అల్లరి నరేష్ కు ఇప్పుడైనా కలిసొస్తుందా


అల్లరి నరేష్ కు హిట్ లేక అయిదేళ్ళు గడిచిపోయింది , అసలు చెప్పాలంటే ఏడేళ్లు . సుడిగాడు చిత్రం తర్వాత అల్లరి నరేష్ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి అయితే మధ్యలో కొన్ని చిత్రాలు ఫరవాలేదనిపించాయి కానీ సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు పాపం దాంతో ఈ హీరో రేసులో వెనుకబడిపోయాడు . హిట్ కోసం పరితపించి పోతూ చాలా మంది దర్శకులతో పనిచేసాడు కానీ ఏ ఒక్కరు కూడా హిట్ ఇవ్వలేకపోయారు దాంతో మళ్ళీ భీమనేని శ్రీనివాస్ నే నమ్ముకున్నాడు అల్లరి నరేష్ . 
 
సుడిగాడు చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించింది , ఆ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ దర్శకుడు . రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న భీమనేని నే నమ్ముకుంటే మళ్ళీ తనకు ఒక సక్సెస్ ఇస్తాడని భావించిన అల్లరి నరేష్ తాజాగా అతడి దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక భీమనేని కూడా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు . అల్లరి నరేష్ కు ఇప్పుడైనా కలిసొస్తుందా చూడాలి .