నారా లోకేష్ కు అండగా నిలిచిన శ్రీ రెడ్డి


actress sri reddy support to nara lokeshఆంధ్రప్రదేశ్ యువ నాయకులు , ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కు అండగా నిలిచింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . గతకొంతకాలంగా నారా లోకేష్ ని ప్రతిపక్ష వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ” పప్పు ” అంటూ లోకేష్ ని తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే . అదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు తో పాటు నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేస్తున్నాడు . తండ్రీ కొడుకులిద్దరూ కలిసి భారీ ఎత్తున అవినీతి కి పాల్పడుతున్నారని పవన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే .

పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు శ్రీ రెడ్డి కి నచ్చలేదు దాంతో నేరుగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తోంది . మీ అన్న ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి తిరుపతి నుండి ఎం ఎల్ ఏ గా గెలిచి అక్కడి ప్రజలకు నయా పైసా పని చేయలేదు . సినిమాల్లో డైలాగులు పేల్చినట్లు రియల్ లైఫ్ లో మాట్లాడొద్దు మీ సత్తా ఏంటో మాకు తెలిసిందే అంటూ పవన్ కళ్యాణ్ పై అలాగే చిరంజీవి పై విమర్శలు చేస్తోంది శ్రీ రెడ్డి . లోకేష్ ని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తోంది శ్రీ రెడ్డి . అయితే శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాగూ పవన్ కళ్యాణ్ స్పందించదడు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం స్పందించడం ఖాయం .