మహేష్ బాబు పై సంచలన ఆరోపణలు


actress madhavilatha sensational comments on mahesh babu టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ మాధవీలత . సినిమారంగంలో మహిళలకు సరైన గౌరవమే లేదని అందుకు నేనే మంచి ఉదాహరణ అని అంటోంది ఈ భామ . మహేష్ నటించిన అథితి చిత్రంలో నేను ఓ పాత్ర పోషించానని అయితే ఒకరోజు కాస్త ఆలస్యంగా షూటింగ్ కి వచ్చానని దాంతో నాపై దర్శకులు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ సమయంలో పక్కనే మహేష్ బాబు కూర్చొని ఉన్నాడని కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపిస్తోంది మాధవీలత .

ఒక మహిళా ఆర్టిస్ట్ ని అందునా హీరోయిన్ గా నటించిన దాన్ని ఓ దర్శకుడు తన ముందే తిడుతుంటే కనీసం మర్యాద కోసమైనా పట్టించుకోని వాడు మహేష్ అని అలాంటి వాడు హీరో ఎలా అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవీలత . సినిమారంగంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని శ్రీరెడ్డి లేవనెత్తిన అంశం కార్చిచ్చు లా రగులుతూనే ఉంది . మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ వివాదం మహేష్ ఇమేజ్ కి కొంత ఇబ్బందే మరి .