ఆ హీరోయిన్ ని ఘోరంగా అవమానించారట


పాకిస్థాన్ కు చెందిన వాళ్ళు అయితే మనుషులు కారా ? మమ్మల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా ? అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది పాకిస్థాన్ నటి  సబా కమర్ . తాజాగా ఈ భామ ” హిందీ మీడియం ” అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది . ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం జార్జియా దేశానికి వెళ్ళింది చిత్ర యూనిట్ . హిందీ మీడియం లో పనిచేసే వాళ్లంతా భారతీయులు కావడంతో ఓ మోస్తారు తనిఖీలు చేసి పంపించారు కానీ హీరోయిన్ సబా కమర్ ని మాత్రం ఎయిర్ పోర్ట్ లో ఎక్కువ సేపు ఉంచడమే కాకుండా రకరకాల ప్రశ్నలు వేసి ఎక్కడెక్కడో చేతులు వేసి తనిఖీ లు చేశారట . 
ఈ విషయాన్నీ ఓ ఛానల్ వాళ్లతో పంచుకుంటూ తనకు జరిగిన అవమానానికి వెక్కి వెక్కి ఏడ్చింది . సబా కమర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . పాకిస్థాన్ కి చెందిన వాళ్ళం అయితే ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సబా .