అవన్నీ గాలి వార్తలేనట

నాకు ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు , కానీ నాకు యాక్సిడెంట్ జరిగినట్లు …… సీరియస్ గా ఉన్నట్లుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దాంతో నా సన్నిహితులు పలువురు ఫోన్ చేసి నా యోగ క్షేమాలు అడుగుతున్నారు అందుకే అందరి కోసం చెబుతున్నా నాకు ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు బాగా ఉన్నాను అంటూ ట్వీట్ చేసాడు యంగ్ హీరో ఆది పినిశెట్టి . 
 
తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఆది పినిశెట్టి నటుడిగా , హీరోగా పలు సక్సెస్ లు అందుకున్నాడు . దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడు అయిన ఆది పినిశెట్టి ఇటీవలే అజ్ఞాత వాసి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఇక రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంలో కూడా నటిస్తున్నాడు . నా యోగ క్షేమాల కోసం ఫోన్ చేసిన మిత్రులకు , అభిమానులకు నా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా కి ఎక్కాడు ఆది పినిశెట్టి .