Home Tradenews మొదటి రోజునే మూడున్నర కోట్లు తెచ్చింది
TOLLYWOOD
 Trade News

మొదటి రోజునే మూడున్నర కోట్లు తెచ్చింది

Sunday August 20th 2017
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిన్న రిలీజ్ అయ్యింది , కట్ చేస్తే మొదటి రోజునే మూడున్నర కోట్ల వసూళ్ళ ని సాధించి భేష్ అనిపించింది . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం . అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ వచ్చింది అయితే టాక్ రావడం వేరు కలెక్షన్లు రావడం వేరు పైగా అది బిఫోర్ రిలీజ్ టాక్ అని చిన్న డౌట్ ఉండేది.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక మంచి వసూళ్లు రావడం ఖాయమని తేల్చేసింది నిన్నటితో . ఫస్ట్ డే మూడున్నర కోట్లు అంటే దరిదాపులో పెద్ద సినిమాల రిలీజ్ లు కూడా లేవు పైగా మరో రెండు వారాలు స్కూళ్ళ కు సెలవులు కూడా దాంతో ఈ సినిమా 25 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..