భాగమతి ఓవర్సీస్ టాక్ ఎలా ఉందో తెలుసా


ఈరోజు అనుష్క నటించిన భాగమతి భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . ఆల్మోస్ట్ జనవరి నెల అయిపోతోంది అయితే తెలుగు సినిమా పరిశ్రమకు ఈ కొత్త ఏడాది లో ఇంతవరకు సాలిడ్ హిట్ లభించలేదు దాంతో ఈ భాగమతి ఆ లోటుని భర్తీ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు బయ్యర్లు . ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇండియాలో రిలీజ్ అవుతుండగా ఓవర్ సీస్ లో మాత్రం కొద్దిగంటల ముందే ప్రీమియర్ షోలు కూడా అయిపోయాయి . మన రిజల్ట్ రావడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది కానీ ఓవర్సీస్ టాక్ వచ్చేసింది . 
 
ఇంతకీ ఓవర్ సీస్ టాక్ ఏంటో తెలుసా ……. భాగమతి హిట్ అని . టీజర్ , ట్రైలర్ ని చూసి బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ ఫస్టాఫ్  కథనం కొంత మందకొడిగా సాగిందట అయితే సెకండాఫ్ లో అనుష్క భాగమతిగా విశ్వరూపం చూపించిందని ,తప్పకుండా అనుష్క కెరీర్ లో ఇదొక మైలురాయి అని అంటున్నారు . యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు , రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది అన్నింటికీ మించి అనుష్క నటన హైలెట్ గా నిలిచింది . మొత్తానికి తెలుగు సినిమాకు ఈ ఏడాది ఆరంభంలో వస్తున్న మంచి హిట్ .