అల్లు అర్జున్ అతడికి ఛాన్స్ ఇస్తున్నాడట


ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తనని తానూ నిరూపించుకున్నాడు దర్శకులు వి ఐ ఆనంద్ . ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడు అయితే ముందుగా అల్లు శిరీష్ తో చెయ్ ఆ తర్వాత మనిద్దరం తప్పకుండా సినిమా చేద్దామని అప్పట్లో మాట ఇచ్చాడట అల్లు అర్జున్ . దాంతో అల్లు శిరీష్ తో ఒక్క క్షణం అనే సినిమా చేసాడు , సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ప్లాప్ అయ్యింది . అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం వి ఐ ఆనంద్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట .

అల్లు అర్జున్ వి ఐ ఆనంద్ ఓ లైన్ చెప్పడం అది బన్నీ కి నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ చేసుకోమని చెప్పాడట ! ఇక ఆనంద్ అదే పనిలో ఉండనున్నాడు . ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఏప్రిల్ 27న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .