భరత్ అనే నేను 2 రోజుల కలెక్షన్లు


bharath ane nenu 2 days world wide collectionsభరత్ అనే నేను రెండు రోజుల్లో 80 కోట్ల వసూళ్ల ని సాధించి వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది . ఈరోజు ఆదివారం కావడంతో అన్ని చోట్లా దాదాపుగా ఫుల్స్ అవ్వడం ఖాయం అంటే మూడు రోజుల్లో వంద కోట్లని అవలీలగా దాటుతుంది . ఫస్ట్ వీకెండ్ లోనే వంద కోట్ల మైలురాయి ని చేరుకుంటే మొదటి వారంలో 140 నుండి 150 కోట్ల మధ్యలో వసూల్ చేయడం ఖాయం . మొదటి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు వస్తే 200 కోట్ల ని సాధించడం పెద్ద విశేషమేమీ కాదు .

రెండు రోజుల్లో 80 కోట్ల వసూళ్ల ని సాధించి మహేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడని , అతడి స్టామినా ఏంటో చూపించాడని ఉమైర్ సందు ట్వీట్ చేసాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే . మహేష్ ముఖ్యమంత్రిగా అద్భుతంగా నటించగా కైరా అద్వానీ మహేష్ కు మంచి జోడి అనిపించుకుంది . దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది .