హాట్ భామ అనసూయ కు బంపర్ ఆఫర్


    anasuya gets bumper offerజబర్దస్త్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న హాట్ భామ అనసూయ కు రంగస్థలం చిత్రం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది . రంగమ్మత్త గా అనసూయ నటన కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు దాంతో హాట్ పాత్రలకే కాదు ముఖ్య పాత్రలకు సైతం అనసూయ న్యాయం చేస్తుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు . తాజాగా అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే .

    వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించనున్న ” ఎఫ్ 2 ” ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంలో అనసూయ కు కీలక పాత్ర లభించినట్లు తెలుస్తోంది . వినోద ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రంలో అనసూయ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువే అని తెలుస్తోంది . అనిల్ రావిపూడి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ” పటాస్ ” , ” సుప్రీమ్ ” , ” రాజా ది గ్రేట్ ” వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి .