిళనాడు - 0.56నార్త్‌ ఇండియా - 0.92యు.ఎస్‌.ఎ - 8.55ఓవర్‌సీస్‌ - 1.08

14రోజుల్లో 495కోట్లను వసూల్ చేసిన బజరంగీ

కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 495కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించింది సల్మాన్ చిత్రం ''బజరంగీ భాయిజాన్ ''. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50దేశాల్లో 5వేల థియేటర్ లలో భారీ ఎత్తున రిలీజ్ అయిన బజరంగీ భాయిజాన్ సంచలన విజయం సాధిస్తూ భారీ వసూళ్ళని సాధిస్తోంది . కేవలం రెండు వారాల్లోనే 495కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో పీకే సరసన నిలిచేలా ఉంది . అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 730కోట్లను వసూల్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది కాగా సల్మాన్ చిత్రం రెండు వారాల్లోనే దాదాపు 5వందల కోట్ల క్లబ్ లో చేరడంతో లాంగ్ రన్ లో మరో రెండు వందల కోట్లను అవలీలగా సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు . 

నైజాం లో 32 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి

బాహుబలి అన్ని ఏరియా ల బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగ రాస్తుంది. ఇప్పటికే 370 కోట్ల వరకు వసూలు చేసిన ఈ సినిమా నైజాం లో రికార్డ్ కలక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా కేవలం రెండు వారాల్లో 32 కోట్లు వసూలు చేసి రికార్డ్ స్తుష్టించింది. అయితే ఇప్పటికి ఈ సినిమా కలక్షన్స్ స్టడీ గానే ఉన్నయాట ! కేవలం 12 రోజుల్లోనే 32 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఖచ్చితంగా మొత్తంగా 40 కోట్ల వసూలు సాదిస్తుందని అంటున్నారు. మరి వైపు బాలీవుడ్ , కోలీవుడ్ లలో ఈ సినిమా కలక్షన్స్ కూడా జోరుగా ఉన్నాయి.  

బాహుబలి 12 రోజుల కలక్షన్స్

అత్యంత భారిగా నిర్మాణం జరుపుకుని అన్ని భాషల్లో దుమ్ము లేపుతున్న చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ , రానా లు నటించిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ , మలయాళీ భాషల్లో దుమ్ము లేపుతుంది. త్వరలోనే చైనాలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ లో అత్యంత భారి వసూళ్ళ చిత్రంగా మొదటి స్తానం లో నించింది. ఖచ్చితంగా బాహుబలి టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రం గా నిలుస్తుంది. ఇప్పటికే 82 కోట్లను కేవలం తెలుగులో వసూలు చేసింది. బాహుబలి రెండు తెలుగు రాష్రాల్లో కలక్షన్స్ ఇలా ఉన్నాయి. కలక్షన్స్ షేర్ లలో .. నైజాం - 30.42 Cr, సీడెడ్ - 17.06 Cr, నెల్లూరు - 3.14 Cr, గుంటూరు - 7.39 Cr, కృష్ణ - 5.19 Cr, వెస్ట్ - 5.69 Cr, ఈస్ట్ - 6.46 Cr, ఉత్తరంద్రా - 6.90 Cr,  మొత్తంగా బాహుబలి 82.25 కోట్లను వసూలు చేసి దుమ్ము లేపుతుంది. 

బాహుబలి మొదటి వారం కలక్షన్స్

టాలీవుడ్ లో రుపోడిన అత్యంత భారి చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా భారి వసూళ్లు సాదిస్తు దూసుకు పోతుంది. ఇప్పటికే రికార్డు స్తాయి కలక్షన్స్ సాదించి ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచింది. మరి బాహుబలి తెలుగు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం బహుబలి మొదటి వారం కలక్షన్స్ షేర్ లలో   నైజాం -  22.54 Cr, సీడెడ్ -  12.07 Cr, నెల్లూరు - 2.25 Cr, గుంటూరు - 5.48 Cr, కృష్ణ -  3.65 Cr, వెస్ట్ - 4.54 Cr, ఈస్ట్ -  5.28 Cr,  వైజాగ్ - 5.53 Cr మొత్తంగా రెండు తెలూగు రాష్ట్రాల్లో కలిపి 61. 32 కోట్లు వసూలు చేసింది.  

బాలీవుడ్ లో కూడా కుమ్మేస్తున్న బాహుబలి

బాహుబలి చిత్రం బాలీవుడ్ లో కూడా కుమ్మేస్తోంది . బాహుబలి చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపథ్యంలో మొదటి రోజు 5కోట్లకు పైగా వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది . కరణ్ జోహార్ ముద్ర కూడా ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణం అయ్యింది . జక్కన్న పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది . ఓ ప్రాంతీయ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి క్రేజ్ ని సంపాదించడం నిజంగా మన అదృష్టం అని కొనియాడుతున్నారు . ఓ డబ్బింగ్ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం ఇదే ప్రధమం . విజువల్ వండర్ గా అందరి చేత ప్రశంసించబడుతున్న బాహుబలి మరిన్ని సంచలనాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది .

బాహుబలి రెండురోజుల కలక్షన్స్ అదిరిపోయాయి

ఇప్పుడు ఎక్కడ చుసిన బాహుబలి గురించే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి సినిమా మొదటి షో కు కాస్త బిన్నమైన టాక్స్ వినిపించినప్పటికీ ఈ సినిమా మాత్రం విజువల్ వండర్ అని అందరు అంటున్నారు. కథ ప్రకారం గా చుస్తే .. కాస్త వీక్ గా ఉన్న మేకింగ్ విషయం లో అద్బుతంగా ఉందని జనాలు జే జె లో పలుకుతున్నారు. బాహుబలి రెండో రోజు కుడా అదే సత్తా నిలుపుకుంది. రాజమౌళి తెరేకేక్కించిన బాహుబలి రెండు రోజుల కలక్షన్ ఇలా ఉన్నాయి. నైజాం - 10. 31 కోట్లు, సీడెడ్ - 6. 08 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ - 6. 53 కోట్లు, కృష్ణ - నెల్లూరు - 3. 52 కోట్లు, గుంటూరు - 3. 12 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు సృష్టించింది.

ఒక్క రోజులో 50 కోట్లు వసూలు చేసిన బాహుబలి

తెలుగులో అత్యంత భారి ప్రతిష్టాత్మకంగా రూపొంది ఇటివలే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో దుమ్ము రేపుతుంది. ముక్యంగా బాలీవుడ్ లో మాత్రం ఓ డబ్బింగ్ సినిమా ఈ స్తాయిలో వసూలు చేయడం సంచలనంగా మారింది? కేవలం హిందీ వెర్షన్ కు గాను 5. 17 కోట్లు వసూలు చేసింది. ఇక ఇతర భాషల్లో కలుపుకుని దాదాపు 50.12 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇండియాలో దాదాపు 3500 స్క్రీన్ లలో ఈ సినిమాను ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేసారు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 200 పైచిలుకు థియేటర్స్లో విడుదల అవ్వడం విశేషం. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనానికి బాలీవుడ్ షాక్ అవుతుంది ?  

పండగ చేస్కో కలక్షన్స్ ఇలా ఉన్నాయి

రామ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ , సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన పండగ చేస్కో చిత్రం అనుకున్న స్తాయిలో కలక్షన్స్ రాబట్టలేకపోయిందనే చెప్పాలి. యునైటెడ్ మూవీస్ పతాకం పై ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రెండు వారాల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ... నైజాం - 4. 21కోట్లు , సీడెడ్ -2. 21 కోట్లు ,  ఉత్తరాన్ద్రా - 1. 65 కోట్లు , గుంటూరు - 1. 08 కోట్లు , కృష్ణ - 0. 87 కోట్లు ,  ఈస్ట్ - వెస్ట్ - 1. 72 కోట్లు , నెల్లూరు - 0. 45 కోట్లు , మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12. 42 కోట్లు ,  వసూలు చేసింది. ఇక కర్ణాటక - 0. 92 కోట్లు , రెస్ట్ అఫ్ ఇండియా - 0. 25 కోట్లు , ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి - 14. 27 కోట్లు  వసూలు చేసింది.  

లారెన్స్ గంగ మూడు వారాల కలక్షన్స్

ముని కు సీక్వెల్ గా రూపొందిన కాంచన సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు ముని 3 గా రూపొందిన గంగ చిత్రం మే 1 న విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటికే దాదాపు 550 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 17 రోజులకు గాను 17 . 68 కోట్లు వసూలు చేసింది. ఓ చిన్న చిత్రం ఇలా వసూలు చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తుతోంది. ఇప్పటికే ఈ సినిమాను తీసుకున్న డిస్త్రిబ్యుటర్స్ కు లాభాలు వచ్చేసాయని అంటున్నారు. మరి ఈ మూడు వారాల్లో గంగ ఎలా బాక్స్ ఆఫీసు ను బయపెట్టిందో చుడండి..  నైజాం 5.55 (షేర్ లలో )  సీడెడ్ 3.40 కోట్లు ,  నెల్లూరు 0.71 కోట్లు,  కృష్ణా 1.23 కోట్లు , గుంటూరు 1.72 కోట్లు,   వైజాగ్ 2.10 కోట్లు ,  తూర్పు గోదావరి 1.50 కోట్లు ,  పశ్చిమ గోదావరి 1.39 కోట్లు మొత్తం ఎపి & తెలంగాణా లో కలిపి వచ్చిన  షేర్ 17.6 కోట్లు. ఇప్పటికే ఈ సినిమా కలక్షన్ స్టేడి గానే ఉన్నాయి. మరో వారం లో 25 కోట్లవరకు వసూలు చేయొచ్చని అంటున్నారు.  

లయన్ వసూల్ చేసింది ఎంతో తెలుసా

బాలయ్య లయన్ చిత్రం చాలా నీరసమైన వసూళ్లను సాధిస్తోంది . ఒక్క తెలుగులోనే కాకుండానే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన లయన్ ప్రారంభం నుండే చెప్పుకోదగిన వసూళ్ళ ను సాధించకపోవడంతో అటు అభిమానులతో పాటు ఇటు సినిమాని కొనుక్కున్న బయ్యర్లు కూడా నిరాశతో ఉన్నారు . మొత్తం నాలుగు రోజుల్లో కేవలం 11కోట్ల 20లక్షలను మాత్రమే వసూల్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . కామన్ గా సినిమా బాగుంటే ఇవి రెండు రోజుల్లోనే వచ్చే కలెక్షన్లు కానీ అలా రాకపోవడంతో నిర్మాతకు అలాగే బయ్యర్లకు పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది . నాలుగు రోజుల్లో కేవలం 11కోట్లను వసూల్ చేసి అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లింది లయన్.

తొలిరోజు ఐదున్నర కోట్లు కలెక్ట్ చేసిన లయన్

బాలకృష్ణ కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో నటించిన చిత్రం ''లయన్ ''. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మొత్తానికి తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ లలో తొలిరోజు ఐదున్నర కోట్లను వసూల్ చేసి ఔరా అనిపించింది . అయితే లెజెండ్ చిత్రంతో పోల్చితే ఇది తక్కువే కానీ లయన్ చిత్ర విశేషం ఏమిటంటే బాలయ్య కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ లయన్ చిత్రానికి ఏ సెంటర్స్ లోనూ అందునా మల్టీ ప్లెక్స్ లలో కూడా మంచి వసూళ్లు వచ్చాయి . అయితే బాలయ్య చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మరో చిత్రం బాలయ్య కు పోటీ లేకపోవడంతో మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

సన్నాఫ్ సత్యమూర్తి 11 రోజుల కలక్షన్స్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం మొదట మిక్సేడ్ టాక్ తో ప్రారంబం అయిన ఫామిలీ ఎంటర్ టైనర్ గా మంచి వసూల్ల్లను రాబట్టుకుంటుంది. ముక్యంగా సుమ్మర్ కావడం. వేసవి సెలవులు ఈ సినిమాకు బాగా కలసివచ్చాయి. అల్లు అర్జున్ సరసన సమంతా, ఆదా శర్మ , నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా 11 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా .. నైజాం - 11. 28 కోట్లు,  సీడెడ్ - 5. 13 కోట్లు, ఉత్తరాంద్రా 3. 11 కోట్లు, గుంటూరు - 2. 68 కోట్లు,  కృష్ణ 2. 11 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ -4. 38 కోట్లు, నెల్లూరు -1. 10 కోట్లు, ఆంధ్రా , తెలంగాణా లో కలిపి 11 రోజులకు గాను 31. 54 కోట్లు వసూలు చేసింది. ప్రప్రంచ వ్యాప్తంగా కలిపి దాదాపు 39. 72 కోట్లు వసూలు సాదించి ఇంకా మంచి కలక్షన్స్ తో రన్ అవుతుంది.

టాప్ 4 గ్రాసర్ గా సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి మిక్సేడ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా భారి ఓపెనింగ్ కలక్షన్స్ తో రన్ అవుతూ సంచలనం క్రియేట్ చేసింది. దాదాపు 1400 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్ కలక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. మొదటి రోజు రెండో బెస్ట్ షేర్ గా నైజం లో క్రేజీ కలక్షన్స్ వసూలు చేసింది . నైజాం లో 3. 12 కోట్ల వసూళ్లు రాబట్టింది. సీడెడ్ లో 1. 72 కోట్లు , వైజాగ్ లో 83 లక్షలు , ఈస్ట్ - వెస్ట్ కలిపి 1. 42 కోట్లు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9. 27 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఎపి , తెలంగాణా లో కలిపి మొదటి రోజు అత్యదిక వసూళ్లు సాదించిన లిస్టు లో 4 ప్లేస్ సొంతం చేసుకుంది. మొదటి స్తానం లో అత్తారింటికి దారేది 10. 74కోట్లు , ఆగడు - 9. 72కోట్లు , టెంపర్ - 9. 66 కోట్లు, సన్నాఫ్ సత్యమూర్తి - 9. 27 కోట్లు , బాద్షా - 9. 22 కోట్లు , గోపాలా గోపాలా - 9. 18 కోట్లు వసూలు సాదించాయి.

గోపీచంద్ జిల్ మొదటిరోజు కలక్షన్స్

గోపీచంద్ హీరోగా హాట్ భామ రాశి ఖన్నా హీరోయిన్ గా రాదా కృష్ణ కుమార్ దర్శకత్వం లో యువి క్రియేషన్స్ పతాకం పై నిన్న విడుదలైన జిల్ సినిమా మొదటి రోజు భారి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది. మిర్చి , రన్ రాజా రన్ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన బ్యానర్ కావడం తో ఈ సినిమాపై అంచనాలు కుడా భారీగానే ఉన్నాయి. దానికి తోడూ రాసి ఖన్నా అందాలూ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్టాల్లో కలిపి 1. 82 కోట్ల కలక్షన్ రాబట్టింది. యు ఎస్ ఎ లో 86,000 డాలర్స్ వసూలు చేసింది. గోపీచంద్ కెరీర్ లో అత్యదిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా నిలిచింది . మరిన్ని కలక్షన్స్ వివరాలు త్వరలో. 

మహేష్ మరో నెక్స్ట్ సినిమా

మహేష్ బాబు ఇప్పుడు జోరు పెంచాడు. ప్రసుతం శ్రీమంతుడు చిత్రం లో నటిస్తున్న మహేష్ ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో బ్రహ్మోస్తావం సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రారంబం కానుంది. ఇదిలా ఉండగా మహేష్ ని హీరోగా పరిచయం చేస్తూ రాజకుమారుడు చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సి అశ్వినిదత్ నిర్మించే సినిమాలో మహేష్ నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్సకత్వం వహిస్తాడు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ తరువాత ఈ చిత్రం ప్రారంబం కానుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో. 

టెంపర్ రెండు వారల కలక్షన్స్

ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన టెంపర్ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే కలక్షన్స్ పరంగా మంచి వసూళ్లు రాబట్టింది. ఎన్టిఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ సినిమా రెండు వారల కలక్షన్స్ ఇలా ఉన్నాయి.  నైజాం - 10. 72 కోట్లు, సీడెడ్ 5. 98 కోట్లు, వైజాగ్ - 3. 10 కోట్లు, గుంటూరు - కృష్ణ - 4. 43 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ - 3. 72 కోట్లు, నెల్లూరు - 1. 20 కోట్లు, కర్ణాటక - 4. 78 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా - 1. 42 కోట్లు, ఓవర్సీస్ - 5. 86 కోట్లు మొత్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ కలక్షన్స్ కలిపి మొత్తంగా 39. 76 కోట్లు 

టెంపర్ 10 రోజుల కలక్షన్స్

ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన టెంపర్ సినిమా మంచి హిట్ ని అందించింది. గత కొన్ని రోజులుగా సరైన హిట్ కోసం వేచి ఉన్న ఎన్టిఆర్ కు ఈ హిట్ మంచి ఉత్సాహాన్ని అందించింది. టెంపర్ విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్ తెచ్చుకోవడం తో పాటు కలక్షన్స్ కుడా భారీగానే వసూలు చేసింది. మరి టెంపర్ పది రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కలక్షన్స్  షేర్ లలో  నైజాం - 10. 85 కోట్లు, కృష్ణ - 1. 87 కోట్లు, నెల్లూరు - 1. 13 కోట్లు, గుంటూరు - 2. 75 కోట్లు, కడప  టౌన్ -26,57,784 లక్షలు, ప్రొద్దుటూరు - 20 లక్షలు , కర్నూల్ సిటీ - 54 లక్షలు,  ఓవర్సేస్ - 3  కోట్లు, మొత్తంగా టెంపర్ పది రోజులకు 34  కోట్లు వసూలు చేసింది.

టెంపర్ వారాంతపు కలక్షన్స్ ఇలా ఉన్నాయి

ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో రూపొందిన హై ఒళ్టేజ్ ఎంటర్ టైనర్ టెంపర్. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ చిత్రం 13న విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. మరి ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దమా .. నైజాం 6. 21 కోట్లు, సీడెడ్ 3. 92 కోట్లు, గుంటూరు - వైజాగ్ - 5. 35 కోట్లు,  ఈస్ట్ -వెస్ట్ - 2. 32 కోట్లు, కృష్ణ - నెల్లూరు - 1. 91 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17. 82  కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కలిపి ఈ చిత్రం 20. 15 కోట్లు వసూలు చేసినట్టు సమంచారం.   

200 కోట్లు వసూల్ చేసిందట ఐ

భారీ అంచనాల మద్య రిలీజ్ అయి అందరినీ నిరాశకి గురిచేసిన చిత్రం 'ఐ '. శంకర్ నుండి వస్తోన్న సినిమా అనగానే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కానీ వాటిని అందుకోవడంలో మాత్రం శంకర్ చతికిల బడ్డాడు కానీ శంకర్ బ్రాండ్ ఇమేజ్ అనేది అన్నీటికి అతీతమైంది కాబట్టి ఐ చిత్రం అవలీలగా 200 కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్ లలో రిలీజ్ అయిన ఐ చిత్రం రెండు వందల కోట్లను వసూల్ చేసినప్పటికీ , ఈ చిత్రాన్ని పంపిణీచేసిన వారికీ నష్టాలనే మిగల్చడంతో త్వరలోనే శంకర్ -విక్రం ల కాంబినేషన్ లో మరో లో బడ్జెట్ చిత్రాన్ని చేసి వాళ్ళకి తక్కువ రెట్ల కు అమ్మడానికి నిర్ణయం తీసుకు న్నారట . ఐతే భారీ వసూళ్లు వచ్చినప్పటికీ ఈ సినిమాకి నష్టాలు రావడానికి కారణం భారీ బడ్జెట్ కావడం. పైగా మూడు గంటల నిడివి దాంతో బడ్జెట్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది. దాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటే ఐ ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది .

గోపాలా గోపాలా కలక్షన్స్ ఇలా ముగిసాయి

టాలీవుడ్ లో రూపొందిన క్రేజీ మల్టి స్టారర్ చిత్రం గోపాల గోపాలా. వెంకటేష్ , పవన్ కళ్యాణ్ లు కలిసి నటించిన ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 10 న విడుదల అయ్యింది. సురేష్ ప్రొడక్షన్ , నార్త్ స్టార్ ప్రొడక్షన్ పతాకం పై సురశ్, శరత్ మరార్ లు నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటివరకు వసూలు చేసిన కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.  నైజాం - 11. 42 కోట్లు,  సీడెడ్ - 5. 35 కోట్లు, ఉత్తరాంద్రా - 4. 59 కోట్లు, గోదావరి జిల్లాలు - 6. 38 కోట్లు, కృష్ణ - గుంటూరు - 5. 62 కోట్లు, నెల్లూరు - 1. 42 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34. 85 కోట్లు, కర్ణాటక - ఇండియా ఇతర ప్రాంతాల్లో కలిపి - 3. 38 కోట్లు, ఓవర్సీస్ - 4. 22 కోట్లు, మొత్తంగా ఈ సినిమా 42. 57 కోట్ల వసూలు రాబట్టింది.  

కళ్యాణ్ రామ్ పటాస్ 10 డేస్ కలక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎన్టిఆర్ ఆర్ట్స్ పతాకం పై తెరకెక్కిన పటాస్ చిత్రం ఈ నెల 23 న విడుదలై మంచి హిట్ అందుకుంది. ఈ ఏడాది బ్లాక్ బాస్టార్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే కలక్షన్స్ స్టేడి గా ఉన్నాయి. మరి పటాస్ పదిరోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. nనైజాం - 4. 15 కోట్లు, సీడెడ్ - 1. 98 కోట్లు, వైజాగ్ - 1. 08 కోట్లు, గుంటూరు , కృష్ణ - 1. 66 కోట్లు,  ఈస్ట్ , వెస్ట్ - 1. 32 కోట్లు, నెల్లూరు - 0. 35 కోట్లు, nకర్ణాటక - 0 . 73 కోట్లు,  ఓవర్సీస్ - 0. 67 కోట్లు,  మొత్తంగా 12. 04 కోట్ల షేర్ సాదించింది.    

శంకర్ ఐ సినిమా కలక్షన్స్ దున్నేస్తూనే ఉంది

వెండితెర వండర్ దర్శకుడు శంకర్ రూపొందించిన ఐ ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తమిళం లో సంచలన విజయం సాదించింది. ఈ సినిమా సౌత్ లో టాప్-2 గ్రాసర్ గా నిలవడం విశేషం. రోబో తరువాత ఈ సినిమా ఆ స్తాయిలో కలక్షన్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా 12 రోజుల కలక్షన్స్ ఇలా ఉన్నాయి. తమిళనాడు - 62. 43 కోట్లు, ఎపి - 23. 57కోట్లు, తెలంగాణా 11. 82 కోట్లు, కేరళ - 14. 52 కోట్లు, కర్ణాటక - 11. 41 కోట్లు,  రెస్ట్ అఫ్ ఇండియా 20. 49 కోట్లు, ఓవర్సీస్ - 45. 36 కోట్లు, టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 172. 86 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమాకు మంచి కలక్షన్సే ఉన్నాయి. 

పటాస్ ఐదు రోజుల కలక్షన్స్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎన్టిఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మించిన పటాస్ చిత్రం ఇటివలే విడుదలై సంచలన విజయం సాదించింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో మరిన్ని థియేటర్స్ కుడా పెంచారు. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఐదు రోజుల కలక్షన్స్ ఇలా ఉన్నాయి మరి ?  నైజాం - 2. 05 కోట్లు,  సీడెడ్ - 1. 00 కోట్లు, వైజాగ్ - 0. 58 కోట్లు, గుంటూరు , కృష్ణ - 0. 82కోట్లు,  ఈస్ట్ - వెస్ట్ - 0. 51 కోట్లు, నెల్లూరు - 18 లక్షలు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి - 4. 72 కోట్లు,  ఓవర్సీస్ - ఇండియా ఇతర ప్రాంతాల్లో కలుపుకొని దాదాపు 5. 42 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యంత భారి వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.    

కలక్షన్స్ ను దున్నేస్తున్న శంకర్ ఐ

సంచనల దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన ఐ సినిమా కలక్షన్స్ ను దున్నేస్తుంది. తెలుగులో డివైడ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల కలక్షన్స్ వసూలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద తన సత్తా చాటుకుంది. విక్రమ్ , అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ కలక్షన్స్ ఇలా ఉన్నాయి . ఐ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 92 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. తమిళనాడు - 38. 11 కోట్లు, ఆంధ్రా , తెలంగాణా - 28 కోట్లు, కేరళ - 10. 04 కోట్లు, కర్ణాటక - 6. 84 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా - 2. 86 కోట్లు, ఓవర్సీస్ - 34 కోట్లు, అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ జనవరి 16 న విడుదలైంది. హిందీలో దాదాపు 7 కోట్లు వసూలు చేసింది.  మొత్తంగా ఈ చిత్రం దాదాపు వందకోట్ల మార్కెట్ ను దాటింది. 

గోపాలా గోపాలా 10 రోజుల కలక్షన్స్

వెంకటేష్ , పవన్ కళ్యాణ్ ల కలయికలో టాలీవుడ్ లో రూపొందిన క్రేజ్ మల్టి స్టారర్ సినిమా గోపాలా గోపాలా. కిషోర్ పార్ధసాని దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ఈ నెల్ 9 న విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో రన్ అవుతూ మంచి వసూళ్లు రాబట్టింది. మరి ఆ కలక్షన్ ఎలా ఉన్నాయో చూద్దాం .. నైజాం - 10. 91 కోట్లు, సీడెడ్ - 4. 99కోట్లు, వైజాగ్ - 3. 92 కోట్లు, గుంటూరు - కృష్ణ - 3. 38కోట్లు, ఈస్ట్ - వెస్ట్ - 5. 28 కోట్లు, నెల్లూరు - 1. 25 కోట్లు,  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32. 15 కోట్ల వసూలు సాదించింది. ఇక కర్ణాటక - 2. 40 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా - 1. 00 కోట్లు, ఓవర్సీస్ - 3. 98 కోట్లు, nప్రప్రంచ వ్యాప్తంగా దాదాపు 40. 14 కోట్ల కలక్షన్స్  వసూలు చేసింది.  

మొత్తంగా రజిని లింగా కలక్షన్ ఇలా ఉన్నాయి మరి

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా ఎన్నో భారి అంచనాలతో వచ్చిన చిత్రం లింగా. మొత్తంగా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా కలక్షన్స్ ఇక ముగిసినట్టే. అందాలా హాట్ భామలు  అనుష్క , సొనక్షి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను కె ఎస్ రవికుమార్ తెరకెక్కించారు.  మరి లింగా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా. లింగ కలక్షన్స్ మొత్తం 17 రోజులకు గాను ( ఇవి గ్రాస్ కలక్షన్స్) - తమిళ నాడు - 63- 15 కోట్లు, తెలుగు రాష్ట్రాలు - 25-75 కోట్లు,  కర్ణాటక - 11. 12 కోట్లు, కేరళ - 05-02 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా - 3. 43 కోట్లు, హింది చిత్రానికి - 3. 38 కోట్లు, మొత్తంగా ఈ సినిమా ఇండియా లో దాదాపు 112 . 05కోట్ల కలక్షన్స్ సాదించింది. అమెరికాలో - 10 కోట్లు, మలేసియా - 11- 02 కోట్లు, యు ఎ ఈ - 5. 03 కోట్లు, యుకె - 2. 68 కోట్లు, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ - 1. 43కోట్లు,ఇతర ప్రాంతాల్లో - 6. 47కోట్లు, మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 148 కోట్ల కలక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమా నిర్మాణం కుడా భారిగా కావడం విశేషం.    

ధూమ్ కలక్షన్లను దున్నేస్తున్న పీకే

అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా కలక్షన్ల సునామి సృష్టిస్తుంది . ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ రావడం తో పాటు విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంటుంది . వైవిధ్య భరితంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు . ఇప్పటికే ఈ సినిమా సంచలనం సృష్టించిన ధూమ్ కలక్షన్స్ ను అదిగమిస్తుంది. ఇప్పటికే దాదాపు ఏడూ రోజులకు గాను దాదాపు 172. 59 కోట్ల కలక్షన్స్ రాబట్టింది . మరో వారం లో ఈ సినిమా కచ్చితంగా నలుగు వందల కోట్లా క్లబ్ ను దాటుతుందని అంటున్నారు విశ్లేషకులు . ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కొన్ని హిందూ సంగాలు హెచ్చరిస్తున్న నేపద్యం లో ఈ సినిమా కలక్షన్స్ ఇంత భారిగా ఉండడం విశేషం . 

3రోజుల్లో 95కోట్లు కొల్లగొట్టిన పీకే మాస్టర్

బాలీవుడ్ మిష్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పటికే పలు రికార్డులను తన వశం చేసుకున్న అమీర్ తాజాగా నటించిన ''పీకే '' చిత్రం మొదటి నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండటం తో మూడు రోజుల్లోనే 95కోట్ల 21లక్షలు వసూల్ చేసింది. మొత్తమ్మీద ఈ చిత్రం 300 కోట్లను అవలీలగా దాటేయగలదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అమీర్ ఖాన్ -అనుష్క శర్మ లు కలిసి నటించిన ఈ చిత్రం మొదటి రోజు 26. 63కోట్లు ,రెండో రోజు 30. 34కోట్లు ,మూడో రోజు 38. 24కోట్లు వసూల్ చేసి కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

2రోజుల్లో 50కోట్లు వసూల్ చేసిన అమీర్

విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ చిత్రం ''పీకే ''గత శుక్రవారం విడుదలై మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ తో భారీ వసూళ్లను సాధిస్తోంది. రెండు రోజుల్లోనే 50కోట్లను కొల్లగొట్టి సంచలనం సృష్టిస్తున్నాడు అమీర్ ఖాన్. కేవలం ఒక ట్రాన్సిస్టర్ ని మాత్రమే అడ్డుపెట్టుకొని వంటిపై బట్టలు లేకుండా నిలిచిన ఓ పోస్టర్ తో సంచలనం సృష్టించిన అమీర్ దాంతో సినిమాపై అంచనాలను పెంచేసాడు. ఇక వచ్చిన రివ్యూ లు కూడా సినిమాకి బాగా హెల్ప్ చేసాయి. అమీర్ ఖాన్ ,అనుష్క శర్మ నటించిన ఈ చిత్రం అవలీలగా 3వందల కోట్లను దాటగలదని అంచనా వేస్తున్నారు.

అమీర్ ఖాన్ పీకే కలక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే సినిమా ఇటివలే విడుదలై సంచలనం సృష్టిస్తుంది . ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దూసుకు పోతుంది . ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 26. 63 కోట్ల కలక్షన్స్ ఇండియా లో సందించింది . రెండో రోజుకు 44 కోట్లు , సాదించింది . ధూమ్ 3 తరువాత ఈ సినిమా అంతా భారి కలక్షన్స్ సాదించడం విశేషం. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించాడు . ఈ చిత్రం ఓవర్సీస్ లో 161,857 కలక్షన్స్ సాదించింది

ఫస్ట్ డే 15కోట్లు కొల్లగొట్టిన లింగ

భారీ అంచనాల మద్య భారీ ఎత్తున రిలీజ్ అయిన రజనీ లింగ మొదటిరోజు 15కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఐతే ఈ 15కోట్లు కూడా తెలుగు ,తమిళ భాషల్లో వసూల్ చేయడం గమనార్హం. తమిళనాట దాదాపు రెండు వారాలకు గాను టికెట్స్ అన్నీ బుక్ అయిపోవడంతో అక్కడ భారీ వసూల్లనే సాధించే అవకాశం ఉంది ఐతే తెలుగునాట మిశ్రమ స్పందన రావడంతో ఇక్కడ కొంత కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్లు బాగానే రాబట్టే అవకాశం ఉంది. ఎన్నో అంచనాల మద్య రజనీకాంత్ ,అనుష్క ,సోనాక్షి సిన్హా లు నటించిన ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు.

మూడు రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టిన షారుఖ్

రివ్యూ లకు భిన్నంగా మూడు రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టి బాలీవుడ్ బాద్ షా తన పవరేంటో రుచి చూపించాడు. ఈనెల 24న రిలీజ్ అయిన ''హ్యాపీ న్యూ ఇయర్ '' చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అవలీలగా మూడు రోజుల్లోనే వంద కోట్లను వసూల్ చేసి భారీ విజయం దిశగా దూసుకు పోతోంది. ఐతే ఈ సినిమా విడుదల సమయంలో వచ్చిన రివ్యూ ల విషయానికి వస్తే అసలు ఈ సినిమా మొత్తం మీద వందకోట్లను రాబడితే గొప్పే అనుకున్నారు కానీ మూడు  రోజుల్లోనే వంద కోట్లను వసూల్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.మూడు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 108కోట్ల 86లక్షలు వసూల్ చేసినట్లు రెడ్ చిల్లీస్ సంస్థ ప్రకటించింది. ఇక బాద్ షా షారుఖ్ ఖాన్ దీపికా తో చేసిన రెండు చిత్రాలు ''ఓం శాంతి ఓం '',''చెన్నై ఎక్స్ ప్రెస్ '' భారీ విజయం సాధించడమే కాకుండా అప్పటి ట్రెండ్ కి అనుగుణంగా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు అవి. ఆ రెండు చిత్రాల తర్వాత తిరిగి మూడోసారి జతకట్టి హ్యాట్రిక్ సాధించారు. 

40కోట్ల సినిమా 11వందల కోట్లు కొల్లగొట్టింది

హాలీవుడ్ లో ''అన్నా బెల్లి ''చిత్రం రికార్డులు బద్దలు కొడుతోంది . కేవలం 40కోట్ల తో రూపొందిన ఈ చిత్రం 11వందల కోట్లు కొల్లగొట్టి అందరి కళ్ళు బైర్లు కమ్మెలా చేసింది. మనకు 40కోట్లు పెద్ద బడ్జెట్ ఏమో కానీ హాలీవుడ్ లో మాత్రం 40కోట్లంటే చిన్న బడ్జెట్ అన్నమాట ! అలా చిన్న బడ్జెట్ తో రూపొందిన అన్నా బెల్లి భారీ కలెక్షన్లను సాధిస్తుండటం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మనదగ్గర భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలు బాల్చీ తన్నేస్తుండటం తో కథ ,కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ బడ్జెట్ కి ,అగ్ర హీరోలకు కాదని ఎప్పుడు తెలుసుకుంటారో మనవాళ్ళు .

ఒక లైలా కోసం ఫస్ట్ వీక్ కలక్షన్స్

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ 'ఒక లైలా కోసం' సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతుందని ట్రేడ్ టాక్. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ఈ సినిమా బాగానే కలక్షన్స్ వసూలు చేస్తుంది . కానీ గుండెజారి గల్లంతయ్యిందే డైరెక్టర్ విజయ్ సెకండ్ ఫిల్మ్‌గా ఆ రేంజ్ అంచనాలను అందుకోకపోవడం, ఈ మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతున్నాయని టాక్. ఫస్ట్ వీక్ రూ.10 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆశించిన 'లైలా' ఏడున్నర కోట్లకే పరిమితం అయిందట. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియాలవారీ ఇలా ఉన్నాయ్.. నైజాం రూ.3 కోట్లు, సీడెడ్ రూ.1. 15 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.96 లక్షలు, గుంటూరు రూ.62, రూ.కృష్ణా 52 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.45, వెస్ట్ గోదావరి రూ.39 లక్షలు, నెల్లూరు రూ.26 లక్షలు  టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ  7. 35 కోట్లు

తొలిరోజు 40కోట్లు కొల్లగొట్టిన షారుఖ్

నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన షారుఖ్ -దీపికా ల చిత్రం ''హ్యాపీ న్యూ ఇయర్ '' మొదటి రోజునే 40కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. షారుఖ్ -దీపికా ల కాంబినేషన్ లో వచ్చిన ''ఓం శాంతి ఓం '',''చెన్నై ఎక్స్ ప్రెస్ '' చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ కి క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలతో ఈ చిత్రం రిలీజ్ కావడంతో అంతే భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజునే దాదాపు 40కోట్లను కొల్లగొట్టి షారుఖ్ పాత రికార్డులను బద్దలు కొట్టింది ''హ్యాపీ న్యూ ఇయర్ ''. ఐతే ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్ర ఫలితం ఎలా ఉండబోతోందో సరిగ్గా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే . 

4రోజుల్లో 175కోట్లు కలెక్ట్ చేసిన బ్యాంగ్ బ్యాంగ్

హృతిక్ రోషన్ -కత్రినా కైఫ్ జంటగా నటించిన ''బ్యాంగ్ బ్యాంగ్ ''ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల దుమ్ము దులిపెస్తోంది. రివ్యూ లలో వ్యతిరేకత వచ్చినా ఇది హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని గగ్గోలు పెట్టినా సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రికార్డులు కట్టబెడుతున్నాడు. 140 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం  నాలుగు రోజుల్లో నే ప్రపంచవ్యాప్తంగా 175.61 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది.ఒక్క భారత్ లోనే కాకుండా విడుదలైన ప్రతీచోటా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది ఈ చిత్రం.హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను కట్టి పడేస్తుండగా ,కత్రినా కైఫ్ అందాలు కత్తిలా గుచ్చుకొని కనకవర్శాన్ని కురిపిస్తున్నాయి

3రోజుల్లో 71కోట్లు కలెక్ట్ చేసిన బ్యాంగ్ బ్యాంగ్

హృతిక్ రోషన్ ,కత్రినా కైఫ్ జంటగా నటించిన ''బ్యాంగ్ బ్యాంగ్ '' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది.దేశ వ్యాప్తంగా  మొదటి మూడు రోజుల్లో 71కోట్ల 72లక్షలను వసూల్ చేసి భారీ విజయం దిశగా దూసుకు పోతోంది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమా పై క్రిటిక్స్ నుండి విమర్శలు వచ్చినప్పటికీ ,రివ్యూ లకు భిన్నంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతోంది హృతిక్ చిత్రం. హాలీవుడ్ ని తలపించేలా హృతిక్ చేసిన విన్యాసాలకు తోడూ కత్రినా గ్లామర్ ,యాక్షన్ వెరసి బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తోంది ఈ చిత్రం. మొదటి వారం వంద కోట్ల పై చిలుకు సాధించనుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 125కోట్ల ను తొలివారం అవలీలగా అధిగమిస్తుందని అంటున్నారు. 

లౌక్యం మొదటి వారం కలక్షన్స్

గోపీచంద్ హీరోగా శ్రీ వాస్ దర్శకత్వం లో భవ్య క్రియేషన్ పతాకం పై ఇటివలే విడుదలైన లౌక్యం చిత్రం మొదటి వారం మంచి కలక్షన్స్ వసూలు చేసింది . ఈ చిత్రం మొదటి వారం లో దాదాపు 7. 58కోట్లు , ఓవర్ సీస్ ఇతర ప్రాంతాల్లో కలిపి 2. 54 కోట్ల కలక్షన్ రాబట్టింది . లౌక్యం కలక్షన్స్ ఇలా ఉన్నాయి . నైజం– 2.43 కోట్లు, , సీడెడ్ – 1.42 కోట్లు, వైజాగ్ – 1.03 కోట్లు, ఈస్ట్ – 65  లక్షలు , వెస్ట్ – 41 లక్షలు, కృష్ణ – 66 లక్షలు, గుంటూరు – 71 లక్షలు,  నెల్లూరు – 26 లక్షలు, nమొదటి వారం  ఏపి& తెలంగాణా  కలెక్షన్స్ 7.57 కోట్లు, కర్ణాటక – 1.16 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా – 0.25 కోట్లు , ఓవర్సీస్ – 0.56 కోట్లు, మొదటి  వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 9.54 కోట్లు, వసూలు చేసి దసరా కలక్షన్స్ కుడా రాబట్టుకున్డుంది ? 

చరణ్ ఒక్కరోజు కలెక్షన్లు

చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఐతే కలెక్షన్ల పరంగా మాత్రం గత రికార్డులను చెరిపేస్తుందని భావించినప్పటికీ ఆ రికార్డుల జోలికి వెళ్ళకుండా తన పని తాను కానిస్తున్నాడు గోవిందుడు . ప్రకాష్ రాజ్ ,జయసుధ ,శ్రీకాంత్ ,కమిలినీ ముఖర్జీ ,కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం మెరుగైన వసూల్లనే సాధించినప్పటికీ తన రికార్డులను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. ఇక ఈ చిత్ర కలెక్షన్ల వివరాలలోకి వెళితే ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి మొదటి రోజు కలెక్షన్లు. నైజాంలో   .2.15 కోట్లు,గుంటూరులో 1.24 కోట్లు,సీడెడ్ లో 1.61 కోట్లు,తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి,ఉత్తరాంధ్ర లో 69.75 లక్షలు,పశ్చిమ గోదావరి జిల్లాలో 82.5 లక్షలు,నెల్లూరు లో 39 లక్షలు, కృష్ణా లో 53.61 లక్షలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో  8.44 కోట్లు వసూల్ చేసిందీ చిత్రం. 

టాలీవుడ్ టాప్ మూవీస్ కలక్షన్స్!

టాలీవుడ్ లో సినిమా వందకోట్ల మార్కెట్ వైపు దూసుకు పోతుంది . ఇప్పటికే చాలా సినిమాలు యాభై కోట్ల క్లబ్ ను ఎప్పుడో దాటేసాయి . మరి సినిమా విడుదలై న మొదటి వారం లో ఎ సినిమా ఎంత కలక్షన్స్ వసూలు చేసిందో చూద్దామా ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది- మొదటి వారం 47.27 కోట్లు వసూలు చేసి మొదటి స్తానం లో ఉంది . రామ్ చరణ్ నటించిన ఎవడు – 36.77 కోట్లు, మహేష్ బాబు , వెంకటేష్ ల మల్టి స్టారర్  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – 33.50కోట్లు, అల్లు అర్జున్ నటించిన  రేసు గుర్రం – 33.20 కోట్లు, సూపర్ స్టార్ మహేష్ నటించిన ఆగడు – 33.00 కోట్లు, ఎన్టిఆర్ శ్రీను వైట్ల కలయికలో వచ్చిన బాద్ షా – 32.60 కోట్లు, పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ – 32.00 కోట్లు, రామ్ చరణ్ , వినాయక ల కలయికలో వచ్చిన  నాయక్ – 29.50 కోట్లు, ఎన్టిఆర్ నటించిన రామయ్య వస్తావయ్య – 28.60 కోట్లు, రామ్ చరణ్ , సంపత్ నంది ల కలయికలో వచ్చిన రచ్చ- 28.05 కోట్లు, పవన్ కళ్యాణ్ , పూరి ల కలయికలో వచ్చిన  కెమెరామెన్ గంగతో రాంబాబు – 27.90 కోట్లు వసూలు చేసి టాప్ టెన్ పొజిషన్ లో ఉన్నాయి .

నైజాం లో పవర్ చూపిస్తున్న రవితేజ

ఇటివలే విడుదలైన పవర్ సినిమా మంచి కలక్షన్స్ రాబట్టుకుంటుంది. మాస్ రాజ రవితేజ నటించిన ‘పవర్’ మూవీ నైజాం ఏరియాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పది రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ. 7. కోట్లకు పైగా  వసూలు చేసింది. రవితేజ ఇప్పటి వరకు నటించిన సినిమాలతో పోలిస్తే నైజాంలో ఇదే అత్యధిక వసూళ్లు. ‘ఆగడు’ చిత్రానికి మిక్డ్స్ రెస్పాన్స్ రావడం ఈ చిత్రానికి కలిసొస్తోంది. ‘పవర్’ సినిమా స్టోరీ పరంగా కొత్తదనం లేక పోయినా కుడా ఇప్పుడు మార్కెట్ లో సరైన సినిమాలు లేకపోవడం వాళ్ళ పవర్ కు కలసి వచ్చింది . బలుపు తరువాత రవితేజ కు ఈ సినిమా మరో హిట్ గా నిలిచింది ? 

మహేష్ ఫస్ట్ డే టార్గెట్ పది కోట్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి రోజు టార్గెట్ పది కోట్లను కొల్లగొట్టడం అది దాదాపు నెరవేరేలా ఉంది. ఇప్పటి వరకు భారీ వసూళ్ళ ను సాదించిన ఘనత పవన్ కళ్యాణ్ చిత్రం ''అత్తారింటికి దారేది ''పై ఉంది . ఆ చిత్రం మొదటి రోజు దాదాపు 9కోట్ల 70లక్షలు సాధించినట్లు లెక్కలు ఉన్నాయి దాన్ని క్రాస్ చేయాలంటే మహేష్ పది కోట్లను రాబడితే తొలిరోజు రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఐతే మహేష్ నటించిన ఆగడు చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్ళ ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిరోజు రికార్డ్ నే కాకుండా మొదటి వారం వసూళ్ళ ను కూడా భారీ గానే సాధించే అవకాశం ఉంది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా డిఫరెంట్ మాడ్యు లేషన్ తో అభిమానులను అలరిస్తున్నాడు మహేష్. 

దీపికా 20కోట్ల ను పిండేసింది!

బాలీవుడ్ బాక్సాఫీస్ పై దీపికా హవా కొనసాగుతోంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం '‘ఫైండింగ్ ఫ్యానీ'’  బాక్సాఫీసునూ కొల్లగొడుతోంది. దీపికా పడుకునే , అర్జున్‌కపూర్, నజీరుద్దీన్‌షా, డింపుల్ కపాడియా తదితరులు నటించిన ఈ చిత్రం వారాంతానికి వచ్చిన వసూళ్లు రూ.20 కోట్లట. దీపికా -అర్జున్ కపూర్ ల మద్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయట !ఇక ఈ చిత్ర ప్రమోషన్ లో దీపికా చిట్టి పొట్టి బట్టలు వేసుకోవడమే కాకుండా అందరి ముందు అర్జున్ కపూర్ తో రొమాన్స్ చేసి విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. పెద్ద హీరోలకు దీటుగా దీపికా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్ళ ను సాధిస్తోంది.

మహేష్ 100 కోట్ల బడ్జెట్ సినిమా!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే టాపిక్ పై జోరుగా ఉహా గానాలు ఉపందు కున్నాయి . ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఆగడు సినిమా విడుదలకు రెడీ అయ్యింది . ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ సినిమా ల నటిస్తున్నాడు . ఇదిలా ఉండగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మాతలు. మహేష్ తో ఇప్పటికే రెండు భారీ సినిమాలను నిర్మించి ఈ నెలలో విడుదల కాబోతున్న ‘ఆగడు’ సినిమా ద్వారా మరో భారీ సంచలనానికి సిద్ధం అవుతున్నారు.   ఈ సినిమా బిజినెస్ కూడ మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా బంపర్ గా జరగడంతో ‘ఆగడు’ రిజల్ట్ రాకుండానే మరో 100 కోట్ల భారీ సినిమాకు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చే సంవత్సరం వేసవి నుండి షూటింగ్ మొదలు పెట్టేడట్లుగా అప్పుడే ప్రాధమిక ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తల ఉపన్డుకున్నాయి . ‘ఆగడు’ ఆడియో వేడుకకు శంకర్ ను అతిధిగా పిలవడం వెనుక ఈ నిర్మాతల వ్యూహాత్మక ఎత్తుగడ ఇదే అని టాక్. శంకర్ విక్రమ్ తో నిర్మిస్తున్న ‘మనోహరుడు’ (ఐ) విడుదల అయిన తరువాత ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు.  మహేష్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందే ఈ సినిమా వార్తలు టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి ? 

ఆ విషయం లో రేహమనే టాప్!

ఎ అర్ రెహమాన్ ఈ పేరు వింటే చాలు ఓ అద్బుతమైన సంగీతం గుర్తొస్తుంది . ఇండియా లో టాప్ సంగీత దర్శకుడిగా ఉన్న రెహమాన్ ఇప్పుడు రేమునరేషణ్ విషయం లో కుడా టాప్ రేంజ్ లో ఉన్నాడు . ఇండియాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరి కన్నా అత్యదిక రెమ్యునిరేషన్ తీసుకున్న,తీసుకున్నే వ్యక్తి ఎ.అర్.రెహమాన్ అని అందరికి తెలుసు .ఆయన ప్రతీ సినిమాకి దాదాపు  3కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటాడు. అలా అని ఏ సినిమా పడితే అ సినిమా చెయ్యడు.అయితే  రెహ్మాన్ రెమ్యునిరేషన్ రెట్టింపు అయింది. సంచలన దర్శకుడు  శంకర్ రూపొందిస్తున్న ‘ఐ’ సినిమాకి మాత్రం 6 కోట్లు వరుకు తీసుకున్నాడట.  ఎందుకంత అని ఆశ్చర్యపోతున్నారా?..17 బాషల్లో  శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా హాలివుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ సినిమాకు  సంగీతానికి కూడా అదే రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. మరీ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని అందుకోవాలంటే ఎంతో కష్టపడాలి కదా అందుకే అంత రేమునరేషణ్ మరి ?

ఎన్టీఆర్ రభస బాగానే కుమ్మింది

వినాయక చవితి పండగ కావడం ,వీకెండ్ కావడంతో రభస చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రభస వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 29న రిలీజ్ చేసారు. పండగ సందర్భంగా ,ఆ తర్వాత శనివారం కూడా కావడంతో రెండు రోజుల్లోనే 11కోట్ల 80లక్షలకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో రుచి చూపించింది. రెండు రోజుల్లో ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.  నైజాం 3 కోట్ల 65 లక్షలు,  సీడెడ్ 2. 54, గుంటూరు 1. 43,  ఈస్ట్ గోదావరి 1. 13,  ఉత్తరాంధ్ర 1. 05, కృష్ణా 81 లక్షలు, వెస్ట్ గోదావరి 75 లక్షలు,  నెల్లూరు 55 లక్షలు, మొత్తం 11 కోట్ల 88 లక్షలు.

స్టార్ హీరోల సరసన ఆ దర్శకుడు!

టాలీవుడ్ లో లేటెస్ట్ క్రేజీ హీరోలయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే . కేవలం క్రేజే కాదు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ లుగా ఉన్నారు . ఇప్పుడు వీరి సరసన చేరాడు స్టార్ దర్శకుడు రాజమౌళి ! అవుతూ సంచలన దర్శకుడిగా టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి రూపొందించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ము దులిపాయి . లేటెస్ట్ గా భారి గా రూపొందిస్తున్న బాహుబలి సినిమాతో రాజమౌళి ఇండియాలోనే టాప్ దర్శకుల లిస్టు లో చేరిపోయాడు . ఇప్పుడు రాజమౌళి తెలుగులో అత్యదిక పారితోషికం తీసుకుంటున్న దర్శకునిగా పేరు పొందాడు . బాహుబలి సినిమాకు అయన దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది . మరి మహేష్, పవన్ లు 15-20 కోట్ల వరకు సినిమాకు వసూలు చేస్తున్నారు . మరి రాజమౌళి వీరిని మించి పోయాడంటే అతిశయోక్తి కాదేమో ?

విక్రమ్ సినిమాకు భారి రేటు!

అత్యంత భారి ప్రతిష్టాత్మకంగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో రూపొందిస్తున్న ఐ సినిమా మొదటినుండి సంచలనాలను కలిగిస్తూనే ఉంది . ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో క్రేజ్ క్రియేట్ చేస్తుంది . అయితే తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం భారిగా రేటు చెబుతున్నట్టు తెలుస్తోంది . ఇప్పటికే ఈ సినేమాకు క్రేజీ ఎక్కువవ్వడం తో కేవలం తెలుగు హక్కులకోసం దాదాపు 20 కోట్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. మనోహరుడు పేరుతో విడుదలయ్యే ఈ చిత్రానికి డబ్బింగు సినిమాలను తనదైన శైలిలో మార్కెట్ చేస్తూ విజయాలు సాదిస్తున్న లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ 15 కోట్లు ఆఫర్ ఇచ్చిందట. కాని ఈ విషయం లో తగ్గేది లేదని తమిళ నిర్మాత అంటున్నాడట . మరి ఈ హక్కులు ఎవరికీ దక్కేనో చూడాలి . 

వరల్డ్ వైడ్ గా 377కోట్లు వసూల్ చేసిన కిక్

ప్రపంచ వ్యాప్తంగా సల్మాన్ ఖాన్ కిక్ చిత్రంతో దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 377కోట్లను కొల్లగొట్టి తన సత్తా చాటాడు సల్లు భాయ్. తెలుగులో సూపర్ హిట్ అయిన ''కిక్ ''  చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అయి విజయం సాధిస్తున్నప్పటికీ తెలుగు చిత్రంతో పోల్చుతూ ఆ స్థాయిలో లేదని విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మాత్రం బాగానే వసూళ్ళ ను సాధిస్తుంది కిక్ . సల్మాన్ ఖాన్,జాక్వేలేన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన ఈ చిత్రంతో వరుసగా 7చిత్రాలు వంద కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టించాడు. దేశ వ్యాప్తంగా 309కోట్లను వసూల్ చేసిన కిక్ ఓవర్సీస్ లో 68కోట్లను వసూల్ చేసింది.

బిజినెస్ వర్గాల్లో రభస చేస్తున్న ఎన్టిఆర్!

లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టిఆర్ నటించిన రభస చిత్రం ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో నిజంగానే రభస రభస చేస్తుంది . షూటింగ్ పూర్తయి ఈ నెల 29 న విడుదల కానున్న ఈ చిత్రానికి  విపరీతమైన బిజినెస్ క్రేజ్ వచ్చిందట. ఈ సినిమా బాగా రావడం తో పాటు ఆడియో , ట్రైలర్ పరంగా మంచి క్రేజ్ రావడం తో అన్ని ఏరియాలకీ మంచి బిజినెస్ జరిగిందట. టాలీవుడ్ మార్కెట్ వర్గాలను బట్టి అన్ని ఏరియాలకూ,  ఓవర్సీస్ కూడా కలుపుకుని దాదాపు  రైట్స్ 45 కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది . దాంతో పాటు  శాటిలైట్ హక్కుల ఓ చానల్ ఈ చిత్రాన్ని దాదాపు 8 కోట్లకు అమ్ముడయినట్టు తెలుస్తోంది . సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో ఎన్టిఆర్ కు జోడిగా సమంతా , ప్రనీతలు నటిస్తున్నారు . బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మాత . 

వంద కోట్లు కొల్లగొట్టిన అజయ్

కేవలం 5రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టి నిజమైన సింగం అనిపించుకున్నాడు హీరో అజయ్ దేవగన్ . గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ''సింగం రిటర్న్స్ '' కేవలం 5రోజుల్లోనే వంద కోట్ల పై చిలుకు వసూళ్లను సాధిస్తూ 2014సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ చిత్రాల విశ్లేషకులు తరుణ్ ఆదర్శ తెలియజేసిన లెక్కల ప్రకారం సింగం రిటర్న్స్ వసూళ్లు ఇలా ఉన్నాయి. శుక్రవారం 32.09 కోట్లు, శనివారం 21.05 కోట్లు, ఆదివారం 24.55 కోట్లు, సోమవారం 14.78 కోట్లు, మంగళవారం 8.21 కోట్లు.. కలిపి ఐదు రోజుల్లోనే వందకోట్లు దాటేసింది.

మూడు రోజుల్లో 30కోట్ల వసూళ్లు

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన అంజాన్ బాగానే అంజాన్ కొడుతోంది . బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి మూడు రోజులకు గాను 30కోట్లు కలెక్ట్ చేసిందట ! సినిమా పోయిందని అందరూ పెదవి విరుస్తున్నప్పటికి కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఐతే 15ఆగస్ట్ కావడం తర్వాతి రెండు రోజులు వీకెండ్ కావడంతో మంచి కలేక్షన్లనే రాబట్టింది సూర్య చిత్రం . సమంత ఈ చిత్రంలో నటించడానికి తోడూ గ్లామర్ ఒలకబోయడమే కాకుండా తొలిసారిగా బికినీ వేయడంతో కూడా మంచి వసూల్లె వచ్చాయి. ఐతే లాంగ్ రన్ కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఏమైతేనేం మొత్తానికి మూడు రోజుల్లో 30కోట్లు సాధించి కొంతమేరకు నష్టాలను తగ్గించింది.

టీజర్ కె భారి బిజినెస్!

ఇటివలే విడుదలైన టీజర్ చూసి ఆ సినిమా బిజినెస్ భారిగా జరగడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం కలిగిస్తుంది . ఇంతకి ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ? అదే రవితేజ నటిస్తున్న పవర్ . రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ వస్తున్నది.  ఈ నేపధ్యంలో సినిమాపై అంచనాలు కుడా భారీగా పెరిగిపోయాయి. దాంతో సినిమా బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది. ఈ చిత్రం నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 9 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్లో ఇంత పెద్ద మొత్తంలో నైజాం రైట్స్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. మరో ప్రక్క ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5 వచ్చాయని వినికిడి. అలాగే మరిన్ని ఏరియాలు కుడా క్రేజీ గా నే అమ్ముడు పోయ్యయని టాక్ .  దాంతో మొత్తం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు  30 కోట్లు జరిగిందని తెలుస్తోంది . రవితేజ సినిమాల్లో పెద్ద రికార్డ్ ఇదే . మరి ఈ సినిమా విడుదలై మరిన్ని సంచలనాలు కలిగిస్తుందో చూడాలి . 

బాహుబలికి 150కోట్ల బిజినెస్?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా ,అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సంచలన చిత్రం ''బాహుబలి ''. ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతూ దక్షిణాదిన సంచలనం సృష్టిస్తున్నాడు బాహుబలి . ఈ సినిమాకి ఇప్పటివరకు 80కోట్ల బిజినెస్ జరగగా కర్ణాటక ,తమిళ ,హిందీ ,ఓవర్సీస్  భాషలు కలిపి మరో 70కోట్ల కు పైగానే బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది మొత్తానికి విడుదలకు ముందే 150కోట్లకు పైగా బిజినెస్ జరుగుతూ రికార్డుల మోత మోగుతోంది.సినిమా పూర్తికాకుండానే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం తో రేపు విడుదలయ్యాక మరెన్ని రికార్డులు సృస్టించనుందో ! ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క ,తమన్నా ,రానా ,రమ్యకృష్ణ ,సుదీప్ ,నాజర్ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ లో గర్జిస్తున్న సింగం

బాలీవుడ్ బాక్సాఫీస్ పై సింగం దాడి చేయడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళ లాడుతోంది. సింగం సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన ''సింగం రిటర్న్స్ '' ఆగస్ట్ 15న విడుదలై బాక్సాఫీస్ ని కుమ్మేస్తోంది. భారీ వసూల్లె కొలమానం ఐతే సింగం రిటన్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో మొదటి రోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు లకేక్కింది. తొలిరోజు 32కోట్లకు పైగా వసూల్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు అజయ్ దేవగన్ . అజయ్ దేవగన్ -కరిష్మా కపూర్ జంటగా రూపొందిన ఈ చిత్రం వీకెండ్ జోష్ తో మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది. పక్కా మాస్ మసాలా చిత్రం కావడంతో దానికి తోడూ వరుసగా సెలవు దినాలు కావడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ పై సింగం దాడి చేస్తోంది.

30 కోట్ల బిజినెస్ సాధించిన పవర్

రవితేజ హీరోగా,  హన్సిక, రెజీనా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు, కన్నడలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా ఆడియోతో పాటు విడుదల చేసిన ట్రైలర్ తో పాటు పాటలకూ ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందట.. ఒక్క నైజాం హక్కుల్నే 7.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని 12కోట్లకు అమ్మేశారట.  అలాగే కర్ణాటక రెండు, ఓవర్సీస్ రైట్స్ రెండు కలిపి నాలుగు కోట్ల రూపాయల బిజినెస్ అయిందని సమాచారం. ఇక వీటితో పాటు ఆడియో, శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 7.5కోట్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇప్పటికే ఈ సినిమా 30కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుని టేబుల్ ప్రాఫిట్ గా నిలిచిందని చెబుతున్నారు..  

బాహుబలి కి భారీ రేటు

సినిమా ఇంకా పూర్తికాక ముందే బాహుబలి తన బలం ఏమిటో చూపిస్తోంది. తాజాగా ఈ చిత్ర గుంటూరు హక్కులు 6.5 కోట్లకు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టిస్తోంది. గుంటూరు హక్కులను ప్రభాస్ మిత్రుడు వంశీ ఈ భారీ మొత్తానికి కొనుక్కున్నాడు. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లలో భారీ మొత్తాలకు ఈ చిత్రాన్ని కొనుక్కోవడం తో విడుదలకు ముందే పలు సంచలనాలను నమోదు చేస్తోంది బాహుబలి . దర్శక ధీరుడు జక్కన్న వెండితెర సంచలనం బాహుబలి రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డులను నమోదు చేస్తుంటే ఇక రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా రానా విలన్ గా నటిస్తున్నాడు. అనుష్క ,తమన్నా లు ప్రభాస్ సరసన నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడు వేసవిలో రిలీజ్ కానుంది.

రవితేజ పవర్ ఏడున్నర కోట్లు

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని జెమిని టివి ఏడున్నర కోట్లకు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. రవితేజ సరసన అందాల భామలు  హన్సిక ,రెజీనా లు నటిస్తుండగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. బలుపు చిత్రానికి కథ అందించిన బాబీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా దాదాపు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్ర సాటి లైట్ హక్కులను జెమిని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.

ప్రభాస్ కు 25కోట్లట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంలో నటిస్తున్నందుకు భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడట ! అవును గతకొంత కాలంగా కేవలం బాహుబలి కోసం తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు అక్షరాల 25కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులోనే కాక దక్షిణాది లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ''బాహుబలి '' అన్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దడానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అహరం శ్రమిస్తున్నారు. అనుష్క ,తమన్నా ,రానా తదితరులు నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం  2015లో విడుదల కానుంది. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 

ఆరు కోట్లు పలికిన దృశ్యం

విక్టరీ వెంకటేష్ నటించిన ''దృశ్యం '' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడం తో ఆ సినిమా సాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడు పోయింది. ఆరు కోట్ల రూపాయలు చెల్లించి సాటిలైట్ రైట్స్ హక్కులను పొందారట ! జూలై 11న రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ రోజు రోజుకి మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. వెంకటేష్ -మీనా జంటగా రూపొందిన ఈ చిత్రంలో నదియా ,నరేష్ తదితరులు నటించారు. నటి శ్రీప్రియ దర్శకత్వం వహించగా సురేష్ బాబు ,రాజ్ కుమార్ ,సేతుపతి సంయుక్తంగా నిర్మించారు. ఓవర్సీస్ లోను మంచి వసూళ్లను సాధిస్తుండటం తో వెంకటేష్ ,సురేష్ బాబు సంతోషంగా ఉన్నారు.

హృతిక్ రెమ్యునరేషన్ 50కోట్లట!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్  సూపర్ స్టార్ షారుఖ్ ,సల్మాన్ ,అమీర్ లను వెనక్కి నేట్టేస్తున్నాడు రెమ్యునరేషన్ విషయంలో .... తాజాగా హృతిక్ రోషన్ '' మొహంజదారో '' అనే చారిత్రాత్మక చిత్రంలో నటించడానికి 50కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట ! అది కూడా సినిమా ప్రారంభానికి ముందే కావడంతో సంచలనమే అయ్యింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ ,అమీర్ ఖాన్ లు అదే స్థాయిలో రెమ్యునరేషన్ వసూల్ చేస్తున్నప్పటికీ అది సినిమా విడుదలయ్యాక కానీ వాళ్ళ చేతికి రాదట ఎందుకంటే లాభాల్లో వాటాగా తీసుకోవడం తో కాస్త సమయం పట్టవచ్చు కానీ హృతిక్ మాత్రం ముందుగానే పారితోషికం తీసుకుంటుండటం తో ఇదొక హాట్ టాపిక్ అయ్యింది.

యమలీల 2బడ్జెట్ 20కోట్లట!

తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి మంచి హిట్ కొట్టి 90వదశకం లో మాంచి పేరు గడించిన ఎస్ వి కృష్ణారెడ్డి ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం '' యమలీల 2''. డా. మోహన్ బాబు యముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కే వి సతీష్ హీరోగా నటిస్తున్నాడు. ఐతే ఈ చిత్రానికి దాదాపు 20కోట్ల బడ్జెట్ అట ! ఒక కొత్త హీరో చిత్రానికి ఇంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేయడం వంటివి చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి దర్శకుడిగా సక్సెస్ లో లేడు పైగా చాలా కాలం తరవాత దర్శకత్వం వహిస్తున్నాడు,ఇలా అన్ని వ్యవహారాలు చూస్తారు పంపిణీ దారులు, కొత్త హీరో పై ఇంత  బడ్జెట్ ఎలా వర్కౌట్ అవుతుందని అంటున్నారు . యమలీల రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన సంగతి తెలిసిందే ! ఆ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా హీరోగా అలీకి మంచి పేరుతో పాటు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది . 

77కోట్లను కొల్లగొట్టిన ఏక్ విలన్

గతనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన బాలీవుడ్ చిత్రం ''ఏక్ విలన్ ''భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ వంద కోట్ల వైపు దూసుకుపోతోంది. వారం రోజులకు గాను మొత్తం 77కోట్లను కొల్లగొట్టి సత్తా చాటుతోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ఏక్తా కపూర్ ,శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ -సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించగా జెనీలియా భర్త బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ విలన్ గా నటించి మెప్పించాడు. వారం రోజులకు 77కోట్లు వసూల్ చేయడం తో త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ చిత్రం భారత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది.

150కోట్ల భారీ బడ్జెట్ తో బాహుబలి

దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రతిస్టాత్మకంగా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం '' బాహుబలి ''. తెలుగు ,తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ ,మలయాళం లలో కూడా డబ్బింగ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా రానా విలన్ గా నటిస్తున్నాడు. అనుష్క ,తమన్నా లు ప్రభాస్ సరసన నటించనున్నారు. వి ఎఫ్ ఎక్ష్ అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తుండటం తో దానికి తోడూ భారీ తారాగణం ,భారీ సెట్టింగ్స్ ఇలా అన్ని కూడా భారీ గా ఉండటం వల్ల ఈ చిత్రానికి దాదాపుగా 150కోట్ల బడ్జెట్ అవుతుందని దర్శక ధీరుడు జక్కన్న పేర్కొన్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. 

40కోట్ల మార్క్ లో అక్కినేని మనం

ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటూ 40కోట్ల మార్క్ కు చేరువయ్యింది అక్కినేని ప్రతిష్టాత్మక చిత్రం ''మనం ''. అక్కినేని నాగేశ్వర్ రావు ,నాగార్జున ,నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం యావత్ తెలుగు ప్రేక్షకులను ఆనంద సాగరం లో ముంచెత్తింది. అక్కినేని హీరోలకు ఓ భారీ విజయాన్ని అందించడమే కాకుండా .... అక్కినేని హీరోల్లో 35కోట్లు దాటిన మొదటి చిత్రంగా నిలిచి అక్కినేని వంశాభిమానులకు పండగలా నిలిచింది. అద్భుతమైన కథ ,కథనం మనం చిత్రానికి తోడవడం తో ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. 35కోట్ల మార్క్ ని దాటిన ఈ చిత్రం త్వరలోనే 40కోట్ల ని కూడా క్రాస్ చేసి 50కోట్లను చేరుకుంటుందని నమ్ముతున్నారు. ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడం తో మరికొద్ది రోజులు మనం మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా ఉంది. ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకేలుతోంది.

7కోట్లు పలికిన మనం సాటిలైట్ రైట్స్

అక్కినేని ప్రతిష్టాత్మక చిత్రం '' మనం '' సాటిలైట్ రైట్స్ 7కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి జెమిని టీవి ఈ హక్కులను సొంతం చేసుకుంది. అక్కినేని నాగేశ్వర్ రావు ,నాగార్జున ,నాగచైతన్య లతో పాటు అఖిల్ కూడా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. అక్కినేని మూడు తరాల కథా చిత్రం కావడం ,అక్కినేని చివరి చిత్రం కూడా కావడం తో అఖిలాంద్ర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మనం చిత్రాన్ని చేజిక్కించుకోవడానికి భారీ మొత్తం ఇవ్వడానికి సిద్దపడటం తో 7కోట్ల ధర పలికింది.

25కోట్ల క్లబ్ లో అక్కినేని మనం

అక్కినేని మూడు తరాల ప్రతిష్టాత్మక చిత్రం '' మనం '' ఘనవిజయం సాధిస్తూ 25కోట్ల క్లబ్ లో చేరింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన మనం రెండో వారానికి 25కోట్ల షేర్ ని వసూల్ చేసి అక్కినేని వంశానికి ఘనవిజయాన్ని అందించింది. మరో పెద్ద సినిమా కూడా దరిదాపుల్లో లేకపోవడంతో దానికి తోడూ కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం మనం కావడంతో అవలీలగా నలభై కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగచైతన్య ,అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అక్కినేని కుటుంబం నిర్మించింది.

50కోట్లు దొంగిలించిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాభై కోట్లు కొల్లగొట్టాడు. ఇటీవల రిలీజ్ అయిన రేసుగుర్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఇప్పటివరకు 2014సంవత్సరం లో ఘన విజయం సాధించిన మొదటి చిత్రంగా నిలవడమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ 5లో ఒకటి గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి ,డా. వెంకటేశ్వర్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం రేసుగుర్రం లా దూసుకు పోయింది. మొత్తంగా 50కోట్లు వసూల్ చేసి బాక్సాఫీస్ దుమ్ము దులిపేసి జోరు మీదున్నాడు బన్నీ. బన్నీ కి 2014సంవత్సరం బాగా కలిసి వచ్చింది ''ఎవడు '' మంచి హిట్ కావడం ,తండ్రి కావడం ఇప్పుడు ఓ సెన్సేషనల్ హిట్ దక్కడం తో చాలా సంతోషంగా ఉన్నాడు బన్నీ.

వంద కోట్లలో 2స్టేట్స్

ఏప్రిల్ 18న విడుదల అయిన ''2స్టేట్స్ '' చిత్రం భారీ కలెక్షన్ల తో దూసుకెలుతోంది. దాదాపు 45కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. మహేష్ భట్ కూతురు ఆలియా భట్ ,అర్జున్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం పై అమితాబ్ ,ప్రభుదేవా ,రితేష్ దేశ్ ముఖ్ ,సోనాక్షి సిన్హా తదితరులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆలియా భట్ ,అర్జున్ కపూర్ ల రొమాన్స్ సినిమా విజయానికి మరింతగా దోహద పడింది. దాదాపు రెండు వేల థియేటర్ లలో ఈ సినిమా రిలీజ్ చేసారు.

లెజెండ్ 50కోట్లు సాధించాడట !

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సంచలనం లెజెండ్. తొలివారంలో 33కోట్లను కొల్లగొట్టిన లెజెండ్ తర్వాత నెమ్మదించినప్పటికీ ఓవరాల్ గా యాభై కోట్ల మార్క్ ని చేరుకుంది అని అని అంటున్నారు నిర్మాతలు. బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా రాధికా ఆప్టే ,సోనాల్ చౌహాన్ లు బాలయ్య సరసన నటించారు. ఈ చిత్రంలో విలన్ గా నటించిన జగపతి బాబు కు మంచి పేరు రావడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించడానికి మంచి ఊపు ని ఇచ్చింది. బాలయ్య యాక్టింగ్ ,బోయపాటి టేకింగ్ లెజెండ్ ని యాభై కోట్ల క్లబ్ లో చేరేలా చేసాయి.

50కోట్ల వైపు రేసుగుర్రం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,శృతి హాసన్ జంటగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ రేసుగుర్రం . మొదటి వారం లో దాదాపు 33కోట్లు కలెక్ట్ చేసి యాభై కోట్ల వైపు దూసుకేలుతోంది. సమ్మర్ లో కలెక్షన్లను కుమ్ముకోవడానికి రేసుగుర్రం రేసులో ముందుకు దౌడు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా విదేశాలలో కూడా మంచి కలెక్షన్ల ని రాబడుతోంది రేసుగుర్రం. ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందంటే ఆ ఆనందానికి సురేందర్ రెడ్డి కళ్ళు చెమర్చాయి. ఆనందభాష్పాలతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు సురేందర్ రెడ్డి. ఇక బన్నీ జోష్ అంతా ఇంతా కాదు మనోడికి ట్విస్ట్ లమీద ట్విస్ట్ లు వస్తూ ఆనందాల హరివిల్లులో విహరిస్తున్నాడు. తండ్రి కావడం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో యమా జోష్ మీదున్నాడు. ఇదే స్పీడ్ లో వెళితే 50కోట్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు సినీ పండితులు.

యాభై కోట్ల క్లబ్ లో బాలయ్య లెజెండ్

నటసింహం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం లెజెండ్ . నందమూరి వంశంలో యాభై కోట్ల క్లబ్ లో చేరిన మొట్ట మొదటి హీరో బాలయ్య కావడం గమనార్హం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదటి వారం లోనే 33కోట్లను కొల్లగొట్టిన బాలయ్య రెండు వారాలు దాటి మూడో వారంలో ప్రవేశించిన లెజెండ్ యాభై కోట్ల మార్క్ ని చేరుకొని అరుదైన ఫీట్ ని సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. బోయపాటి కి కూడా యాభై కోట్ల లో ఇది ఇది తొలిసినిమా కావడం గమనార్హం. బాలయ్య నటన ,జగపతి బాబు విలనిజం ,దేవిశ్రీ సంగీతం 14రీల్స్ నిర్మాణ దక్షత ,బోయపాటి డైరెక్షన్ అన్ని కలగలిపి లెజెండ్ ని లెజెండ్ గా నిలబెట్టాయి.

గుండె మొదటిరోజు కలక్షన్స్

రన్వీర్ సింగ్ , అర్జున్ కపూర్ ల కలయికలో అలీ అబ్బాస్ దర్శకత్వం లో యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం పై ఆదిత్య చోప్రా నిర్మించిన గుండె చిత్రం మొదటిరోజు మంచి కలక్షన్స్ రాబట్టుకుంది . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలై , అన్ని సెంటర్ లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాదించి దూసుకుపోతుంది . హాట్ భామ ప్రియాంక చోప్రా గ్లామర్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ గా నిలిచింది . ఈ చిత్రం మొదటి రోజు 16 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది .

పైసా మూడురోజుల కలక్షన్స్!

నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం లో ఎల్లో ఫ్లవర్ పతాకం పై రమేష్ పుప్పలా నిర్మించిన పైసా చిత్రం ఈ నెల 7 న విడుదలైంది . ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మంచి కలక్షన్స్ సాదించింది . మొదటి రోజు 3. 75 కోట్ల కలక్షన్స్ సాదించి కలక్షన్లలొ దూసుకుపోతుంది . ఈ చిత్రం మొత్తంగా మూడు రోజులకు దాదాపు 9. 86 కోట్ల కలక్షన్స్ సాదించింది .

హార్ట్ ఎటాక్ వన్ వీక్ కలెక్షన్స్

నితిన్, ఆదాశర్మ జంటగా పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ''హార్ట్ ఎటాక్'' మంచి కలేక్షన్లనే రాబడుతోంది. జనవరి 31న భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ ఫలితమే వచ్చినప్పటికీ మొదటివారం పదమూడు కోట్లు కలెక్ట్ చేసి ఔరా! అనిపించింది. పూరి టేకింగ్, నితిన్ యాక్టింగ్, తెరనిండా అందాలతో బాగానే కలెక్ట్ చేస్తోంది ఈ హార్ట్ ఎటాక్. ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాంలో మూడు కోట్ల ఎనభై లక్షలు, సీడెడ్ లో కోటి పది లక్షలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ,ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, వైజాగ్ అన్ని ఏరియాలు కలిపి ఏడుకోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు, కర్ణాటక లో యాభై లక్షలు వసూల్ చేసి సత్తా చాటింది. మొత్తం కలిపి పదమూడు కోట్ల పందొమ్మిది లక్షలతో దూసుకెళుతోంది.

హార్ట్ ఎటాక్ మూడురోజుల కలక్షన్స్ !

యంగ్ స్టార్ నితిన్ హీరో గా పూరి జగన్నాద్ దర్శకత్వం లో ఇటీవలే విడుదలైన హార్ట్ ఎటాక్ అన్ని కేంద్రాల్లో మంచి కలక్షన్స్ రాబట్టు కుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు సాదించింది. అలాగే రెండు మూడో రోజు కుడా కలక్షన్స్ స్టడీ గా ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజు 4. 57 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు 4. 69 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మూడు రోజులకు దాదాపు 13.75 కోట్ల కలక్షన్స్ సాదించి జోరుగా దూసుకుపోతుంది.

ఎవడు మూడు వారాల కలక్షన్స్

రామ్ చరణ్ హీరోగా వంశీ పైడి పల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన ఎవడు సినిమా ఇటీవలే సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి కలక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం లో ఈ చిత్రం దాదాపు 12.48 కోట్లు వసూలు సాదించింది. ఓవర్సీస్ లో 2 కోట్లు, సీడెడ్ లో 7.16 కోట్లు వసూలు సాదించి మొత్తంగా మూడు వారాలకు 46.35 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

హార్ట్ ఎటాక్ కలక్షన్ల జోరు !

రెండు వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నితిన్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో పూరి టూరింగ్ టాకీస్ పతాకం పై ఇటీవలే విడుదలైన హార్ట్ ఎటాక్ మంచి ఓపెనింగ్ కలక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమా విడుదల కు ముందే బిజినెస్ లో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే దాదాపు 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని సమాచారం. హార్ట్ ఎటాక్ మొదటి రోజు దాదాపు 2.68 కోట్ల కలక్షన్స్ సాదించింది.

వీరం మొదటి వారం కలెక్షన్స్

తమిళ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన వీరం చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాదించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 850 స్క్రీన్ లో విడుదలైంది. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ చిత్రం మొదటి వారంలో దాదాపు 30.58 కోట్ల కలెక్షన్స్ సాదించింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో వీరుడొక్కడే పేరుతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

500కోట్ల క్లబ్ లో ధూమ్ 3

అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఉదయ్ చోప్రా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ''ధూమ్ 3''. డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపే కలక్షన్లను సాధిస్తోంది. పదహారు రోజులకు గాను వరల్డ్ వైడ్ 501.35 కోట్లను కలెక్ట్ చేసి చరిత్ర ని తిరగరాసింది. బాలీవుడ్ నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. సోమవారం చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించిన వివరాల ప్రకారం భారత్ లో ఇప్పటివరకు మూడు వందల యాభై ఒక్క కోట్ల ముప్పై అయిదు లక్షలు వసూల్ చేసింది. ఓవర్సీస్ లో నూట యాభై కోట్ల ఆరు లక్షలు వసూల్ చేసింది, మొత్తం కలిపి 500కోట్లు దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. కేవలం పదహారు రోజులకు ఈ భారీ మొత్తాన్ని వసూల్ చేసి కొత్త రికార్డులను నెలకొల్పింది. 500కోట్ల క్లబ్ లో చేరుతుంది అని అనుకున్నప్పటికీ కేవలం పదహారు రోజులకే ఈ మార్క్ ను చేరుకోవడంతో మరో 150 కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి 24న సల్మాన్ ''జయహో'' రిలీజ్ కానుంది. అప్పటి వరకు ధూమ్ మరింత దుమ్ము లేపడం ఖాయం.

రెండు వారాల్లో దుమ్ము లేపిన ధూమ్ 3 ?

ధూమ్ ఈ సినిమా మొదటి బాగం పెద్ద సంచలనం క్రియేట్ చేయడం తో దానికి సీక్వెల్ గా తీసిన ధూమ్ 2 ఇంకా పెద్ద హిట్ కొట్టి కలక్షన్ల సునామి సృష్టించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు వచ్చిన ధూమ్ 3 కలక్షన్ల లో దుమ్ము లేపుతుంది. అమీర్ ఖాన్, అబిషేక్ , కత్రిన నటించిన ఈ సినిమా విడుదలైన రోజు నుండి కూడా కలక్షన్ లలో ముందుంది. ఈ సినిమా మొదటి రెండు వారాల్లో ఈ సినిమా దాదాపు 300 కోట్ల కు పైగా వసూళ్ళు సాదించింది. ఈ సినిమా మరో రెండు వారాలకు దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్ళు రాబడుతుంది.

చెన్నై రికార్డు ను దాటేసినా ధూమ్ 3

ధూమ్ 3 అనుకున్నట్టుగానే ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డును దాటేసింది. అమీర్, అబిషేక్ నటించిన ఈ చిత్రం సంచలన విజయంతో దూసుకు పోతుంది. ఇప్పటికే చెన్నై ఎక్స్ ప్రెస్ 211 కోట్ల కలెక్షన్లను కలక్ట్ చేసి మొదటి ప్లేస్ లో నిలవగా, నిన్నటి తో ధూమ్ 3. 216 కోట్ల కలెక్షన్స్ సాదించి ఇండియన్ సినిమా చరిత్రలో ఎక్కువ కలెక్షన్స్ సాదించిన చిత్రంగా నిలించింది.

9రోజుల్లో 300 కోట్లు దాటిన ధూమ్ 3

మిస్టర్ కూల్ అమీర్ ఖాన్ , కత్రినా ల తాజా సంచలనం ''ధూమ్ 3''. దుమ్ములేపే కలెక్షన్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో 300 కోట్లను దాటింది, పాత రికార్డులన్నింటిని చెరిపేసి కొత్త రికార్డు లను నెలకొల్పుతోంది . తొమ్మిది రోజులకు గాను ఒక్క భారత్ లోనే 199కోట్లు కలెక్ట్ చేసింది, తెలుగు, తమిళ్ లో సైతం భారీ గా వసూళ్లను రాబడుతోంది, కేవలం ఈ రెండు భాషల్లో పది కోట్ల ముప్పై లక్షలు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది . ఓవర్సీస్ లో కూడా ధూమ్ 3 దుమ్ము రేపింది. మొత్తం 105 కోట్లు కేవలం తొమ్మిది రోజులకు వసూల్ చేసింది. అన్ని కలిపి 300 కోట్ల పైనే వసూల్ చేసింది. దీంతో క్రిష్ 3, చెన్నై ఎక్స్ ప్రెస్, 3 ఇడియట్స్ రికార్డు లన్నీ తుడిచి పెట్టుకు పోయాయి. అమీర్ మరో అరుదైన ఫీట్ సాధించాడు ఈ చిత్రంతో రెండు వందల కోట్లు దాటినా చిత్రాలు చేసిన ఏకైక హీరో అమీర్. ఈ చిత్ర విజయానికి అమీర్ విన్యాసాలతో పాటు కత్తి లాంటి కత్రీనా అందాలూ తోడయ్యాయి.

ధూమ్ 3 మూడురోజుల కలక్షన్స్

అమీర్ ఖాన్, కత్రిన, అబిషేక్  తదితరులు ముఖ్య పాత్రలో గతంలో సంచలన విజయం సాదించిన ధూమ్ సీక్వెల్ గా రూపొంది ఇటీవలే విడుదలైన ధూమ్ 3 చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో సంచలనం క్రియేట్ చేస్తూ కలక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా మొదటిరోజు దాదాపు 32 కోట్లు కలక్ట్ చేసింది. అయితే ఈ మూడు రోజులకు దాదాపు 70 కోట్ల కలక్షన్స్ వసూలు చేసిందని బాలీవుడ్ టాక్.

ధూమ్ 3 మొదటి రోజు కలక్షన్స్ ?

ధూమ్ సినిమా 2004 లో వచ్చి సంచలన విజయం సాదించింది. ఆ తరువాత మరో రెండేళ్లకు 2006 లో ధూమ్ 2 దానికన్నా పెద్ద హిట్ సాదించడం తో ధూమ్ 3 పై సాదారణంగా అంచనాలు బారీ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసినప్పటి నుండి ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మద్య విడుదలైన ధూమ్ 3 చిత్రం మొదటి రోజు మంచి కలక్షన్స్ రాబట్టుకుంది. అమీర్ ఖాన్, అబిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, కత్రీన నటించిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 23. 86 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు నాలుగు వేల స్క్రీన్ లలో విడుదలైన ఈ చిత్రం ఇంకా ఎక్కువ మొత్తం లో రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే రెండు వందల కోట్ల మార్కెట్ లోకి చేరుతుందని విశ్లేషకులు బావిస్తున్నారు.

రాంబో రాజ్ కుమార్ 3 రోజుల కలక్షన్స్

షహీద్ కపూర్, సొనక్షి జంటగా క్రేజీ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం లో తెరకెక్కిన రాంబో రాజ్ కుమార్ చిత్రం భారి అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం ప్రారంభం నుండే అందరిలో భారి ఆంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం 3 రోజులకు దాదాపు 23.15 కోట్ల రూపాయల వసూలు సాదించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా మరో రెండు వారాల్లో వందకోట్ల మార్కెట్ ను చేరుతుందని ట్రేడ్ అంచనా...

వర్ణ మొదటి రోజు కలక్షన్స్ ?

అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకడు శ్రీ రాఘవ దర్శకత్వం లో ఇటీవలే విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం వర్ణ. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో కలక్షన్స్ రాబట్టుకోలేక పోయింది. భారీ అంచనాలతో, ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో 1. 89 కోట్ల కలక్షన్స్ మాత్రమె సాదించింది. తెలుగుతో పాటు తమిళం లో కుడా విడుదలైన ఈ సినిమా అక్కడ కుడా కలక్షన్స్ అంతగా రాబట్టుకోలేక పోయింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5. 86 కోట్ల వసూళ్ళు సాదించడం విశేషం.

మసాలా మొదటి వారం కలక్షన్స్

వెంకటేష్ , రామ్ హీరోలుగా కే విజయబాస్కర్ దర్శకత్వం లో స్రవంతి మూవీస్ పథకం పై రూపొంది ఇటివలే విడుదలైన మసాలా చిత్రం మంచి కలక్షన్స్ రాబట్టుకుంటుంది. ఈ చిత్రం ఇప్పటికే అన్ని ఏరియాలో కలక్షన్స్ స్టడీ గా ఉన్నాయి. ఈ చిత్రం మొదటి వారం కలక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం- 3. 5, సీడెడ్ -1. 53, ఉత్తరంద్ర - 90, కృష్ణ ,గుంటూరు , నెల్లూరు - 1. 86, ఈస్ట్ , వెస్ట్ 96..21, ఓవర్సీస్ , కర్ణాటక - 1. 16, కోట్ల కలక్షన్స్ సాదించి దూసుకుపోతుంది.

మసాలా రెండురోజుల కలెక్షన్స్

nవిక్టరీ వెంకటేష్ , రామ్ హీరోలుగా కె.విజయ బాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మసాల చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంజలి సాజన్ పదం సి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్ళు రాబట్టుకుంటున్నాయి. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఈ సినిమాతో మరో సారి తెలిసిపోయింది. ఈ చిత్రం రెండురోజులకు ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు 12. 47 కోట్ల రూపాయల వసూళ్ళు సాదించి దూసుకు పోతుంది.n

మసాలా రెండురోజుల కలెక్షన్స్

విక్టరీ వెంకటేష్, రామ్ హీరోలుగా కె విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మసాల చిత్రం విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంజలి సాజన్ పదం సి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్ళు రాబట్టుకుంటున్నాయి. టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఈ సినిమాతో మరో సారి తెలిసిపోయింది. ఈ చిత్రం రెండురోజులకు ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు 12. 47 కోట్ల రూపాయల వసూళ్ళు సాదించి దూసుకు పోతుంది.

300 వందల కోట్ల క్లబ్ లో క్రిష్ 3

హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా జంటగా.. క్రిష్ చిత్రాల సీక్వెల్ లో భాగంగా వచ్చిన క్రిష్ 3అన్ని అంచనాలను తల కిందులు చేస్తూ రికార్డు ల దిశగా దూసుకెళ్తుంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరిచిన విమర్శకుల నోళ్ళు మూసుకునేలా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. నవంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇంకా మంచి వసూల్లనే రాబడుతోంది. క్రికెట్ దేవుడు సచిన్ రిటైర్ అవుతున్న సందర్భంగా జరుగుతున్న క్రికెట్ వల్ల ప్రతీ చిత్రంపై కలెక్షన్ల ప్రభావం విపరీతంగా పడుతోంది. అయినప్పటికీ ..క్రిష్ 3 భాగానే కలెక్ట్ చేస్తోంది. 235 కోట్ల కు పైగా వసూల్ చేసిన ఈ చిత్రం చెన్నై ఎక్ష్ ప్రెస్ సరసన చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయం. దక్షిణాదిన కూడా భారీ వసూళ్ళ ని రాబట్టింది . 300 వందల కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మసాలా మొదటిరోజు కలెక్షన్స్

విక్టరీ వెంకటేష్, రామ్ ల కాంబినేషన్ లో కె.విజయబాస్కర్ దర్శకత్వం లో ఇటీవలే విడుదలై న మసాల చిత్రం తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టుకుంది. బాలీవుడ్ హిట్ మూవీ బోల్ బచ్చన్ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం లో హీరోయిన్లుగా అంజలి, షాజన్ పదంసి లు నటించారు. ఈ చిత్రం ఎక్కువ థియేటర్ లలో విడుదలై తొలి రోజు 6.86 కోట్లకు పైగా కలక్షన్స్ సాదించింది.

అత్తారింట్లో కలక్షన్ల సునామి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం కలక్షన్ల సునామి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా ముందు విడుదలై అటు దసరా, ఇటు దీపావళి పండగలను కలుపుకొని కలక్షన్స్ సాదించి దూసుకుపోతుంది. ఈ చిత్రం 40రోజులకు దాదాపు గా 72. 85 కోట్ల కలక్షన్స్ సాదించి దూసుకుపోతుంది. ఏరియా వారిగా కలక్షన్స్ ఈ విదంగా ఉన్నాయి. నైజాం - 22. 18, సీడెడ్ -09. 75, నెల్లూరు & గుంటూరు - 8. 56, కృష్ణ - 2. 46, ఈస్ట్ & వెస్ట్ - 6. 89, కర్ణాటక - 4. 58, ఇండియా - 6. 97, ఓవర్సీస్ - 8. 75 కోట్ల కలక్షన్స్ సాదించింది.n్

ఆరంబం ఏడు రోజుల కలక్షన్స్

అజిత్ హీరోగా విష్ణువర్దన్ దర్శకత్వంలో తమిళం లో ఇటీవలే విడుదలైన ఆరంబం చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బిర్లా తరువాత వీరిద్దరి కలయికలో భారీ అంచనాల నడుమ విడుదలై తొలిరోజే హైయెస్ట్ కలక్షన్స్ సాదించి అజిత్ స్టామినా మరో సారి ప్రూవ్ చేసింది. నయనతార, రానా, తాప్సి నటించిన ఈ చిత్రం ఏడు రోజులకు గాను దాదాపు 54.37 కోట్ల కలక్షన్స్ సాదించి రికార్డ్ సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ గా అజిత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతో మరో సారి ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో ఎక్కువ కలక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు బావిస్తున్నాయి.

కలెక్షన్స్ ను దున్నేస్తున్న అత్తారింటికి దారేది

పవర్ స్టార్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఇటీవలే విడుదలై సంచలన విజయం సాదిస్తున్న అత్తారింటికి దారేది చిత్రం కలక్షన్స్ లో సునామి సృష్టిస్తుంది.  ఈ చిత్రం ఇప్పటికే మగధీర రికార్డులను బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో 56. 74 కోట్ల కలక్షన్స్ సాదించింది. వరల్డ్ వైడ్ గా 72. 59 కోట్ల కలక్షన్స్ రాబట్టుకొని సంచలనం సృష్టిస్తూ టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అత్తారింటికి దారేది కలక్షన్స్ ఇలా ఉన్నాయి. nనైజాం - 22.00 కోట్లు, సీడెడ్ - 9 కోట్లు , నెల్లూరు, కృష్ణ - 6.కోట్లు , గుంటూరు , వైజాగ్ - 10. 46 కోట్లు , ఈస్ట్ - వెస్ట్ - 10. 89 కోట్లు , ఆంధ్రప్రదేశ్ లో - 56. 24 కోట్లు, కర్ణాటక - 5. కోట్లు, ఇండియా లో ఇతర ప్రాంతాల్లో - 1. 56, ఓవర్సీస్ - 8. 85 కోట్లు, మొత్తంగా ఈ చిత్రం 73 . 14 కోట్లు సాదించి ముందుకు దూసుకు పోతుంది.nె

భాయ్ మొదటి రోజు కలెక్షన్స్

నాగార్జున హీరోగా పూలరంగడు ఫేమ్ వీరభద్రం దర్శకత్వం లో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ భాయ్. నిన్న విడుదలై తొలి రోజే మంచి కలక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా నైజాం లో తొలిరోజు 1. 25 కోట్ల రూపాయల కలక్షన్స్ సాదించింది. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 3 కోట్లకు పైగా కలక్షన్స్ సాదించి, అన్ని ఏరియాలో దూసుకు పోతుంది. కలక్షన్స్ కూడా బాగున్నాయని తెలుస్తోంది.

రామయ్య వస్తావయ్య మొదటి వారం కలెక్షన్స్

యన్ టి ఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన రామయ్య వస్తావయ్య మొదటి వారం మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. దిల్ రాజు నిర్మించిన  ఈ సినిమా మొదటి వారం వరల్డ్ వైడ్ గా దాదాపు 25 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. రామయ్య వస్తావయ్య కలెక్షన్స్ ఏరియాల వారిగా  ఇలా ఉన్నాయి.నైజాం - 6. 54, సీడెడ్ - 4. 00, కృష్ణ -1. 23, నెల్లూరు - 90 లక్షలు, ఈస్ట్ , వెస్ట్ - 2. 48, వైజాగ్ - 1. 96, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో  కలిపి - 3. 20, ఓవర్సీస్ - 2. 00 కోట్లు మొత్తంగా వరల్డ్ వైడ్ గా 25 కోట్ల కలెక్షన్స్ రాబట్టుకోవడం విశేషం.

దూసుకెళ్తా మొదటి రోజు కలెక్షన్స్

దేనికైనా రెడీ తరువాత మంచి ఊపుమీదున్న మంచు విష్ణు హీరోగా వీరు పొట్ల దర్శకత్వంలో రూపొందిన దూసుకెళ్తా చిత్రం నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి కలెక్షన్స్ రాబట్టాయని, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6. 84 కోట్ల కలెక్షన్స్ సాదించింది. ఇప్పటికే కలెక్షన్స్  మంచి  ఊపులొ ఉన్నాయని ఈ వారంతం వరకు 20 కోట్ల కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు బావిస్తున్నాయి.

అల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అత్తారింటికి దారేది చిత్రం విడుదలై మంచి విజయం సాదించడమే కాకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం 17 రోజులలో దాదాపు 65 కోట్లకు పైగా కలక్షన్స్ సాదించి పవన్ కళ్యాణ్ స్టామిన ప్రూవ్ చేస్తుంది. ఈ చిత్రం సాదించిన కలక్షన్స్ ఇలా ఉన్నాయ్ .నైజాం - 18. 6, సీడెడ్ - 08.00,వైజాగ్ -04. 21ఈస్ట్, వెస్ట్ - 06. 12,గుంటూరు , కృష్ణ - 07. 25,నెల్లూర్ - 02. 00,కర్ణాటక - 5. 47 ,ఓవర్సీస్ - 11. 17,మొత్తంగా ఈ చిత్రం 17 రోజులకు 65 కోట్లకు పైగా కలక్షన్స్ సాదించి సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని సెంటర్ లలో కలెక్షన్స్ బాగున్నాయని ఈ చిత్రం వంద కోట్ల మార్కెట్ కు దగ్గరలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రామయ్య వస్తావయ్య రెండురోజుల కలక్షన్స్

ఎన్టిఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందిన రామయ్య వస్తావయ్య చిత్రం ఇటీవలే విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై మంచి కలక్షన్స్  రాబట్టుకుంది. ఈ చిత్రం రెండురోజులకు ఆంధ్రప్రదేశ్ లో  మొత్తం 11 కోట్లు షేర్ సాదించింది. ఏరియ వారిగా కలక్షన్స్ ఇలా ఉన్నాయి.nనైజాం - 3. 21, nసీడెడ్ - 2. 29,nనెల్లూర్ - 50 లక్షలు , nగుంటూరు -1. 48, nకృష్ణ - 70 లక్షలు , nఈస్ట్ - వెస్ట్ - వైజాగ్ - 24. 11 కోట్ల కలక్షన్స్ సాదించింది.  మొత్తం 11  కోట్లకు కు పైగా షేర్ సాదించడం విశేషం.

అత్తారింటికి దారేది ఫస్ట్ వీక్ కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్ల సునామి సృస్తిష్టుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కలెక్షన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో భారి కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా మరో వారంలో డెబ్బై కోట్ల కలెక్షన్స్ సాదిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

అత్తారింటికి కలెక్షన్స్ ఆ రేంజ్ లోనా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన అత్తారింటికి దారేది చిత్రం సంచలనం సృష్టిస్తుంది. విడుదలకు ముందే పైరసీ జరిగినా ఆ సినిమాకు అది ప్లస్ పాయింట్ గా మారి సినిమాకు మరింత హైప్ తెచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం మొదటిరోజే దాదాపు 11. 5 కోట్లు కలక్ట్ చేసింది. తెలుగులోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక లో కూడా ఈ సినిమా కు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అటు తమిళ్ నాడు, కర్ణాటకలో ముడురోజులకు కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ సాదించినట్టు సమాచారం. ఈ చిత్రం ముడురోజులకు దాదాపు 36. 85 కోట్లు కలక్ట్ చేసిందని, ఈ వారాంతానికి 50 కోట్ల కలక్షన్స్ వసూలు చేస్తుందని సమాచారం.

ఫటా పోస్టర్ నికలా హీరో మూడు రోజుల కలక్షన్స్

షహీద్ కపూర్ , ఇలియానా జంటగా రాజ్ కుమార్ సంతోషి రూపొందించిన ఫటా పోస్టర్ నికలా హీరో చిత్రం ఈ ఫ్రైడే రోజున విడుదల అయి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ తో మంచి కలక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా ముడురోజులకు 7. 68 కోట్లు సాదించింది . అయితే ఆ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మంచి కలక్షన్స్ సాదించిందని  తెలుస్తుంది.

జంజీర్ 3 రోజుల కలెక్షన్స్

రామ్‌చ‌ర‌ణ్‌తేజ్‌, ప్రియాంక‌చోప్ర యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫిల్మ్ జంజీర్ మూవీ రిలీజ్ త‌రువాత అంద‌రూ వాటి క‌లెక్షన్స్ రిపోర్ట్‌పై తెగ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఈ మూవీను అన్ని చోట్ల నుండి మొద‌టి రోజు క‌లెక్షన్స్ ప‌ర్వాలేద‌నిపించాయి. 3500 స్క్రీన్స్‌లో విడుద‌ల‌యిన జంజీర్ హింది,తెలుగు మూవీల క‌లెక్షన్స్ క‌లుపుకొని మొద‌టి రోజు 17 కోట్ల వ‌ర‌కు క‌లెక్షన్స్‌ను క్రియోట్ చేయ‌గ‌లింది. అయితే కేవలం జంజీర్ హిందీ చిత్రం 3 రోజులకు ఈ చిత్రం 17.36 కోట్ల కలక్షన్స్ సాదించింది. ఈ కలక్షన్స్ అన్ని స్టడీ గా ఉన్నాయని సమాచారం ఈ చిత్రం వీకెండ్ వరకు దాదాపు 30 కోట్ల కలక్షన్స్ సాదిస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా తెలుగు కలక్షన్స్ కూడా బాగున్నాయి.

రామ్ చరణ్ తూఫాన్ మొదటిరోజు కలక్షన్స్

రామ్ చరణ్  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ రూపొందిన జంజీర్ చిత్రం నిన్న విడుదలై మంచి కలక్షన్స్ రాబట్టుకుంది. అటు హిందీ లోను ఇటు తూఫాన్ గా తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం తెలుగుకంటే కూడా హిందీలో మంచి హిట్ సాదించింది అని చెప్పొచ్చు. నాటి జంజీర్ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అపోర్వ లఖియ రూపొందించాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 17 కోట్ల కలక్షన్స్ సాదించి రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మంచి ఎంట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలు కలుపుకొని వరల్డ్ వైడ్ గా 17.4 కోట్లు కలక్షన్స్ సాదించింది.

డి డే సినిమా ఒక్కరోజు కలెక్షన్స్

శృతి హసన్ వేశ్యపాత్రలో నటించిన చిత్రం డి డే. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం వలన  ఈ సినిమా మొదటిరోజు ఓపెనింగ్ కలక్షన్లను మాములుగానే సాదించింది. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ రెచ్చిపోయి నటించడంతో కొంత వరకు భాగానే ఉన్న దానితో పాటు విడుదలైన  భాగ్ మిల్కా భాగ్ సినిమాకు గట్టి పోటి ఇవ్వలేక పోయిందని చెప్పాలి ఈ చిత్రం మొదటి రోజు 2. 76 కోట్ల షేర్  సాధించింది.

రామయ్య వస్తావయ్య మొదటిరోజు కలెక్షన్స్

ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన చిత్రం రామయ్య వస్తావయ్య . తెలుగు లో వచ్చిన నువ్వోస్తానంటే నేనోద్దంటానా సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో శృతి హసన్ నటించింది. భారి అంచనాల మద్య ఇటివలే విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 3.54 కోట్ల కలక్షన్స్ సాదించింది.

భాగ్ మిల్కాభాగ్ మూడురోజుల కలెక్షన్స్

ఫర్హాన్ అక్తర్ ముఖ్య పాత్రలో నటించిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాదించింది.విడుదలైన ప్రతి చోట మంచి కలక్షన్స్ రాబట్టుకుంటూ దూసుకుపోతుంది.ఈ చిత్రం మూడురోజులకు ప్రపంచ వ్యాప్తంగా 11.58 కోట్ల కలక్షన్స్ సాదించి తన సత్తా చాటుకుంది.క్రీడా ప్రపంచానికి సుపరిచిడుడైన మిల్కా సింగ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫర్హాన్ నటన అద్బుతంగా ఉందని అందరు అంటున్నారు.ఈ చిత్రం వారానికి దాదాపు 30 కోట్ల షేర్ దాటుతుందని అంచనా.

సాహసం రెండవరోజు కలెక్షన్స్

గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఇటీవల విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న సాహసం చిత్రం మొదటి రెండురోజులు మంచి కలక్షన్స్ రాబట్టుకుంది.మొదటి రోజు ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లోనే 2.64 కోట్లు వసూలు చేసింది.రెండవ రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 5.36 కోట్ల రూపాయల కలక్షన్స్ సాదించింది.వైవిధ్య కథా కథనాలతో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం మంచి విజయం సాదించింది.

బలుపు రెండు వారల కలెక్షన్స్

రవితేజ హీరోగా గోపించంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన బలుపు చిత్రం మంచి కలక్షన్స్ సదిస్తూ అన్ని ఏరియాలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో నడుస్తుంది.ఈ చిత్రం రెండు వారాలకు 27.86 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ షేర్ సాదించింది.ఇప్పటికే ఎ పీ లో దాదాపు ఇరవై కోట్ల రూపాయల షేర్ సాదించడం.రవితేజ కెరీర్ లో హైయెస్ట్ గ్రస్స్ కలక్షన్స్ వ1సులు చేయడం విశేషం.

బలుపు మొదటిరోజు కలెక్షన్స్

రవి తేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన బలుపు చిత్రం ఓపెనింగ్ రోజునే మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో వరుస ఫ్లాపుల్లో ఉన్న మల్లి రవితేజకు మంచి హుషారు తెచ్చింది. ఈ చిత్రం నైజంలో మొదటి రోజు 1. 24 కోట్లు కల్లెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మొదటిరోజు 3. 87 కోట్లు కలక్షన్ ను సాదించింది.

రాంజనా ఓవర్సీస్ కలెక్షన్స్

దక్షిణాది నటుడు ధనుష్,  సొనమ్ కపూర్ లు జంటగా నటించిన 'రాంజనా' ఓవర్సీస్ మార్కెట్ ను షేక్ చేస్తుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే యు.కె. - 71. 708 పౌండ్స్ (ఇండియన్ కరెన్సీ లో - 65.77 లక్షలు)యు.ఎస్.ఎ.కెనడా - 414,211 డాలర్లు ఇండియన్ కరెన్సీ లో - 2,47 కోట్లుయు.ఎ.ఇ.-జిసిసి ఎఇడి - 700,000 ఇండియన్ కరెన్సీ లో - 1.14 కోట్లు ఆస్ట్రేలియా -46,394 డాలర్లు ఇండియన్ కరెన్సీ లో - 25.45 లక్షలు టోటల్ వారాంతపు కలెక్షన్స్ సుమారు 850,000 డాలర్లు (అంటే 5.07 కోట్లు)విడుదలైన వారంలోపే ఇన్ని కలెక్షన్స్ సాధించిన 'రాంజనా మునుముందు మరెన్ని రికార్డులు సాధించనుందో వేచి చూద్దాం

ఇద్దరమ్మాయిలతో కలెక్షన్స్

అల్లు అర్జున్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో బండ్ల గణేష్ నిర్మించిన ఇద్దరమ్మాయిలతో చిత్రం ఇటీవలే విడుదలై డివైన్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఈ చిత్రం 5 రోజులకు ఎ పి లో దాదాపు 19 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం వసూళ్ళు తగ్గాయని తెలిసింది.

బాద్ షా కలెక్షన్స్ డల్!

ఎన్టిఆర్ హీరోగా నటించిన బాద్ షా చిత్రం మూడు వారాలకు వరల్డ్ వైడ్ గా 44. 7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా డల్ అయ్యింది ఈ చిత్రం ఓవరాల్ గా 50 కోట్ల వరకు వసూలు చేయ్యోచని అంటున్నారు, ఎన్టిఆర్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ తో కలెక్షన్స్ రాబట్టుకున్ది . బాద్ షా గుంటూరులో 41 రోజులకు 30 లక్షల షేర్ వాసులు చేయడం విశేషం.

20 కోట్ల వరకు బిజినెస్ లో గుండె జారి గల్లన్తయ్యిందే

ఇష్క్ తరువాత నితిన్ చాల కేర్ తీసుకొని చేసిన చిత్రం గుందేజారి ... ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా బాగానే కలెక్ట్ చేసింది రెండు వారాలకు ఈ చిత్రం దాదాపు 11. 8 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇప్పటికి థియేటర్ లో సందడి చేస్తున్న ఈ చిత్రం మరో వారం లో 20 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం 27 రోజులకు గుంటూరు జిల్లలో కోటి కి పైగా షేర్ సాదించడం విశేషం
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..