“బంగారి బాలరాజు” 2వ పాట 3వ పాట విడుదల


bangari-balaraju-third-song-releasedనంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయగా, రెండవ పాటను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా అనిల్ గారు మాట్లాడుతూ… బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని రెండవ పాటను నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు దర్శకుడైన కోటేంద్ర చాలాకాలం మా టీం లో వర్క్ చేశాడు. తనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ నాకు బాగా తెలుసు. కోటేంద్ర ఖచ్చితంగా ఈ సినిమాను సక్సెస్ చేస్తాడని అన్నారు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ మీద మరెన్నో సినిమాలు రావాలని, మూవీ టీం కు బెస్ట్ విషెష్ అందించారు.
ఈ సందర్భంగా అశ్వనీదత్ గారు మాట్లాడుతూ… బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని అమ్మ మీద రాసిన పాటను విడుదల చేయడం జరిగింది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. అని హీరో హీరోయిన్ లకు మరియు మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ.. “బంగారి బాలరాజు ఆడియోలోని రెండవ పాటను అనిల్ సుంకర గారు విడుదల చేయడం చాలా సంతోషం ఉంది. అనిల్ సర్ మా ఈ సినిమాకు అండగా ఉండడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాటను గీతామాధురి పాడగా, శాంతాబాయి సాంగ్ ఫేం మరాఠీ సెన్సేషనల్ హాట్ బ్యూటీ రాధికా పాటిల్ ఐటెంసాంగ్ తో అలరించింది. అలాగే ఈ సందర్బంగా అనిల్ సర్ కు యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు. ….

 

అమ్మ ప్రేమను తెలియజేసే విధంగా రూపొందిన మూడవ పాట ను అశ్వనీదత్ గారు విడుదల చేయడం హ్యాపీగా ఉంది. శ్రీ కృష్ణ పాడిన ఈ పాట తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు.
ఈ సందర్భం గా నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ… ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ ను అనిల్ సుంకర గారు
మూడో పాటను అశ్వనీదత్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.