విజయ్ దేవరకొండ సినిమాలో నటించాలని ఉందా


auditions for vijay devarakonda dear comradeవిజయ్ దేవరకొండ సినిమాలో మీకు నటించాలని ఉందా ? అయితే మీకు బంగారం లాంటి అవకాశాన్ని ఇస్తున్నారు ” డియర్ కామ్రేడ్ ” చిత్ర బృందం . భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు ని పరిచయం చేస్తూ మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ”. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మండన నటిస్తోంది కాగా ఇతర పాత్రల్లో కొంతమంది కొత్తవాళ్లని పరిచయం చేయాలనీ డిసైడ్ అయ్యారు ఆ చిత్ర బృందం .

అందుకే టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు కాకినాడ లో . ఈనెల 16 న అలాగే 17 న కూడా రెండు రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహించ నున్నారు . కాకినాడ లోని గాంధీభవన్ లో ఈ ఆడిషన్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేసారు . ఇక నటనపై ఆసక్తి ఉన్నవాళ్లు , విజయ్ దేవరకొండ సినిమా లో నటించాలని ఉత్సాహపడేవాళ్లు ట్రై చేయండి…… ఛాన్స్ కొట్టేయండి .