అర్జున్ రెడ్డి డైరెక్టర్ మహేష్ తోనా చరణ్ తోనా


అర్జున్ రెడ్డి డైరెక్టర్ మహేష్ తోనా చరణ్ తోనాఅర్జున్ రెడ్డి చిత్రంతో సంచలన విజయం అందుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్రుష్టి ని ఆకర్షించిన దర్శకులు సందీప్ రెడ్డి వంగా . అయితే అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలాకాలం అయినప్పటికీ ఇంకా తన తదుపరి చిత్రం ఏంటి అన్నది మాత్రం తేలలేదు . మహేష్ బాబు కు ఓ కథ చెప్పాడని దానికి మహేష్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది అయితే సందీప్ రెడ్డి వంగా ఎక్కువగా మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లలో కనిపిస్తున్నాడు .

ఇప్పటికే రెండు మూడు సార్లు మెగా కాంపౌండ్ లో దర్శనం ఇచ్చిన ఈ డైరెక్టర్ తాజాగా రంగస్థలం సక్సెస్ అయిన తర్వాత చిరు ఇంట్లో సందడి చేసాడు . దాంతో చరణ్ తో కూడా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ దర్శకుడు ముందుగా మహేష్ తో సినిమా చేస్తాడా ? లేక చరణ్ తో సినిమా చేస్తాడా ? అన్న చర్చ జరుగుతోంది . చరణ్ మాత్రం ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉన్నాడు కాబట్టి మహేష్ తోనే ముందుగా సందీప్ సినిమా ఉండొచ్చు .