న‌టుడు బెన‌ర్జీ కి పితృవియోగం


banerjees-father-raghavaiah-nomoreసీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీ తండ్రి, న‌టుడు రాఘవయ్య (86) ఈ రోజు ఉదయం గుండె సంబంధిత వ్యాధి తో మృతి చెందారు. ఆయనకు ఓ కొడుకు, కుమార్తె. న‌ట‌వార‌సుడు బెన‌ర్జీ టాలీవుడ్‌లో ద‌శాబ్ధాలుగా కెరీర్‌ని సాగిస్తున్నారు. కుమార్తె ప్ర‌స్తుతం చెన్న‌య్‌లోనే స్థిర‌ప‌డ్డారు. నేటి మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు మ‌ద్రాస్‌- మ‌హాప్ర‌స్థానంలో ఆయ‌న అంతిమ సంస్కారాలు పూర్తి చేయ‌నున్నారు. రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొన‌సాగుతున్నారు. మ‌ద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైద‌రాబాద్ షిఫ్ట్ అయిన క్ర‌మంలోనూ సినీరంగంలో న‌టుడిగా కొన‌సాగారు. `బ్ర‌హ్మ‌చారి` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న‌.. వంద‌లాది చిత్రాల్లో న‌టించారు.

 

ఇటీవ‌లి కాలంలో వీరాంజ‌నేయ‌, క‌థానాయ‌కుడు, య‌మ గోల చిత్రాల్లో న‌టించారు. ఈనెల 20న రిలీజ‌వుతున్న మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలోనూ ఆయ‌న ఓ పాత్ర‌లో న‌టించారు. బెన‌ర్జీ ప్ర‌స్తుతం `మా` అసోసియేష‌న్‌లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త విన్న అనంత‌రం `మా`బృందం త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది.