Home Tradenews వారం రోజుల్లో 16 కోట్లు రాబట్టిన నిఖిల్
TOLLYWOOD
 Trade News

వారం రోజుల్లో 16 కోట్లు రాబట్టిన నిఖిల్

Tuesday June 27th 2017
నిఖిల్ చాలా అదృష్టవంతుడు . కేశవ సినిమా యావరేజ్ గానే ఉన్నప్పటికీ బ్రహ్మాండమైన వసూళ్ళ ని సాధిస్తున్నాడు . కేవలం వారం రోజుల్లోనే పదహారు కోట్ల భారీ వసూళ్ళ ని సాధించాడు దాంతో కేశవ సినిమా హిట్ జాబితాలో చేరిపోయింది . కేశవ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత గ్రాఫ్ తగ్గింది అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు . నిఖిల్ ఎంత అదృష్టవంతుడంటే యావరేజ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్ల ని కొల్లగొట్టాడు.

మొదటి వారంలోనే 16 కోట్లు వసూల్ కావడంతో ఆ చిత్ర యూనిట్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు . నిఖిల్ మొదటిసారి సీరియస్ రోల్ చేసి మెప్పించాడు . రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మించగా సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు . పెద్ద నోట్లు రద్దు అయి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి వసూళ్ళ ని రాబట్టాడు అంటే నిఖిల్ మంచి రేంజ్ కి వెళ్ళినట్లే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..