లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న హాస్య నటుడు


actor priyadarshi love with richa sharma012పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా స్టార్ కమెడియన్ గా మారిన హాస్య నటుడు ప్రియదర్శి . పెళ్లి చూపులు తర్వాత అతడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది వరుస అవకాశాలతో సరికొత్త కమెడియన్ అయ్యాడు స్టార్ డం పొందాడు . తాజాగా ఈ నటుడు ప్రేమలో ఉన్న విషయాన్నీ స్పష్టం చేసాడు . ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రిచా శర్మ ని ప్రేమిస్తున్న విషయాన్నీ తెలిపాడు అంతేకాదు ఆమెతో కలిసి దిగిన ఫోటోని ట్వీట్ చేసి నెటిజన్ల కు పరిచయం చేసాడు తనకు కాబోయే భార్య గురించి .

 

త్వరలోనే ప్రియదర్శి – రిచా శర్మ ల వివాహం జరుగనుందట ,తన జీవితంలోకి రానున్న రిచా శర్మ పట్ల తనకున్న ప్రేమని కవిత రూపంలో ప్రియదర్శి చాటిన ప్రేమ నెటిజన్ల ను ఆకట్టుకుంటోంది . మొత్తానికి పెళ్లి చూపులు తో నటుడిగా సత్తా చాటిన ప్రియదర్శి పెళ్లి చూపులు ముగించుకొని పెళ్లి పీఠలు ఎక్కే సమయం ఆసన్నమైంది .