బాలకృష్ణ ని భయపెడుతున్న మహానటి


balakrishna scared with mahanatiనటసింహం నందమూరి బాలకృష్ణ భయపడుతున్నాడు మహానటి వల్ల . బాలయ్య భయపడటం ఏంటి ? అందునా మహానటి వల్ల ? అని అనుకుంటున్నారా ? బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ తహతహలాడుతున్న విషయం తెలిసిందే . పైగా ఆమధ్య గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా చేసాడు . కట్ చేస్తే దర్శకుడిగా ఇది నా వల్ల కాదు అంటూ భయపడుతూ తేజ తప్పుకున్నాడు . దాంతో మిగతా దర్శకులను కొంతమంది ని అడిగారు వాళ్ళు ఈ సాహసానికి ఒప్పుకోలేదు దాంతో నేనే దర్శకత్వం వహిస్తా అంటూ బాలయ్య మొండిగా అడుగు ముందుకు వేయడానికి సిద్దమయ్యాడు సరిగ్గా అదే సమయంలో సావిత్రి బయోపిక్ మహానటి విడుదల అయ్యింది .

అంతే బాలయ్యకు భయం వేసింది ఎందుకంటే బయోపిక్ అంటే ఎలా ఉండాలో మహానటి నిరూపించింది , అది సాధిస్తున్న విజయం …… ప్రేక్షకుల జేజేలతో బయోపిక్ అంటే ఇలాగె తీయాలి ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పైగా తెలుగువాళ్ళ ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని భావించాడట బాలయ్య . దాంతో ప్రస్తుతానికి బయోపిక్ పక్కన పెట్టడమా ? లేక సరైన దర్శకుడి చేతిలో పెట్టడమా ? అన్న ఆలోచనలో ఉన్నాడట బాలయ్య . మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి .