బాలయ్య అసంతృప్తి తో ఉన్నాడట


నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ కసిగా ఉన్నాడు కానీ అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తి తో ఉన్నాడట అది కూడా దర్శకులు తేజ మీద . ఏది ఏమైనా అనుకున్నట్లుగా ఎన్టీఆర్ జయంతి రోజున ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాడట అదే రోజున టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బాలయ్య . ఇప్పటికే టీజర్ రెడీ అయ్యింది అసలు జనవరి 18 న ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ బాలయ్య కు పట్టింపులు ఎక్కువ కాబట్టి వర్ధంతి రోజున ఎందుకు అని ఆ టీజర్ ని ఆపేసారు .

బాలయ్య అసహనం ఎక్కువ కావడంతో దర్శకులు తేజ ఆఘమేఘాల మీద మిగతా నటీనటుల ఎంపిక చేపడుతున్నాడట . ఇప్పటికే కొంతమందిని అనుకున్నాడు కానీ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదట . త్వరలోనే మిగతా పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసి బాలయ్య మెప్పు పొందాలని భావిస్తున్నాడట తేజ . ప్రస్తుతం శస్త్ర చికిత్స చేసుకున్న బాలయ్య కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు . ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం అవుతుంది .