చైనాలో ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలి 2


baahubali 2 china box office collectionsగత ఏడాది భారీ ఎత్తున విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన చిత్రం బాహుబలి 2 . కాగా తాజాగా చైనాలో భారీ ఎత్తున విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది బాహుబలి 2. అడ్వాన్స్ బుకింగ్ లోనే భారీ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది . ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనం సృష్టించినప్పటికీ చైనాలో మాత్రం అంతగా ఆడలేదు దాంతో బాహుబలి 2 పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి మొదట్లో .

దాంతో పకడ్బందీగా జక్కన్న అండ్ కో చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు బాహుబలి 2 కి బాగా కలిసి వచ్చాయి దాంతో ఈ సినిమా కోసం చైనా ప్రేక్షకులు క్యూ కట్టారు . దాంతో అడ్వాన్స్ బుకింగ్ లోనే వండర్ క్రియేట్ చేసింది బాహుబలి 2. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో ఒక్క చైనాలోనే 7000 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు . ఇంతటి భారీ రిలీజ్ బాహుబలి 2 కి ఏర్పడటంతో భారీ వసూళ్లు రావడం ఖాయమని నమ్ముతున్నారు . ప్రభాస్ కు బాహుబలి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది . రానా , రమ్యకృష్ణ , తమన్నా , అనుష్క , సత్యరాజ్ లు కీలక పాత్రలు పోషించిన బాహుబలి 2 ఇటీవలే జపాన్ లో వంద రోజులను పూర్తిచేసుకుంది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1600 కోట్లు వసూల్ చేసిన బాహుబలి 2 చైనాలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడాల్సిందే .