Home Upcoming Movies
TOLLYWOOD
 UPCOMING MOVIES

బెంగాల్ టైగర్ వచ్చే డేట్ ఫిక్స్ అయింది

కిక్ 2 డిసాస్టర్ తో కాస్త ఫీలింగ్ లో ఉన్న రవితేజ ఇప్పుడు బెంగాల్ టైగర్ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉన్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. మిల్కీ భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియోను వచ్చే నెల 17 న విడుదల చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేస్తున్నారట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు బిజినెస్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అక్టోబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న 'సైజ్ జీరో'

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో’తో మన ముందుకు రానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి విన్నూతమైన సబ్జెక్ట్ తో కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో’ సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ లో గ్లామర్ తో పాటు భిన్నమైన భారీ లుక్ తో ఉన్న అనుష్కను చూసి ఆమె మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనుందని సినీ అభిమానులకు అర్థమైంది. . దాదాపు నాలుగు మిలియ‌న్స్ వ్యూవ‌ర్స్‌తో ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. . అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్  పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్నందిచిన ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 9న విడుద‌ల చేయ‌డాన‌కిఇ భారీ లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్రయూనిట్ పెర్కొంది.అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

రామ్ చరణ్ బ్రూస్ లీ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బ్రూస్ లీ చిత్ర ఆడియో ,సినిమా రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసారు. ముందుగా అనుకున్న సమయానికే అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఈ చిత్ర ఆడియోను ఈ నేల చివరలో విడుదల చేయనున్నట్లు డి వి వి ఎంటర్తైన్మెంట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి తరహ లో ఉంటుందని ఈ సినిమా రచయిత గోపి మోహన్ తెలియజేసాడు. అలాగే ఇందులో చిరంజీవి ఒక  స్టార్ పాత్రలో , ఆయన నటించే సినిమాకు రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ గా పని చేసే సన్నివేశంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయిన అది సినిమాలో ఆ సన్నివేశం కీలకం కానుందట.

సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా హోరా హోరీ

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను’, జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరాహోరీ’. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’మా నాన్నగారి స్ఫూర్తితో నేను నిర్మాతగా మారాను. వైవిధ్యమైన కథాచిత్రాలను అందించిన మా బ్యానర్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కళ్యాణ్ కోడూరిగారు అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిది. కర్ణాటకలో 53రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తేజ మరోసారి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సినీ పరిశ్రమలో కొంతమంది శ్రెేయోభిలాషులకు సినిమా చూపించాం. సినిమా చాలా బాగా వచ్చిందని ప్రశంసించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

మాలిని అండ్‌ కో ఈనెల 28న గ్రాండ్ రిలీజ్

పూనమ్‌ పాండే, మిలన్  ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’.ఈ చిత్రాన్ని   ఈ సందర్భంగా: నిర్మాతలు  కిషోర్‌రాఠి, మహేష్‌రాఠిలు మాట్లాడుతూ: తెలుగులో సంచలన తార  పూనమ్‌ పాండే నటించిన ‘మాలిని అండ్‌ కో’సినిమాను ఈ నెల 28న భారిఎత్తున రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 500కు పైగా ధియోటర్స్ రిలీజ్ చేస్తున్నాము. కోట్లలో ట్విట్టర్ ఫాలోయింగ్, లక్షల్లో ఫేస్‌బుక్ ఫ్యాన్స్ వున్న సంచలన తారా పూనమ్‌పాండే ఆగస్టూ 25నుండి హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్‌లు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌ల్లో "మాలిని అండ్ కో " సినిమా రిలీజ్ పై హాల్ చల్ చేయనుంది. 28న ధియోటర్లలో స్వయంగా టిక్కెట్ల అమ్మకం ప్రేక్షకులతో సినిమా చూడనుంది. 29, 30 తేదీలలో విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్  ధియోటర్లలో హంగామా చేయనుంది.  ఈ  చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నాము అని అన్నారు.  చిత్ర దర్శకుడు వీరు.కె. మాట్లాడుతూ:  ‘మాలిని అండ్‌ కో’సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్‌ మరియు రొమాంటిక్‌ జోనర్‌లో సాగుతుంది.  సినిమా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టేక్నీషియన్స్ అందరూ బాగా సహకరించారు. కధకనుగుణంగా పాటలుంటాయి. ఇటివల విడుదలైన పాటలకు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ నెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కొరుకుంటున్నాను అని అన్నారు.  పూనమ్‌పాండే, మిన్‌, సామ్రాట్‌, సుమన్‌, జాకీర్‌, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష తారాగణంగా నటించారు.  ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, డ్యాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, తార, వినయ్‌, ఫైట్స్‌: విజయ్‌, సహ నిర్మాత: రవి హార్‌ కూట్‌, నిర్మాత: మహేష్‌ రాఠి, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.

జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా అల్లరి నరేష్ జేమ్స్ బాండ్

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందింది. అల్లరి నరేష్ కామెడి ప్రేక్షకులకు మంచి కామెడి టానిక్ అవుతుంది. అలాగే సాక్షి చౌదరి చక్కగా నటించింది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతానందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ. n 

14 నే బాలయ్య లయన్ వస్తుంది

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఎస్ ఎల్ వి సినిమా పతాకం పై రుద్రపాటి రమణ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల విషయం లో రెండు సార్లు వాయిదా పడి ఫైనల్ గా ఈ నెల 14 న ప్రపంచ వ్యాప్తంగా భారిగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరీర్ లో నిలిచిపోయేలా ఉండే ఈ సినిమా పై అభిమానుల్లో కుడా భారి అంచనాలు ఉన్నాయి.

మే 22న రిలీజ్ కానున్న రుద్రమదేవి

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ''రుద్రమదేవి ''. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి  ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ బడ్జెట్ పెరగడం ,పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం కావడం వల్ల చిత్ర విడుదల లో జాప్యం జరిగింది . అయితే వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు గుణశేఖర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు . మే 22న రుద్రమదేవి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి గా నటించిన ఈ చిత్రంలో రానా , నిత్యా మీనన్ ,కేథరిన్ ,కృష్ణం రాజు తదితరులు నటించారు .

కిక్ 2 విడుదల డేట్ ఫిక్స్ అయ్యింది

nరవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెల 30 వరకు జరిగే షెడ్యుల్ తో సినిమా దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. అలాగే మిగిలిన పాటలను త్వరలో హైదరాబాద్ లో చిత్రీకరించి చిత్రాన్ని మే 7 న విడుదల చేస్తారట . నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. కిక్ సూపర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కుడా క్రేజ్ గా జరుగుతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ చివర్లో ఆడియో ను విడుదల చేస్తారట ! తమన్ సంగీతం అందిస్తున్నాడు.n

మే 1న బాలయ్య లయన్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లయన్ చిత్రాన్ని కార్మికుల దినోత్సవ సందర్భంగా మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. బ్యాలెన్స్ వర్క్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది . ఆ పనులన్నీ త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ 9న ఆడియో వేడుక నిర్వహించి మే 1న సినిమాని రిలీజ్ చేయనున్నారు . బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండగా త్రిష ,రాధికా ఆప్టే నాయికలుగా నటిస్తున్నారు . రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు . మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు .  
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..