పవన్ కళ్యాణ్ తో అలీ కి గొడవా


ali responds on pawan kalyan issueపవన్ కళ్యాణ్ కు అలీ మంచి మిత్రుడన్న విషయం తెలిసిందే అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ అలీ ని తిట్టాడని దాంతో అలీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడటం మానేశాడని రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి . ఇవి నిజమేనా అన్నట్లుగా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి అయితే అవన్నీ గాలి వార్తలే అని ఎవరో పని పాట లేని వాళ్ళు కల్పించిన అభూత కల్పనలని అంటున్నాడు హాస్య నటుడు అలీ .

పవన్ కళ్యాణ్ తో నాకు మొదటి నుండి పరిచయం ఉందని ఆ పరిచయం మంచి స్నేహంగా మారిందని , ఇప్పటివరకు పవన్ నటించిన రెండు సినిమాలు మినహా అన్ని సినిమాల్లో నేను నటించానని నాకు పవన్ కళ్యాణ్ కు అసలు గొడవలు ఎందుకు వస్తాయని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అలీ . మొత్తానికి పవన్ తో అలీ కి మాత్రం గొడవ జరగలేదట అదీ అసలు విషయం . ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తరుపున పోటీ చేస్తారా అంటే మన చేతుల్లో ఏముంది అంటూ నర్మగర్బంగా మాట్లాడాడు అలీ .