125 కోట్ల ని వసూల్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పాడు . అజ్ఞాత వాసి చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి సంచలనం సృష్టించాడు . జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన అజ్ఞాత వాసి చిత్రం మొదటి రోజున 60 కోట్ల ని కలెక్ట్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది అయితే రెండో రోజు మాత్రం ఆ కలెక్షన్లు భారీగా తగ్గాయి ఎందుకంటే మొదటి రోజు నుండే ఘోర మైన టాక్ స్ప్రెడ్ కావడం వల్ల కలెక్షన్ల లో కోత పడింది . 
ఎంతగా డిజాస్టర్ అంటూ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కున్న స్టార్ డం తో మొదటి వారం 125 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది అజ్ఞాత వాసి చిత్రం . 125 కోట్లు వసూల్ అయ్యాయి కానీ షేర్ మాత్రం 80 కోట్లు కూడా రాలేదు ఈ సినిమా మాత్రం 156 కోట్ల బిజినెస్ చేసింది దాంతో సగానికి పైగా బయ్యర్లు నష్టపోతున్నారు . ఇక ఓవర్సీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు అక్కడ కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ కొన్న దానికి వచ్చిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అందుకే బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు .