సెక్స్ ఆరోపణలపై స్పందించిన భామ


adah sharma responds on casting couchసినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే అని , సెక్స్ కోసం హీరోయిన్ లను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను వేధిస్తున్నది కూడా నిజమే అని సెక్స్ ఆరోపణలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఆదా శర్మ . సినిమా రంగంలో మాత్రమే కాదని ఇతర రంగాల్లో కూడా ఈ సమస్య ఉందని అయితే ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉందని చెబుతూనే నాకు మాత్రం ఈ సమస్య ఎదురు కాలేదని అంటోంది ఆదా శర్మ .

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ” హార్ట్ ఎటాక్ ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ , అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోవడంతో హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ పాత్రలు ఇస్తున్నారు పాపం ఈ భామకు దాంతో రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ పలు ఫోటో షూట్ చేసింది , ఆదా శర్మ అందాలను ఆస్వాదించారే తప్ప మంచి అవకాశాలు మాత్రం ఇవ్వలేదు తెలుగులో .