Home Tradenews 1300 కోట్ల క్లబ్ లో బాహుబలి 2
TOLLYWOOD
 Trade News

1300 కోట్ల క్లబ్ లో బాహుబలి 2

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
ఏప్రిల్ 28న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది . వెయ్యి కోట్లని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించగా తాజాగా ఆ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించి ఎవరూ అందుకోలేని దిశగా దూసుకుపోతోంది . ఈ దేశం , ఆ దేశం అనే తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది బాహుబలి 2.
 
 

ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు . దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్ల ని ఒక్క భారత్ లోనే వసూల్ చేసింది బాహుబలి 2 , అలాగే ఓవర్ సీస్ లో కూడా 240 కోట్ల వసూళ్ల ని సాధించింది . మొత్తంగా 1300 కోట్ల కు పైగా వసూల్ చేసింది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..