బస్సు మీద నుండి కిందపడిన నటుడు చలపతిరావు


actor chalapathirao injured in shootingసీనియర్ నటుడు చలపతి రావు బస్సు మీద నుండి కింద పడి గాయాలపాలయ్యాడు . అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రంలో చలపతిరావు నటిస్తున్నాడు కాగా ఆ సినిమా షూటింగ్ లో భాగంగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కే సన్నివేశంలో నటిస్తున్నాడు . కాగా బస్సు నిచ్చెన ఎక్కే సమయంలో స్లిప్ అయి కిందపడిపోయాడు దాంతో గాయాలపాలయ్యాడు .
వెంటనే చలపతిరావు ని ఆసుపత్రికి తరలించారు , సీరియస్ నెస్ ఏమి లేదని కానీ ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు . అయితే చలపతిరావు బస్సు మీద నుండి కిందపడి గాయాలపాలు కావడంతో ఆ చిత్ర యూనిట్ చాలా కంగారు పడుతోంది . దర్శక నిర్మాతలు చలపతిరావు ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు . అల్లరి నరేష్ కూడా చలపతిరావు ని పరామర్శించాడు .