టీజర్ ని ఎందుకు రిలీజ్ చేయలేదో తెలుసా


ఆంధ్రుల అన్న నందమూరి తారకరామారావు వర్ధంతి దాంతో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు ఇక ఆ టీజర్ ని రిలీజ్ చేయడమే తరువాయి అయితే దాన్ని రిలీజ్ చేయలేదు ఎందుకంటే అపశకునం అని . బాలయ్య జాతకాలు , ముహుర్తాలు బాగా నమ్ముతాడన్న విషయం అందరికీ తెలిసిందే . వాటి ప్రకారం చూస్తే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి అంటే అపశకునం కాబట్టి టీజర్ ని రిలీజ్ చేసి బాధపడటం ఎందుకు ? పైగా ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా కాబట్టి వద్దు అని డిసైడ్ అయ్యారట . 
అందుకే ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ రిలీజ్ వాయిదా పడింది . టీజర్ వాయిదా పడింది కానీ త్వరలోనే ఓ మంచి రోజు చూసి టీజర్ ని వదులుతారట . అలాగే రెగ్యులర్ షూటింగ్ వచ్చి మార్చిలో ప్రారంభం అవుతుందని స్పష్టం చేసాడు బాలయ్య . తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య స్వయంగా నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు .