అనిల్ రావిపూడి కొత్త చిత్రం


anil ravipudi multistarer movie gets opening dateపటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ వంటి వరుస మూడు హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత ని నిలుపుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాగా ఇప్పుడు నాలుగో చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు . ఉగాది పర్వదినం ని పురస్కరించుకొని కొత్త సినిమా ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు . ఇక ఈ చిత్రంలో హీరో ఒక్కరు కాదు ఇద్దరు అంటే మల్టీస్టారర్ చిత్రం అన్నమాట ! ఇక ఆ హీరోలు ఎవరో తెలుసా ……. సీనియర్ హీరో వెంకటేష్ , ఇటీవలే ఫిదా , తొలిప్రేమ చిత్రాలతో సంచలన విజయాలను అందుకున్న వరుణ్ తేజ్ .

 

కాస్త సెంటిమెంట్ ని కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ ని అలాగే యాక్షన్ ని కలగలిపి సినిమాగా తీయడం అనిల్ రావిపూడి స్టైల్ . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాల్లో అదే ఫాలో అయ్యాడు మూడు విజయాలు అందుకున్నాడు . ఇక ఇప్పుడు కూడా అదే స్టైల్ ని ఫాలో అవుతున్నాడు . ఎంటర్ టైన్ మెంట్ లో అనిల్ రావిపూడి ది ప్రత్యేకమైన శైలి కావడంతో అప్పుడే ఈ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు పెరిగాయి . ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు .