ఎన్టీఆర్ -చరణ్ ల సినిమాలో మరో హీరో

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ – చరణ్ ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఎన్టీఆర్ – చరణ్ లకు తగ్గ రీతిలో బలమైన విలన్ ఉండాలి కాబట్టి మరో స్టార్ హీరో ని విలన్ గా నటింప జేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . జక్కన్న సినిమాలో బలమైన విలన్ ఉంటాడన్న విషయం తెలిసిందే . 
 
విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది కాబట్టి విలన్ పాత్ర బాగా రావాలని తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని గట్టిగా కోరుతున్నాడట . ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న చిత్రం కావడంతో వాళ్లకు ధీటుగా ఉండే  విలన్ కోసం ఓ స్టార్ హీరో నే వెదుకుతున్నాడట . ఎన్టీఆర్ – చరణ్ ల పాలిట విలన్ అయ్యే ఛాన్స్ ఏ స్టార్ హీరో కు వస్తుందో చూడాలి .