ఆ సినిమా విడుదల కావడం లేదు


achari america yatra release postponed once againమంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర ఈనెల 6న విడుదల కావాల్సి ఉండే కానీ అర్దాంతరంగా ఆ సినిమా విడుదల వాయిదా వేశారు దాంతో ఈనెల 6న విడుదల కావడం లేదు ఇక కొత్త డేట్ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ ఏప్రిల్ 27 న ఉండొచ్చట . అసలు ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ రకరకాల కారణాలతో మూడు నెలలుగా వాయిదా పడుతూనే ఉంది కట్ చేస్తే ఇప్పుడు మరోసారి వాయిదాపడింది .

అయితే ఈసారి వాయిదా పడటానికి కారణం రంగస్థలం చిత్రంతో పాటు నితిన్ చల్ మోహన్ రంగ చిత్రాలు కారణం . మార్చి 30న విడుదలైన రంగస్థలం చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తోంది దాంతో ఎక్కువ థియేటర్ లలో ఆ సినిమానే ఆడుతోంది ఇక మిగిలిన థియేటర్ లలో నితిన్ చల్ మోహన్ రంగ వస్తోంది ఈ సమయంలో పోటీకి పోయి దెబ్బ తినేకంటే కొంత గ్యాప్ తీసుకొని వస్తే హిట్ కొట్టొచ్చు అని భావిస్తున్నారట ఆ చిత్ర బృందం అందుకే విడుదల వాయిదా వేశారు .