Home Tradenews 1600 కోట్ల క్లబ్ లో బాహుబలి 2
TOLLYWOOD
 Trade News

1600 కోట్ల క్లబ్ లో బాహుబలి 2

Tuesday August 22nd 2017
బాహుబలి 2 పదహారు వందల కోట్ల క్లబ్ లో చేరింది . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధించి చరిత్ర సృష్టించింది . ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది . ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా , సత్యరాజ్ లు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు . 
 
 

తెలుగు , తమిళ్ , హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషలలో దుమ్ము రేగ్గొట్టింది బాహుబలి 2. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో బాహుబలి 2 కి ఇప్పటికి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . వరల్డ్ వైడ్ గా 1600 కోట్లు సాధించిన బాహుబలి 2 త్వరలోనే చైనాలో కూడా రిలీజ్ కానుంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..